ప్రజలతో భేటీ కార్యక్రమంగా రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’ | prseident at home meeting with peoples | Sakshi
Sakshi News home page

ప్రజలతో భేటీ కార్యక్రమంగా రాష్ట్రపతి ‘ఎట్ హోమ్’

Published Mon, Jan 27 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM

prseident at home meeting with peoples

 న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమం ప్రజలతో భేటీ కార్యక్రమంగా మారింది. జాతీయ గీతాలాపన, ముఖ్యఅతిథిగా విచ్చేసిన జపాన్ ప్రధాని అబే సహా వీవీఐపీలతో పలకరింపులు ముగిసిన వెంటనే ప్రణబ్ ఆహూతుల వద్దకు నడిచి వెళ్లారు. విభిన్నంగా జరిగిన ఈ కార్యక్రమం వివరాలు...
     హాజరైన అతిథులందరినీ పలకరించేందుకు ఆయన మొఘల్ గార్డెన్స్ అంతా కలియ తిరిగారు.
     రాష్ట్రపతిని పలకరించేందుకు వచ్చిన వారికి ఆయన భద్రతా సిబ్బంది సైతం ఎలాంటి ఆటంకం కల్పించకపోవడం విశేషం.
 
 రెండువేల మంది రాష్ట్రపతి భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు.
     {పణబ్‌ను నిశితంగా గమనించిన జపాన్ ప్రధాని అబె, తాను కూడా ఆయన మార్గంలోనే మొఘల్ గార్డెన్స్ అంతటా కలియ తిరిగి ప్రజలను పలకరించడం ప్రారంభించారు.
 
 రిటైర్డ్ ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్(94)ను  పలకరించిన అబే, ఆయనతో ముచ్చటించారు.
     కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, బీజేపీ నేత సుష్మా స్వరాజ్ సైతం తమ తమ కుర్చీలను విడిచిపెట్టి, జనంలో కలిసిపోయి ఉత్సాహంగా గడిపారు. దాదాపు 25 నిమిషాల సేపు ప్రజలతో భేటీ తర్వాత రాష్ట్రపతి ప్రణబ్ తిరిగి వీవీఐపీ ఎన్‌క్లోజర్ వద్దకు చేరుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement