దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులను కాపాడేందుకు ఉద్దేశించిన వివాదాస్పద ఆర్డినెన్స్‌పై బుధవారంకేంద్ర కేబినెట్ చ ర్చించనుంది.
న్యూఢిల్లీ: దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులను కాపాడేందుకు ఉద్దేశించిన వివాదాస్పద ఆర్డినెన్స్‌పై బుధవారంకేంద్ర కేబినెట్ చ ర్చించనుంది. రెండవ తేదీన జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌పై చర్చించి దానిని ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులు తక్షణమే సభ్యత్వం కోల్పోకుండా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిశీలనలో ఉంది. ఆయన బుధవారం నాడే విదేశీ పర్యటనకు వెళుతున్నారు.
దీన్ని ప్రతిపక్షాలతో పాటు, రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్డినెన్స్ అర్థరహితమని, దాన్ని చించి చెత్తబుట్టలో పారవేయాలని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వానికి తెలియజేయడమే కాంగ్రెస్ పని అని, రాహుల్ తన అభిప్రాయాలు చెప్పారని కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ తెలిపారు. ఆర్డినెన్స్‌పై మొదట కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని, ఆతర్వాతే దానిని ఉపసంహరించుకోవచ్చన్నారు.