president bhavan
-
బెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా మాజీ బ్యూరోక్రట్ సీవీ ఆనంద బోస్(71)ను నియమించింది రాష్ట్రపతి భవన్. ఈ మేరకు గురువారం ఆనంద బోస్ నియామకాన్ని ధృవీకరించింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నియామకం అమల్లోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ప్రెస్ సెక్రటరీ అజయ్ కుమార్ పేరిట విడుదలైన సర్క్యులర్ వెల్లడించింది. గతంలో బెంగాల్ గవర్నర్‌గా ఉన్న ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి మణిపూర్ గవర్నర్ లా గణేశన్ అయ్యర్ ప్రస్తుం అదనపు బాధ్యతలు చేపట్టారు. అయితే.. గవర్నర్ గణేశన్, బెంగాల్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెదలడంపై ప్రతిపక్ష బీజేపీ అసంతృప్తితో రగిలిపోతోంది. ఈ క్రమంలో బెంగాల్‌కు పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు విజ్ఞప్తులు చేస్తూ వస్తోంది. రిటైర్డు ఐఏఎస్ అధికారి అయిన బోస్ కేరళలోని కొట్టాయంకు చెందినవారు. జవహార్‌లాల్ నెహ్రూ ఫెలోషిఫ్‌కు ఎంపికయ్యారు ఆయన. ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీతోనూ ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. రచయితగా ఆంగ్లం, మలయాళం, హిందీ భాషల్లో 40 పుస్తకాలు రాశారు. ఎన్నో నవలలు, లఘు కథలు, పద్యాలు, ఉపన్యాసాలు రచించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంతోనూ ఆయన మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రధాని మోదీ హయాంలో అభివృద్ధి కోసం ఏర్పాటైన ఓ సంస్థలో ఆయన చైర్మన్‌గా పని చేశారు. అంతేకాదు.. ఆయన రూపొందించిన ‘అందరికీ సరసమైన గృహాలు’ అనే భావన కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందింది కూడా. -
నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రధాని మోదీ, అమిత్ షా అభినందలు
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకార కార్యక్రమం.. అప్డేట్స్ TIME: 3.00PM రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపదికి ముర్ముకు దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. దేశానికి ఇదొక ఉద్వేగభరిత క్షణాలని హర్షం వ్యక్తం చేశారు. TIME: 2.30PM కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు. ముర్ము తన పదవీకాలంలో దే శ గర్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని నమ్మకం ఉందన్నారు. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు అని అన్నారు. 11:35AM ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత.. ఆమె మొదటి గార్డ్ ఆఫ్ ఆనర్‌ను తనిఖీ చేశారు. #WATCH President Droupadi Murmu inspects her first Guard of Honour after taking the oath, at Rashtrapati Bhavan in Delhi pic.twitter.com/T47qfSWHBu — ANI (@ANI) July 25, 2022 11:00AM ►రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము ► 10:48AM గుర్రపు కవాతు నడుమ అధికారిక వాహనంలో రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► 10:47AM పార్లమెంట్ హాల్ నుంచి రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► హాల్ నుంచి బయటకు వచ్చిన రాష్ట్రపతి ముర్ము. వెంట.. సీజే ఎన్వీ రమణ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, స్పీకర్ ఓం బిర్లా. గౌరవ వందనం స్వీకరణ. ► 10:44 AM ముర్ము ప్రసంగం అనంతరం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. అనంతరం ప్రధాని , కేంద్ర మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులకు అభివాదం చేశారు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ► 10:15AM రాష్ట్రపతి హోదాలో ముర్ము తొలి ప్రసంగం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగం దేశ ప్రజలకు కృతజ్ఞతలు నాపై మీరు చూపిన ప్రేమ, అభిమానం, నమ్మకం రాష్ట్రపతి బాధ్యతలు నిర్వర్తించడానికి ప్రోత్సహిస్తాయి దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టేందుకు కృషి చేస్తా మా గ్రామం పదో తరగతి చదువుకున్న మొదటి బాలికను నేను: ముర్ము భారత్ ప్రగతి పథంలో నడుస్తోంది. ఇంకా వేగంగా అభివృద్ది చెందాలని ఆశిస్తున్నా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ► 10:12AM భారత రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణం భారత దేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు ద్రౌపది ముర్ము. ప్రమాణం చేయించారు భారత దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. అనంతరం పదవీ పత్రాలపై ఆమె సంతకాలు చేశారు. ► 10:08AM పార్లమెంట్‌కు చేరిన కోవింద్, ముర్ము పార్లమెంట్‌కు చేరుకున్న రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. వెంట సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ముర్ముకు త్రివిధ దళాల గన్ సెల్యూట్. ► 10:00AM పార్లమెంట్ సెంట్రల్ హాల్లో 15వ రాష్ట్రపతిగా సీజే ఎన్వీ రమణ సమక్షంలో ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము. ► పార్లమెంట్‌కు బయలుదేరిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ► రాష్ట్రపతి ఫోర్‌కోర్టులో గౌరవ వందనం స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ము. ► రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మాగాంధీకి ద్రౌపది ముర్ము నివాళులు. #DroupadiMurmu at Rajghat before taking oath as President NDTV's Sunil Prabhu reports pic.twitter.com/jsrQ30X4Sw — NDTV (@ndtv) July 25, 2022 ► ఉదయం 10గం.15ని. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతిగా ప్రమాణం చేయనున్న ద్రౌపది ముర్ము ► ప్రమాణం తర్వాత 21 గన్ సెల్యూట్ స్వీకరించనున్న ద్రౌపది ముర్ము. ► ఈ కార్యక్రమంలో పాల్గొననున్న ఉప రాష్ట్రపతి, ప్రధాని, స్పీకర్ తదితరులు పాల్గొననున్నారు. ► ప్రమాణం అనంతరం నూతన రాష్ట్రపతిగా ముర్ము ప్రసంగిస్తారు. ►భారత 15వ రాష్ట్రపతిగా గిరిజన ఆడబిడ్డ ద్రౌపది ముర్ము(64) ఇవాళ(సోమవారం) ప్రమాణం చేయనున్నారు. ► పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉదయం 10.15 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ► సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించనున్నారు. ► తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న ప్రమాణం చేశారు. అయితే.. 1977 తర్వాత జూలై 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్న పదో రాష్ట్రపతిగా ముర్ము చరిత్రలో నిలిచిపోనున్నారు. ► నీలం సంజీవరెడ్డి ఆరవ రాష్ట్రపతిగా 1977 సంవత్సరం జూలై 25న ప్రమాణం చేశారు. ► ప్రమాణ స్వీకారం, ప్రసంగం తర్వాత ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. అక్కడ సైనిక సిబ్బంది ఆమెకు గౌరవ వందనం సమర్పిస్తారు. -
పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు
సాక్షి, న్యూఢిల్లీ/మదనపల్లె సిటీ(చిత్తూరు జిల్లా)/రాజాం: వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ప్రకటించిన పద్మ పురస్కారాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం ఢిల్లీలో ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 2020వ సంవత్సరానికి సంబంధించి మొత్తం 141 పురస్కారాలను అందజేశారు. ఏడుగురు పద్మ విభూషణ్, 16 మంది పద్మభూషణ్, 118 మంది పద్మశ్రీ అవార్డులు స్వీకరించారు. ఇందులో మొత్తం 33 మంది మహిళలున్నారు. ఏపీ నుంచి ముగ్గురు.. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు ‘పద్మ’ అవార్డులు అందుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, చిత్తూరు జిల్లా మదనపల్లె వాస్తవ్యులు, సత్సంగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ముంతాజ్ అలీ పద్మభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా మందరాడకు చెందిన నాటకరంగ కళాకారుడు యడ్ల గోపాలరావు, అనంతపురం జిల్లాకు చెందిన తోలుబొమ్మలాట కళాకారుడు దాళవాయి చలపతిరావు రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. తెలంగాణ నుంచి రైతు శాస్త్రవేత్త చింతల వెంకట్‌రెడ్డి, సంస్కృత వాచస్పతిగా పేరొందిన శ్రీభాష్యం విజయసారథి పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు పాల్గొన్నారు. అందరి సంతోషం కోసం.. ముంతాజ్ పద్మభూషణ్ పురస్కారం అందుకున్న ముంతాజ్ అలీ కేరళలోని తిరువనంతపురంలో జన్మించారు. 19 ఏళ్ల వయసులోనే హిమాలయాలకు వెళ్లారు. అక్కడ మధుకర్‌నాథ్‌తో ఏర్పడిన పరిచయం ద్వారా వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకోవడంతో పాటు «ధ్యానం, క్రియా యోగాల్లో శిక్షణ తీసుకున్నారు. 1996లో చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. 2015లో వాక్ ఆఫ్ హోప్ యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు యాత్ర చేశారు. నక్కలదిన్నె సమీపంలో సత్సంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడే గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహిస్తున్నారు. యోగా, ధ్యానంపై ప్రచారం చేస్తూ ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దేశవిదేశాల్లో సత్సంగ్ ఆధ్యాత్మిక సంస్థలు పనిచేస్తున్నాయి. అందరూ సంతోషంగా ఉండాలన్న ఆశయంతో ముంతాజ్ అలీ పనిచేస్తున్నారు. కళే.. ఇంతవాడిని చేసింది పద్మశ్రీ పురస్కారం నా బాధ్యతను మరింత పెంచింది. నాకు పురస్కారాలు, సత్కారాలు వస్తాయని ఏనాడూ అనుకోలేదు. నా జీవనం కోసం కళను నమ్ముకున్నాను. ఆ కళే నన్ను ఇంతవాడిని చేసింది. నక్షత్రక పాత్రే నాకు ఇంతటి ఖ్యాతిని తెచ్చిపెట్టింది. నాలో ఉన్న నటుడిని.. నా గురువు యడ్ల సత్యంనాయుడు ప్రపంచానికి పరిచయం చేస్తే, నాకు అన్ని విధాలా నా భార్య జయమ్మ సహకరించింది. మందరాడ గ్రామ ప్రజలంతా నన్ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. బాలభారతి కళా నాట్యమండలికి, కుటుంబీకులకు, తోటి కళాకారులకు, మందరాడ గ్రామస్తులకు ఈ పురస్కారం అంకితం. – పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్ల గోపాలరావు -
‘పద్మ’ పురస్కారాల ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: 2019 ఏడాదికిగానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్లో ఘనంగా జరిగింది. మొత్తం 112 మందికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలు ప్రకటించగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా 47 మందికి ప్రదానం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిగిలిన వారికి ఈ నెల 16న అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ‘రైతు నేస్తం’ వ్యవస్థాపక అధ్యక్షుడు యడ్లపల్లి వెంకటేశ్వరావు పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.ప్రముఖ నటుడు మోహన్‌లాల్, అకాలీదళ్ నాయకుడు సుఖ్‌దేవ్ సింగ్ దిండ్సా, బిహార్ నాయకుడు హుకుందేవ్ నారాయణ్ యాదవ్, ప్రముఖ జర్నలిస్టు కుల్దీప్ నయ్యర్ తరఫున ఆయన సతీమణి భారతి నయ్యర్ పద్మభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. గాయకుడు శంకర్ మహదేవన్, నటుడు ప్రభుదేవా, టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్‌కమల్ తదితరులు పద్మశ్రీ పురస్కారాలు స్వీకరించారు. రైతాంగానికి నా పురస్కారం అంకితం సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని తెలుగు రాష్ట్రాల రైతాంగానికి అంకితమిస్తున్నట్లు యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. అవార్డు అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు మరింత అవగాహన కల్పించేందుకు జిల్లాలు, మండలాల స్థాయిలో మోడల్ ఫాంలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు ‘రైతు నేస్తం’ కృషి చేస్తుందని, సేంద్రియ వ్యసాయంలో రైతులకు శిక్షణ ఇచ్చి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేలా వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ వసతి కూడా కల్పిస్తుందన్నారు. యువత కూడా వ్యవసాయం వైపు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పద్మ పురస్కారాల గ్రహీతలు ప్రభుదేవా, సామాజిక కార్యకర్త బంగారు అడిగలార్, శంకర్ మహదేవన్, శివమణి, మోహన్‌లాల్ -
మెగాస్టార్ సినిమాను చూడనున్న రాష్ట్రపతి
ముంబై: ఆధునిక మహిళపై సాగుతున్న అత్యాచారాలను, చూపుతున్న వివక్షతను ప్రశ్నిస్తూ రూపొందించిన సినిమా పింక్. మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ లో , తాప్సీ మరో కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమాలో ఆండ్రియా తరియంగ్, కీర్తి కుల్హర్లు లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించటమే కాక విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించబడటమే కాక ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీక్షించనున్నట్టు బిగ్ బీ తన బ్లాగ్‌లో వెల్లడించారు. శనివారం చిత్ర బృందంతో కలిసి ప్రణబ్ సినిమాను వీక్షించనున్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు సినిమా చూడటం తన అదృష్టంగా భావిస్తున్నానని తాప్సి తెలిపారు. అమితాబ్ బైపోలార్ డిజార్డర్ తో ఇబ్బంది పడే లాయర్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ రాయ్ చౌదరి దర్శకుడు. -
ప్రణబ్‌జీ నా గురువు!
నా వేలు పట్టుకుని అవగాహన కల్పించారు: మోదీ - రాష్ర్టపతి భవన్లో మ్యూజియం రెండో దశ ప్రారంభం న్యూఢిల్లీ : ‘రెండేళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు.. ఈ ఢిల్లీ ప్రపంచం, ఈ వాతావరణం అంతా నాకు కొత్త. అప్పటినుంచి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాకు ఒక గురువులా, సంరక్షకుడిలా, మార్గదర్శిలా నిలిచారు. నా వేలు పట్టుకుని పలు కీలకాంశాల్లో నాకు అవగాహన కల్పించారు. ఆ అదృష్టం లభించిన అతికొద్ది మందిలో నేనొకడిని’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కొనియాడారు. రాష్ట్రపతిగా ప్రణబ్ బాధ్యతలు స్వీకరించి 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. రాష్ట్రపతి భవన్‌లోని మ్యూజియం రెండో దశను మోదీ సోమవారం ప్రారంభించారు. చరిత్ర పరిరక్షణకు రాష్ట్రపతి తీసుకుంటున్న చర్యలను ప్రధాని ప్రశంసించారు. సుదీర్ఘప్రజా జీవితంలో దేశానికి ప్రణబ్ గొప్పగా సేవలందించారన్నారు. ‘నా రాజకీయ నేపథ్యం.. ప్రణబ్‌జీ రాజకీయ నేపథ్యం వేర్వేరు. రెండు విభిన్న నేపథ్యాలున్న వ్యక్తులు ఈ ప్రజాస్వామ్యంలో కలిసికట్టుగా పనిచేయడం ఎలా సాధ్యమవుతుందో ప్రణబ్జీతో కలిసి పనిచేస్తే అర్థమవుతుంది’ అని పొగడ్తల్లో ముంచెత్తారు. దేవాలయాల్లోని ప్రతిమలు రాతితోనే తయారైనప్పటికీ.. ప్రజల భక్తి వాటిని దైవాలుగా మార్చిందని, అలాగే చారిత్రక ప్రదేశాల్లోని రాళ్లు.. చరిత్రను కళ్లకు గడుతూ భవిష్యత్తులోకి తీసుకెళ్తాయన్నారు. ప్రణబ్ మాట్లాడుతూ.. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించకముందు రాష్ట్రపతి భవన్ గురించి తనకు కొద్దిగానే తెలుసని, భవన్‌లోని భోజన శాల, అశోకాహాల్, స్టడీహాళ్లను మాత్రమే చూశానని గుర్తు చేసుకున్నారు. 1950లో బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారతదేశ ప్రజాస్వామ్యం క్రమక్రమంగా బలోపేతమవుతూ వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్ర మహాజన్, మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ తదితరులు పాల్గొన్నారు. రెండో దశ మ్యూజియంలో.. రాష్ట్రపతి భవనం నిర్మాణం, అందులో నివసించిన బ్రిటిష్ వైస్రాయ్‌లు, స్వాతంత్య్ర పోరాట గాథలు, స్వాతంత్య్రం అనంతరం 13 మంది రాష్ట్రపతుల జీవిత విశేషాలు.. మొదలైనవాటిని ఆధునిక సాంకేతిక హంగులతో తీర్చిదిద్దారు. -
రామోజీ, రజనీలకు ‘పద్మ’ ప్రదానం
యార్లగడ్డ, రాజమౌళి, సానియా సహా 56 మందికి అందచేసిన రాష్ట్రపతి ప్రణబ్ సాక్షి, న్యూఢిల్లీ: పద్మ అవార్డుల మలివిడత ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో మంగళవారం వైభవంగా జరిగింది. మొత్తం 56 మందికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అవార్డుల్ని అందచేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్, 11 మందికి పద్మ భూషణ్, 40 మందికి పద్మశ్రీలు ప్రదానం చేశారు. ఆరుగురు తెలుగువారు పద్మ పురస్కారాల్ని స్వీకరించారు. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు పద్మవిభూషణ్, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాలు పద్మభూషణ్‌ను అందుకోగా.. వైద్యుడు మన్నం గోపీచంద్, సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిలు పద్మశ్రీని స్వీకరించారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, డీఆర్డీవో మాజీ చీఫ్ వీకే ఆర్త్రే, ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి, చెన్నై కేన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ వి.శాంతలకు కూడా రాష్ట్రపతి పద్మవిభూషణ్‌ను అందచేశారు. అమెరికా మాజీ రాయబారి రాబర్ట్ డి బ్లాక్విల్, దాత, విద్యావేత్త ఇందూ జైన్, మారుతీ సుజుకి ఇండియా చైర్మన్ ఆర్.సి.భార్గవ, గాయకుడు ఉదిత్ నారాయణ్, మణిపురి రచయిత హైస్నం కన్హయ్‌లాల్, ఆధ్యాత్మిక వేత్త దయానంద సరస్వతి(మరణానంతరం), ప్రఖ్యాత శిల్పి రామ్ వంజి సుతార్, భారతీయ చరిత్ర పరిశోధకుడు ఎన్.రామానుజ తాతాచార్య, చిన్మయ మిషన్ అంతర్జాతీయ విభాగ అధిపతి స్వామి తేజోమయానందలకు పద్మభూషణ్‌ను అందచేశారు. పద్మశ్రీలు.. పద్మశ్రీ అవార్డు అందుకున్నవారిలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా, ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికం, ఎడిటర్స్ గిల్డ్ మాజీ చీఫ్ ధీరేంద్ర నాథ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. పురస్కార గ్రహీతలకు సత్కారం పద్మ పురస్కార గ్రహీతలకు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఢిల్లీలో తేనీటి విందు ఇచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, కేంద్ర మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవదేకర్, పీయూష్ గోయల్, రాజీవ్ ప్రతాప్ రూడీ, ఎంపీలు కేశినేని నాని, మాగంటి బాబు, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ తదితరులు హాజరై పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపారు. పురస్కార గ్రహీతల్ని విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు కూడా తన నివాసంలో సత్కరించారు. రామోజీరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మన్నం గోపిచంద్, సునీతా కృష్ణన్లు పాల్గొన్నారు. బాధ్యత మరింత పెంచింది: సునీతా కృష్ణన్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. ఇది నా పోరాటానికి గుర్తింపు. అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది. దేశంలో ఆడపిల్లలు, మహిళలు అమ్ముడుపోకుండా ఉండడ మే నా పోరాట లక్ష్యం. అధికారభాషా చట్ట అమలుకు కృషి: యార్లగడ్డ ఏ భాషా సంస్కృతుల వల్ల ఈ స్ధాయికి చేరానో వాటి అభివృద్ధికి కృషి చేస్తా. ఏపీలో అధికార భాషా చట్టం అమలుకు జీవితాంతం కార్యకర్తలా పని చేస్తా. తెలుగుకు కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా ఇచ్చినా.. సంబంధిత కేంద్రాన్ని ఇంకా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోలేక పోయాం. మరింత ఉత్సాహంతో సేవ చేస్తా: మన్నం రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉంది. మరింత ఉత్సాహంతో కేన్సర్ బాధితులకు సేవ చేస్తా. సంకల్పం బలపడింది: రామోజీ ఆఖరి వరకూ ప్రజాసేవలోనే తరించాలన్న నా నిశ్చయాన్ని ఈ అవార్డు మరింత బలపర్చింది. అవార్డుకు ఎంపిక చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛ పట్ల ఉన్న నిబద్ధత చాటుకుందని భావిస్తున్నా. పాత్రికేయ వృత్తి పట్ల నాకున్న అభిరుచి ఇంతటి గౌరవానికి అర్హుడ్ని చేయడం అంతులేని ఆనందాన్నిచ్చింది. చెప్పలేని అనుభూతి : రాజమౌళి పద్మశ్రీ అందుకోవడం చెప్పలేని అనుభూతి కలిగించింది. రజనీకాంత్, రామోజీరావులతో పాటు అవార్డు అందుకోవడం గొప్పగా ఉంది. దీనిపై మాట్లాడేందుకు పదాలు లేవు. -
అవార్డులు అందుకున్న రజనీ, ప్రియాంక
న్యూఢిల్లీ: పద్మ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం రాష్ట్రపతి భవన్లో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ లాంఛనాల మధ్య రాష్ట్రపతి ప్రణబ్ చేతుల మీదుగా అ అవార్డులను గ్రహీతలు అందుకున్నారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురుకి పద్మ అవార్డుల్లో అత్యున్నతమైన పద్మవిభూషణ్, పదిమందికి పద్మభూషణ్, 40 మందికి పద్మశ్రీ అవార్డులు అందించారు. సినీనటుడు రజనీకాంత్, రామోజీరావు, గిరిజా దేవీ, వాసుదేవ్ కల్ కుంతే ఆత్రే, విశ్వనాథన్ శాంత పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. పద్మభూషణ్ అందుకున్నవారు వీరే.. యార్గగడ్డ లక్ష్మీ ప్రసాద్ సానియామీర్జా రవీంద్రచంద్ర భార్గవ్ ఉదిత్ నారాయణ్ ఇందుజైన్ దయానంద సరస్వతి కన్హయ్యలాల్ రామానుజ తాతాచార్య... వీరితోపాటు మరో 40మంది పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ అందుకున్నవారిలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. -
ఒక్క నెల ఫోన్ బిల్లు రూ.5.06 లక్షలు
ముంబయి: భారత రాష్ట్రపతి భవన్లో నెలకు ఫోన్ బిల్లు ఎంత వస్తుందో మీకు తెలుసా.. అక్షరాల ఐదులక్షల రూపాయల పైమాటే. ఈ విషయం సాధారణంగా మనకు తెలియదు. కానీ, ఆ విషయం తెలుసుకోవాలన్న ఆసక్తి ముంబయిలోని జోగేశ్వరీ ఏరియాకు చెందిన మన్సూర్ దర్వేశ్కు కలిగింది. వెంటనే సామాన్యుడి చేతిలో ఆయుధమైన సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించాడు. ఓ దరఖాస్తు నింపి పంపించి రాష్ట్రపతి భవన్ పూర్తి వివరాలు రాబట్టారు. ఇందులో రాష్ట్రపతి నిలయం నిర్వహణ తీరు తెన్నులు, అందులు పనిచేసే ఉద్యోగుల సంఖ్య, భవన్‌కు కేటాయించిన బడ్జెట్, అందులో ఖర్చు చేసిన మొత్తం, అందులో పనిచేసే ఉద్యోగులకు చెల్లించే జీత భత్యాల వివరాలతోపాటు వ్యయాల వివరాలన్నీ తెలియజేశారు. ఇందులో భాగంగానే ఫోన్ బిల్లు వివరాలు కూడా వచ్చాయి. మార్చి నెలలో ఫోన్ బిల్లు రూ.4.25 లక్షలు రాగా, ఏప్రిల్ నెలలో రూ.5.06 లక్షల బిల్లు వచ్చింది. దీంతో అది చూసి నివ్వెరపోవడం ఆర్టీఐ దరఖాస్తుదారుని వంతైంది. కాగా, 2012-13బడ్జెట్లో రూ.30.96 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. 2014-2015 బడ్జెట్లో రూ. 41.96 కోట్లు రాష్ట్రపతి భవన్‌కు కేటాయించారు. ఇక రాష్ట్రపతి భవన్లో మొత్తం 754 మంది ఉద్యోగులు ఉన్నారని వారిలో తొమ్మిది మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, 27 మంది డ్రైవర్లు, 64 మంది సఫాయికారులు ఉన్నారు. కాగా, వారిలో ఎనిమిదిమంది టెలిఫోన్ నిర్వహణ దారులు ఉన్నారు. కాగా, వీవీఐపీ అతిధుల కోసం కూడా ఈ బడ్జెట్ నుంచే ఖర్చు చేస్తామని ప్రత్యేక నిధి ఏమీ లేదని రాష్ట్రపతి భవన్ స్పష్టం చేసింది. -
నక్షత్ర వాటికను ప్రారంభించిన రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి భవన్లో నక్షత్ర వాటిక ఉద్యానవనాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం అందులోని మొక్కలను పరిశీలించారు. వాటికి సంబంధించిన విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్రపతి భవన్ అధికారులు పాల్గొన్నారు. నక్షత్ర వాటిక సమీపంలో ఉన్న శివాలయంలో ఆయన పూజలు నిర్వహించారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రికెటర్ అజారుద్దీన్, మంత్రి ఇంద్రకిరణ్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని కలిశారు. -
పల్స్ పోలియోను ప్రారంభించిన రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శనివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేసి ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పోలియోను నిర్మూలించాలనే ప్రభుత్వ లక్ష్యంలో భాగంగా జనవరి 18న జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. -
కేబినెట్లో దత్తన్నకు బెర్త్
ఖాయమంటున్న పార్టీ వర్గాలు రాష్ట్రపతి భవన్ నుంచి పిలుపు కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీకి.. సాక్షి, సిటీబ్యూరో: కేంద్రంలో నేడు కొలువుదీరనున్న నరేంద్రమోడి మంత్రివర్గంలో సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు చోటు ఖాయమైంది. రాష్ట్రపతి భవన్ నుంచి వచ్చిన పిలుపుతో ఆయన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. నాలుగుసార్లు ఎంపీగా గెలుపొందిన, ఇప్పటికే కేంద్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన.. ఈసారీ క్యాబినెట్ ర్యాంక్ పదవి వస్తుందన్న ధీమాతో ఢిల్లీ వెళ్లారు. 1991, 1996, 1999 ఎన్నికలతో పాటు ఆయన తాజా ఎన్నికల్లో 2,54,735 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 1999 నుండి 2004 వరకు దత్తాత్రేయ వాజ్పాయ్ మంత్రివర్గంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. గతానుభవం దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి దక్కడం ఖాయమని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాగా, నరేంద్రమోడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు నగరం నుంచి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనసభ్యుడు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి తదితరులు ఆదివారమే ఢిల్లీ చేరుకోగా మిగిలిన నాయకులు సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. మల్కాజిగిరి ఎంపీ ఆశలు తెలంగాణ రాష్ట్రం నుండి తెలుగుదేశం పార్టీ తరపున ఏకైక ఎంపీగా గెలుపొం దిన మల్లారెడ్డి కేంద్ర మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. ఆయన ఆదివారమే ఢిల్లీ వెళ్లినా క్యాబినెట్లో చోటు లభించే అంశంపై మాత్రం ఆయనకు ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో ఆయనకు సోమవారం ఏర్పడే మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవచ్చనే అంచనాకు ఆయన సన్నిహితులు వచ్చారు. -
26న ప్రధాని పీఠంపై మోడీ
► దేశ 14వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం ►రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో కార్యక్రమం; 3 వేల మందికి ఆహ్వానం ►బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ పేరును ప్రతిపాదించిన అద్వానీ; ఏకగ్రీవ ఆమోదం ►ఎన్డీఏ పక్ష నేతగా కూడా మోడీ ఏకగ్రీవం సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజకీయ యవనికపై కొత్త చిత్రం ఆవిష్కృతం కానుంది. భారతదేశ నూతన ప్రధానమంత్రిగా మే 26, సోమవారం నాడు నరేంద్ర మోడీ(63) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు సాయంత్రం ఆరు గంటలకు రాష్ట్రపతి భవన్లో దేశ 14వ ప్రధానమంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ‘మే 26 సాయంత్రం 6 గంటలకు ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానించారు’ అని మంగళవారం రాష్ట్రపతితో భేటీ అనంతరం నరేంద్ర మోడీ తెలిపారు. ప్రధానిగా నియమిస్తూ రాష్ట్రపతి తనకందించిన లేఖను మీడియాకు చూపించారు. మోడీ ప్రచార నేతృత్వంలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి.. మొదటిసారి పూర్తి మెజారిటీ సాధించిన కాంగ్రెసేతర పార్టీగా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతితో మోడీ భేటీ అనంతరం రాష్ట్రపతి భవన్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘నరేంద్రమోడీని తమ పార్లమెంటరీ పక్ష నేతగా బీజేపీ ఎన్నుకున్నందువల్ల, ఆ పార్టీకి లోక్‌సభలో పూర్తి మెజారిటీ ఉన్నందువల్ల, మోడీని భారతదేశ ప్రధానమంత్రిగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నియమించారు. అలాగే, మంత్రివర్గ సహచరుల పేర్లను సూచించాల్సిందిగా మోడీని కోరారు’ అని అందులో పేర్కొన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాల సభ్యుల సంఖ్య 336గా ఉన్నప్పటికీ ప్రధానిగా మోడీ నియామకానికి సంబంధించి బీజేపీ మెజార్టీనే రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకున్నట్లు దీన్నిబట్టి తెలుస్తోంది. బీజేపీ ఎంపీల సంఖ్య 282 ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 272 కన్నా పది ఎక్కువగా ఉంది. అంతకుముందు బీజేపీ పార్లమెంటరీ పక్ష నేతగా మోడీని పార్టీ ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ఆ తరువాత 29 పార్టీల సంకీర్ణం ‘నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్(ఎన్డీఏ)’ కూడా మోడీని నాయకుడిగా ఎన్నుకుంది. అనంతరం బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, పార్టీ అగ్రనేత ఎల్కే అద్వానీల నేతృత్వంలో ఎన్డీఏ సంకీర్ణ పక్ష నేతలు రాష్ట్రపతిని కలిసి.. బీజేపీ, ఎన్డీఏలు నరేంద్రమోడీని తమ నేతగా ఎన్నుకున్న విషయాన్ని తెలియజేశారు. మోడీని ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆహ్వానించాల ని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాష్ట్రపతి భవన్ వెలుపల రాజ్‌నాథ్‌సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. 335 మంది ఎంపీలున్న 10 ఎన్డీఏ పక్ష పార్టీల మద్దతు లేఖలు తమ దగ్గర ఉన్నాయన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 3,000 మందిని ఆహ్వానించాలనుకుంటున్నామని తెలిపారు. అనంతరం మోడీ రాష్ట్రపతి ప్రణబ్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇరువురు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. భారీ విజయాన్ని సాధించిన మోడీని ప్రణబ్ స్వాగతించి అభినందించారు. మోడీ పుష్పగుచ్ఛాన్ని రాష్ట్రపతికి అందజేయగా, ప్రతిగా రాష్ట్రపతి పుష్పగుచ్ఛాన్ని మోడీకి అందజేసి అభినందనలు తెలిపారు. మోడీ పేరును ప్రతిపాదించిన అద్వానీ దేశ రాజధానిలో మంగళవారం ఉదయం నుంచి నూతన ప్రభుత్వ ఏర్పాటుపై పలు కీలక సమావేశాలు జరిగాయి. గుజరాత్ భవన్ నుంచి ఉదయం 11.45 గంటలకు బయలుదేరిన మోడీ 12 గంటల సమయంలో పార్లమెంటు ప్రాంగణానికి చేరుకున్నారు. తొలిసారిగా పార్లమెంటు సెంట్రల్ హాల్‌కు వచ్చిన మోడీకి పార్టీ నేతల నుంచి ఘన స్వాగతం లభించింది. అద్వానీకి మోడీ పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ పక్ష సమావేశం జరిగింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత పేరును ప్రతిపాదించే బాధ్యతను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన రాజ్‌నాథ్.. అద్వానీకి అప్పగించారు. ఎన్నికల ప్రచార సారథిగా, ప్రధాని అభ్యర్థిగా మోడీని పార్టీ ఎన్నికల కన్నా ముందే ప్రకటించిందని, అదే నిర్ణయాన్ని పునరుద్ఘాటిస్తున్నానని చెబుతూ అద్వానీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని ప్రతిపాదించారు. భారత్‌మాతాకీ జై అనంతరం, అద్వానీ ప్రతిపాదనకు మురళీ మనోహర్ జోషీ, వెంకయ్యనాయుడు, గడ్కారీ, సుష్మ, అరుణ్ జైట్లీ తదితరులు ఆమోదం తెలిపారు. సభ్యులు కూడా మోడీని ప్రధానిగా సమర్థిస్తూ అంతా నిల్చొని ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.రాజ్‌నాథ్ మాట్లాడుతూ ‘ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీ పేరును అద్వానీ ప్రతిపాదించారు. సీనియర్ నేతలతో సహా పార్టీ పార్లమెంటరీ పార్టీ మొత్తం మద్దతు తెలిపింది(మధ్యలో మోడీ కలుగచేసుకుని అందరినీ అడగండి అని రాజ్‌నాథ్‌కు సూచించగా.. రాజ్‌నాథ్ నవ్వుతూ ‘నేను అందరి చేతులను చూస్తున్నా. అందరూ చప్పట్లు కొడుతున్నారు’ అని సమాధానమిచ్చారు). ఏకగ్రీవ తీర్మానం మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా మోడీని పేరును ప్రకటిస్తున్నాను’ అని పేర్కొన్నారు. మోడీకి పుష్పగుచ్ఛాలు అందించి రాజ్‌నాథ్, అద్వానీలు అభినందించారు. పార్టీ సీనియర్ నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు మోడీని అభినందించారు. కొత్త ఎంపీలు తమ స్థానాల్లో బల్లలను చరుస్తూ, నిల్చొని మోడీని అభినందించారు. భారత్‌మాతా కీ జై అనే నినాదాలతో సెంట్రల్ హాల్ హోరెత్తింది. బీజేపీ ఎంపీలు 282 మందితో పాటు ఇతర నేతలు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. మోడీనే మా నాయకుడు: ఎన్డీఏ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ తర్వాత 29 పార్టీల ఎన్డీఏ సమావేశం జరిగింది. ఎన్డీఏ చైర్మన్ అద్వానీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కూటమి నేతగా ఎన్నుకున్న మోడీని మిత్రపక్షాల నేతలు అభినందించారు. రాజ్‌నాథ్ ఎన్డీఏ పక్షాల పేర్లను చదువుతూ మోడీకి, సభ్యులకు పరిచయం చేశారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్‌లను మోడీ ప్రత్యేకంగా అభినందించారు. ‘విజయ్‌కాంత్ సతీమణి ఎక్కడ? ఆమెను పరిచయం చేయాలి. ఎన్నికల్లో కష్టపడ్డార ’ంటూ మోడీ ఆమెను సభికులకు పరిచయం చేశారు. పవన్ కల్యాణ్ కూడా మోడీని కలిశారు. మోడీ నేతృత్వంలో దేశం ప్రగతిపథంలో పయనిస్తుందన్న నమ్మకం ఉందని ఎన్డీఏ పక్ష నేతలు అన్నారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. ‘బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ.. ఒకవేళ పూర్తి మెజారిటీ రాకపోతే ఎన్డీఏ మిత్రపక్షాలు ఎంత ముఖ్యమో.. ఇప్పుడూ అంతే ముఖ్యమైనవి. ఈ ప్రభుత్వం మీది. దీన్ని సమష్టిగా నడిపించాలి’ అన్నారు. ఏపీలో విజయం సాధించిన చంద్రబాబును మోడీ ప్రత్యేకంగా అభినందించారు. సీమాంధ్రలో బీజేపీ-టీడీపీ కూటమికి అభినందనలు తెలుపుతున్నామన్నారు. మిత్రపక్ష నేతల ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు.. ‘మోడీ నేతృత్వంలో ప్రపంచంలోని శక్తిమంతమైన దేశాల సరసన భారత్ చేరుతుంది. ఎంతోమంది నాయకులను చూశాను. కానీ మోడీలో ఉన్న పట్టుదల, పని పూర్తి చేయాలన్న ఉత్సాహం అద్భుతం. మోడీలో అసాధారణ శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. 2019లోనూ.. ఆ తరువాత అనేక పర్యాయాలు కూడా మోడీనే ప్రధాని అవుతారన్న నమ్మకం నాకుంది. అదే మా ఆశ.. ఆకాంక్ష’ - టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ‘బీజేపీ నేతృత్వంలో 25 ఏళ్లుగా పోరాడుతూ వచ్చాం. ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి’ - శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ‘మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వల్లే ఎన్డీఏకు అత్యధిక స్థానాలు లభించడమనే అద్భుతం జరగింది’ - లోక్‌జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్‌పాశ్వాన్ ‘బీజేపీ, అకాలీదళ్‌లు పాత మిత్రులు. మా అనుబంధం ‘కిచిడీ’ లాంటిది’ - అకాలీదళ్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ కాషాయ రెపరెపలు పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కాషాయం రంగే ప్రముఖంగా కనిపించింది. బీజేపీకి, హిందూ మతానికి సంబంధించిన రంగుగా కాషాయాన్ని గుర్తిస్తారు. కొత్తగా ఎంపీలుగా ఎన్నికైన సభ్యులు చాలామంది కాషాయరంగు కుర్తాలు, స్కార్ఫ్‌లు, జాకెట్లు ధరించి సమావేశానికి హాజరయ్యారు. మహిళా సభ్యులు పలువురు కాషాయ వర్ణపు చీరలు ధరించారు. రాష్ట్రపతిభవన్ ఆవరణలో ప్రమాణం సాధారణంగా రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాల్‌లో ప్రమాణ స్వీకారం నిర్వహిస్తుంటారు. 500 మందికన్నా మంది అతిథులను ఆహ్వానిస్తే అక్కడ కార్యక్రమం నిర్వహించడం కుదరదు. మోడీ ప్రమాణానికి 3,000 మందిని ఆహ్వానించాలనుకుంటున్నారు. కాబట్టి అంతమంది సౌకర్యంగా కూర్చోవడానికి రాష్ట్రపతి భవన్ ప్రాంగణం అనుకూలంగా ఉంటుందని మోడీ భావన. మోడీ కన్నా ముందు ఈ ప్రాంగణంలో వాజ్‌పేయి, చంద్రశేఖర్‌లు ప్రమాణం చేశారు. మారిన పీఎంవో ‘ట్విట్టర్’ హ్యాండిల్ మోడీ కొద్దిరోజుల్లో ప్రధాని కానుండగా, ప్రధాని కార్యాలయం మంగళవారం తన ‘ట్విట్టర్’ హ్యాండిల్‌ను మార్చుకుంది. మన్మోహన్ సింగ్ ప్రధాని పదవిలో ఉండగా ప్రారంభించిన ట్విట్టర్ హ్యాండిల్ ‘పీఎంవో ఇండియా’@P MOIndiaను ‘పీఎంవో ఇండియా ఆర్కైవ్స్’ @PMOIndiaArchive గా మార్చుకుంది. ప్రధాని కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. పాలనలోను, ప్రభుత్వ ఆస్తులలోను కొనసాగింపు భారత రాజ్యాంగ లక్షణమన్నారు. ప్రధాని కార్యాలయం ట్విట్టర్ ఖాతా జాతీయ ఆస్తి అని, ప్రధాని కార్యాలయం నుంచి వైదొలగుతున్న బృందం దానిని మార్చడం అనైతికం, అమర్యాదకరం, చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు. -
రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్‌లో యువతి ఆత్మహత్య
రాష్ట్రపతి భవన్ క్వార్టర్స్‌లో యువతి ఆత్మహత్యరాష్ట్రపతి భవన్ ఆవరణలో గల సర్వెంట్స్ క్వార్టర్స్‌లోని ఓ నివాసంలో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంచలనం సృష్టించింది. సాజియా (26) అనే యువతి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండగా శుక్రవారం తెల్లవారుజాము ఐదున్నర గంటల సమయంలో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్టు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. సాజియా తన తండ్రికి కేటాయించిన క్వార్టర్స్‌లోని నివాసముంటోందని పోలీసులు తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, ఘటనాస్థలిలో ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని చెప్పారు. -
ప్రజలతో భేటీ కార్యక్రమంగా రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ప్రజలతో భేటీ కార్యక్రమంగా మారింది. జాతీయ గీతాలాపన, ముఖ్యఅతిథిగా విచ్చేసిన జపాన్ ప్రధాని అబే సహా వీవీఐపీలతో పలకరింపులు ముగిసిన వెంటనే ప్రణబ్ ఆహూతుల వద్దకు నడిచి వెళ్లారు. విభిన్నంగా జరిగిన ఈ కార్యక్రమం వివరాలు... హాజరైన అతిథులందరినీ పలకరించేందుకు ఆయన మొఘల్ గార్డెన్స్ అంతా కలియ తిరిగారు. రాష్ట్రపతిని పలకరించేందుకు వచ్చిన వారికి ఆయన భద్రతా సిబ్బంది సైతం ఎలాంటి ఆటంకం కల్పించకపోవడం విశేషం. రెండువేల మంది రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. {పణబ్ను నిశితంగా గమనించిన జపాన్ ప్రధాని అబె, తాను కూడా ఆయన మార్గంలోనే మొఘల్ గార్డెన్స్ అంతటా కలియ తిరిగి ప్రజలను పలకరించడం ప్రారంభించారు. రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్(94)ను పలకరించిన అబే, ఆయనతో ముచ్చటించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ సైతం తమ తమ కుర్చీలను విడిచిపెట్టి, జనంలో కలిసిపోయి ఉత్సాహంగా గడిపారు. దాదాపు 25 నిమిషాల సేపు ప్రజలతో భేటీ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ తిరిగి వీవీఐపీ ఎన్‌క్లోజర్ వద్దకు చేరుకున్నారు. -
రాష్ట్రపతి భవన్‌కు టీ-బిల్లు?
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు - 2013 శుక్రవారం రాత్రి రాష్ట్రపతి భవన్‌కు చేరినట్లు ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించకపోయినా ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు.. శుక్రవారం రాత్రి విభజన బిల్లుతో కూడిన ఫై లు కేంద్ర హోంశాఖ కార్యాలయం నుంచి రాష్ట్రపతి సచివాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. గురువారం రా త్రి హోంమంత్రి షిండే విలేకరులతో మాట్లాడుతూ.. శుక్ర, శనివారాల్లో బిల్లును రాష్ట్రపతికి పంపిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హోంశాఖ వర్గాలను సంప్రదించగా.. విభజన బిల్లుకు సంబంధించిన ఫైలును రాష్ట్రపతి కార్యాలయానికి చేర్చినట్లు తెలిసింది. అయితే.. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం మధ్యాహ్నమే 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ బయల్దేరి వెళ్లారు. శుక్ర, శని, ఆదివారాల్లో బెం గాల్ పర్యటన ముగించుకుని ఆది వారం మధ్యాహ్నానికి ఢిల్లీకి తిరిగిరానున్నారు. ఆ వెంటనే బిల్లును పరిశీలిస్తారని, దానిపై వెంటనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఎప్పుడు పంపుతారు? ఎంత గడువిస్తారు? విభజన బిల్లుపై ఎలాంటి అభ్యంతరం లేకపోతేనే శాసనసభ అభిప్రాయానికి పంపిస్తారు. బిల్లును అసెం బ్లీకి ఎప్పుడు పంపాలి, శాసనసభ అభిప్రాయం తెలి యజేయటానికి ఎన్ని రోజుల సమయం ఇవ్వాలి అనే అంశాలపై ప్రణబ్ నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీకి 10 - 15 రోజుల గడువు ఇవ్వవచ్చని ప్రచారం జరుగుతున్నా.. గతంలోని సంప్రదాయాన్ని పాటిస్తే 40 రోజుల గడువు ఇచ్చే వీలుంది. అదే జరిగితే ఈ శీతాకా ల సమావేశాల్లో బిల్లు పెట్టటం కుదరకపోవచ్చు. అ ప్పుడు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను నిర్వహిం చటం అనివార్యమవుతుంది. కాగా బిల్లును ప్రస్తుత సమావేశాల్లోనే పెట్టటానికి ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్తున్నారు.