రాష్ట్రపతి భవన్‌కు టీ-బిల్లు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు - 2013 శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌కు చేరినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించకపోయినా ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు.. శుక్రవారం రాత్రి విభజన బిల్లుతో కూడిన ఫై లు కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి సచివాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గురువారం రా త్రి హోంమంత్రి షిండే విలేకరులతో మాట్లాడుతూ.. శుక్ర, శనివారాల్లో బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హోంశాఖ వర్గాలను సంప్రదించగా.. విభజన బిల్లుకు సంబంధించిన ఫైలును రాష్ట్రపతి కార్యాలయానికి చేర్చినట్లు తెలిసింది. అయితే.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం మధ్యాహ్నమే 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ బయల్దేరి వెళ్లారు. శుక్ర, శని, ఆదివారాల్లో బెం గాల్ పర్యటన ముగించుకుని ఆది వారం మధ్యాహ్నానికి ఢిల్లీకి తిరిగిరానున్నారు. ఆ వెంటనే బిల్లును పరిశీలిస్తారని, దానిపై వెంటనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎప్పుడు పంపుతారు? ఎంత గడువిస్తారు?
విభజన బిల్లుపై ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే శాసనసభ అభిప్రాయానికి పంపిస్తారు. బిల్లును అసెం బ్లీకి ఎప్పుడు పంపాలి, శాసనసభ అభిప్రాయం తెలి యజేయటానికి ఎన్ని రోజుల సమయం ఇవ్వాలి అనే అంశాలపై ప్రణబ్ నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీకి 10 - 15 రోజుల గడువు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతున్నా.. గతంలోని సంప్రదాయాన్ని పాటిస్తే 40 రోజుల గడువు ఇచ్చే వీలుంది. అదే జరిగితే ఈ శీతాకా ల సమావేశాల్లో బిల్లు పెట్టటం కుదరకపోవచ్చు. అ ప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిం చటం అనివార్యమవుతుంది. కాగా బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పెట్టటానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నారు.