controversial Ordinance
-
ట్రంప్ ఎన్నికపై సైన్యంలో రుసరుసలు!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. దీంతో అమెరికా రక్షణ శాఖలో కొత్త పరిణామాలు సంభవించబోతున్నాయి. విదేశాల నుంచి సామూహిక వలసలను కఠినంగా అణచివేస్తానని, అక్రమ వలసదార్లపై కచ్చితంగా చర్యలుంటాయని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. వలసలను కట్టడి చేయడానికి సైనిక దళాల సేవలు వాడుకుంటామని చెప్పారు. దేశంలో తన వ్యతిరేక గళాలపైనా ఆయన విరుచుకుపడే అవకాశం కనిపిస్తోంది. ప్రత్యర్థులకు వేధింపులు తప్పవన్న ప్రచారం సాగుతోంది. దేశంలో చట్టాల పటిష్ట అమలుకు యాక్టివ్–డ్యూటీ దళాలను రంగంలోకి దించుతానని ట్రంప్ చెప్పారు. సైన్యంలో తిష్టవేసిన అవినీతిపరులను ఏరిపారేస్తానని ప్రకటించారు. తన ప్రభుత్వంలో విధే యులకు ప్రాధాన్యం ఇస్తానని అన్నారు. సొ ంత ఇంటి(స్వదేశం) లోని శత్రువులపైకి సైన్యాన్ని పంపిస్తానని చెప్పారు. మరోవైపు తన అవసరాల కోసం సైన్యాన్ని వాడుకోవడంలోనూ ఆయన సిద్ధహస్తుడే. ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైనప్పుడు ఆయన దుందుడుకు చర్యలను సైనికాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా వారితో ఆయనకు విభేదాలు ఏర్పడ్డాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న కొందరు సైనిక జనరల్స్ బలహీనులు, అసమర్థులు అని ట్రంప్ విమర్శించారు. ఇప్పుడు మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయన తీరుపై అమెరికా సైన్యంలో చర్చ మొదలైంది. ఒకవేళ ట్రంప్ వివాదాస్పద ఆదేశాలు ఇస్తే ఏం చేయాలి? ఎలా ప్రతిస్పందించాలన్న దానిపై ఇటీవల పెంటగాన్ అధికారులు సమావేశమైన చర్చించుకున్నట్లు తెలిసింది. ఈ భేటీ అనధికారికంగానే జరిగింది. ట్రంప్ ఆదేశాలు అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉంటే సున్నితంగా తిరస్కరించడమే మేలని కొందరు అభిప్రాయపడినట్లు సమాచారం. ట్రంప్ మళ్లీ ఎన్నిక కావడం సైన్యంలో చాలామందికి ఇష్టం లేనట్లు తెలుస్తోంది. చట్టానికే విధేయులం.. అమెరికా అధ్యక్షుడంటే సమస్త సైనిక దళాలకు సుప్రీం కమాండర్. ఆయన ఆదేశాలను అధికారులు అమలు చేయాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్‌పై సైన్యంలో స్పష్టమైన విముఖత కనిపిస్తోంది. ట్రంప్ వర్సెస్ అమెరికా మిలటరీ అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. ట్రంప్‌తో సైన్యానికి ఉన్న గత అనుభవాలే ఇందుకు కారణం. ఆయన మళ్లీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత రక్షణశాఖను ప్రక్షాళన చేస్తారని అంచనా వేస్తున్నారు. తన విధేయులకు పెద్దపీట వేయడంతోపాటు తనను వ్యతిరేకించేవారిని లూప్లైన్లోకి పంపిస్తారని చెబుతున్నారు. అన్ని రకాల ప్రతికూల పరిణామాలకు సిద్ధమవుతున్నామని ట్రంప్ వ్యతిరేక అధికారులు కొందరు వ్యాఖ్యానించారు. అధ్యక్షుడి హోదాలో ఆయన చట్టవిరుద్ధమైన ఆదేశాలు ఇస్తే వ్యతిరేకిస్తామని, ఎదురు తిరుగుతామని కొందరు పేర్కొంటున్నారు. తాము కేవలం చట్టానికి మాత్రమే విధేయులమని, ట్రంప్‌నకు గానీ, ఆయన ఇచ్చే చట్టవిరుద్ధ ఆదేశాలకు గానీ కాదని ఓ అధికారి స్పష్టంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వివాదాస్పద ఉత్తర్వులపై వెనక్కి తగ్గిన సర్కార్
లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కార్మికుల పనిగంటలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. సాధారణంగా కార్మికులు 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దీనిని సవరిస్తూ యోగి సర్కార్..రోజుకు 12 గంటలు పనిచేయాల్సిందిగా వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. (లాక్డౌన్: సీఎం యోగి కీలక నిర్ణయం ) కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నాలుగు కార్మిక చట్టాలను మినహాయించి అన్నింటినీ సవరించాలని ఇటీవలె యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాపార రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని కార్మిక చట్టాల పరిధి నుంచి వ్యాపారాలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగానే కార్మికుల పని గంటలు పెంచింది. కాగా, తాజా హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పనిగంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. (గృహ రుణాలపై వడ్డీ తీసుకోకూడదు: ప్రియాంక ) -
కళంకిత ఆర్డినెన్స్‌పై యూపీఏ యూ టర్న్!
కళంకిత ఆర్డినెన్స్ అటకెక్కింది. రాహుల్ గాంధీ ఆశించినట్లే ఆ ఆర్డినెన్స్‌ను కేంద్రప్రభుత్వం ఉపసంహరించింది. దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హులను చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు వ్యతిరేకంగా ఈ ఆర్డినెన్స్‌ను కేంద్రం రూపొందించిన సంగతి తెల్సిందే. ఆర్డినెన్స్‌పై రాహుల్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కేంద్రం యూ టర్న్ తీసుకుంది. దాంతోపాటు పార్లమెంటు ముందున్న ప్రజాప్రాతినిధ్య చట్టసవరణ బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రోజంతా ప్రధాని వరుస సమావేశాలు... సమాలోచనల అనంతరం సాయంత్రం కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్ సూచించినట్లుగా కేంద్రం ఆ ఆర్డినెన్స్‌ను చించి పారేయకపోయినా దానిని ఉపసంహరించడం ద్వారా ప్రధాని అధికారాలను, ఆయన విశ్వసనీయతను చించిపారేసినట్లయింది. కేబినెట్లోనూ, కోర్కమిటీలోనూ సుదీర్ఘ చర్చల తర్వాత రూపుదిద్దుకున్న ఈ ‘అనర్హత ఆర్డినెన్స్’పై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీరిగ్గా స్పందించడం వివాదాస్పదంగా మారింది. అదీ ప్రధాని అమెరికా పర్యటనలో ఒబామా సహా వివిధ దేశాధ్యక్షులతో సమావేశాలకు సమాయత్తమవుతుండగా రాహుల్ గాంధీ ‘అనర్హత ఆర్డినెన్స్‌పై నిప్పులు చెరగడం సంచలనంగా మారింది. ఆర్డినెన్స్‌పై రాహుల్ విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి కూడా. ఇపుడు ఆర్డినెన్స్ ఉపసంహరణతో వివాదం సమసిపోయినా ప్రధాని విశ్వసనీయతపై ఇది చెరగని మచ్చ వేసినట్లయిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం సాయంత్రం ప్రధాని నివాసంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్‌ను, బిల్లును ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని సమావేశం అనంతరం కేంద్ర మంత్రి మనీష్ తివారీ విలేకరులకు తెలిపారు. ప్రధాని వరుస భేటీలు వారం రోజుల సుదీర్ఘ పర్యటన అనంతరం అమెరికా నుంచి వచ్చిన ప్రధాని బుధవారం ముందుగా రాహుల్‌తో భేటీ అయ్యారు. రాహుల్ ప్రధానిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. ‘‘ఆర్డినెన్స్‌పై కేవలం ప్రజల సెంటిమెంటును వ్యక్తం చేశానేగానీ, మిమ్మల్ని బాధపెట్టాలని కాదు’’ అంటూ రాహుల్ వివరించారు. ప్రభుత్వం చేసిన ఆర్డినెన్స్ మతిలేని చర్యగా రాహుల్ గాంధీ గతవారం విమర్శించిన విషయం తెలిసిందే. ఆర్డినెన్స్‌ను చించిపారేయాలని, ఇలా రాజీ పడుతూ పోతే అన్నింటా రాజీ పడాల్సి వస్తుందంటూ తన తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. వీరి భేటీ తర్వాత కాంగ్రెస్ కోర్‌గ్రూప్ సమావేశం జరిగింది. ఇందులో ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి షిండే, అహ్మద్ పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభిమతాన్ని సోనియాగాంధీ ప్రధానికి తెలియపరిచారు. రాహుల్ ఎందుకు అలా వ్యాఖ్యానిం చాల్సి వచ్చిందన్నదానినీ వివరించారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతోనూ ప్రధాని మన్మోహన్ సింగ్ భేటీ అయ్యి ప్రభుత్వ అభిప్రాయాలను తెలియజేశారు. మిత్రపక్షాలతో సంప్రదింపులు ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని అనుకుంటున్నట్లు కేబినెట్ భేటీకి ముందే ప్రధాని మిత్రపక్షాలకు తెలియజేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆర్ఎల్డీ అధినేత అజిత్‌సింగ్‌తో ప్రధాని మాట్లాడారు. అటార్నీ జనరల్ వాహనవతి అభిప్రాయాలను కూడా తెలుసుకున్నారు. దీనిపై మీడియా అజిత్‌సింగ్‌ను ప్రశ్నించగా ప్రభుత్వ నిర్ణయం పట్ల సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. కేబినెట్ సమావేశంతో ముగింపు టచ్ ముందుగానే స్పష్టమైన నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం, బుధవారం సాయంత్రం ప్రధాని నివాసంలో జరిగిన కేబినెట్ సమావేశంతో ఆర్డినెన్స్‌కు మంగళం పాడింది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం 20 నిమిషాలలో ముగిసింది. ఆర్డినెన్స్‌తోపాటు, బిల్లును కూడా ఉపసంహరించుకోవాలని తీర్మానించింది. ప్రజాభిప్రాయానికి తగినట్లు తీసుకున్న నిర్ణయంగా దీనిని మనీష్ చెప్పారు. సమావేశంలో కేంద్ర మంత్రి కపిల్ సిబల్ రాహుల్ డిమాండ్‌నే మరోసారి వినిపించారు. ఆర్డినెన్స్‌పై జరిగిన వరుస పరిణామాలను ఎన్సీపీ అధినేత కేంద్ర మంత్రి శరద్‌పవార్ ఈ సందర్భంగా తప్పుబట్టారు. మిత్రపక్షాలను సంప్రదించకుండా ప్రభుత్వం అనుసరించిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా రాహుల్ ఇలా మాట్లాడాల్సి ఉండరాదని, ప్రధాని తిరిగి వచ్చే వరకూ వెచి ఉంటే బావుండేదన్న ఎన్సీ నేత, కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా మాత్రం సమావేశంలో మాట్లాడలేదని సమాచారం. ఇక స్టాండింగ్ కమిటీ ముం దున్న బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్లకు తెలియజేయనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఎస్పీ ప్రభుత్వ నిర్ణయాన్ని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యతిరేకించింది. ప్రధాని ఆర్డినెన్స్‌కు మద్దతుగానే నిలవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వెలుపలి నుంచి ఇస్తున్న తమ పార్టీ మద్దతు కొనసాగుతుందని లాలూ ప్రసాద్ సారధ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ప్రకటించింది. తమ పార్టీ అధినేత లాలూను రక్షించేందుకే కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందనే ప్రచారంపై ఆర్జేడీ ఉపాధ్యక్షుడు రఘువంశ ప్రసాద్ విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవడం తప్ప మరో మార్గం లేదని వామపక్షాలు కేబినెట్ భేటీకి ముందే పేర్కొన్నాయి. మన్మోహన్ సింగ్ షాడో ప్రధానిగా సీపీఐ ఎంపీ గురుదాస్ దాస్‌గుప్తా వ్యాఖ్యానించారు. ఆర్డినెన్స్ వ్యవహారం యూపీఏ, కాంగ్రెస్ అంతర్గత వ్యవహారంగా పేర్కొన్నారు. రాహుల్ గాంధీ తన పార్టీ స్వప్రయోజనాల కోసం ఆర్డినెన్స్‌పై ప్రకటన చేసినా, ప్రజలకు మేలు చేశారని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఎన్ సంతోష్ హెగ్డే వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి తెలిసివచ్చిందన్నారు. తాము మొదటి రోజు నుంచీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. మాది, దేశ ప్రజల విజయం: బీజేపీ తాము తీసుకొచ్చిన ఒత్తిడి వల్లే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ పేర్కొంది. ఇది దేశ ప్రజల అభిమతంగా, వారి విజయంగానూ అభివర్ణించింది. ఇది సుప్రీంకోర్టు అభిప్రాయమని బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి తెలిపారు. ప్రజలు, ప్రతిపక్షాల నిరసనల వల్ల ఇది సాధ్యమైందన్నారు. అఖిలపక్ష సమావేశంలో బీజేపీ కూడా అంగీకరించిందని, దాంతోనే ఆర్డినెన్స్‌ను రూపొందించామంటూ కేంద్ర మంత్రి కమల్‌నాథ్ వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు. మరోవైపు రాహుల్ గాంధీ వైఖరిపై బీజేపీ పలు సందేహాలను లేవదీసింది. రాహుల్ వ్యతిరేకత వల్లే కేంద్రం ఆర్డినెన్స్‌పై వెనక్కి తగ్గిందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో బీజేపీ అధికార ప్రతినిధి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. యూపీఏ ప్రభుత్వంలో ఒకదాని తర్వాత ఒక స్కాములు వరుసగా బయటకు వస్తుంటే రాహుల్ ఒక్క మాటా మాట్లాడకుండా ఉండి, ఇప్పుడు ఆర్డినెన్స్‌పై నోరువిప్పడం తీవ్రమైన అనుమానాలను కలిగిస్తోందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సుప్రీం తీర్పు నుంచి ఉపసంహరణ వరకు వయా రాహుల్ దోషులుగా తేలి, క్రిమినల్ కేసుల్లో రెండేళ్లు అంతకంటే ఎక్కువ శిక్ష పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని జూలై 10న సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. కేంద్ర అఖిల పక్ష భేటీ అనంతరం అనర్హత వేటు నుంచి ప్రజాప్రతినిధులను కాపాడేందుకు వీలుగా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేస్తూ ఒక బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. {పతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో బిల్లును స్టాండింగ్ కమిటీ పరిశీలనకు నివేదించడానికి ప్రభుత్వం అంగీకరించింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో నేరచరితులైన ప్రజాప్రతినిధులపై వెంటనే వేటు పడకుండా ఉండడానికి సెప్టెంబర్ 24న కేబినెట్ ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చింది. తర్వాత రోజు నుంచి విపక్షాలు ఆందోళన మొదలు పెట్టాయి. ఆర్డినెన్స్ అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని విమర్శించిన బీజేపీ నేతలు సెప్టెంబర్ 26న రాష్ట్రపతిని కలసి ఆర్డినెన్స్ వెనక్కి పంపాల్సిందిగా వినతి పత్రం సమర్పించారు. వెంటనే స్పందించిన రాష్ట్రపతి ఆర్డినెన్స్‌పై వివరణ ఇవ్వాల్సిందిగా హోం మంత్రి షిండేను, న్యాయమంత్రి కపిల్ సిబల్‌ను ఆదేశించారు. సెప్టెంబర్ 27న ప్రధాని మన్మోహన్ అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలిసేందుకు సమాయత్తమవుతుండగా.. ఇక్కడ రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌పై నిప్పులు చెరిగారు. దాన్నో నాన్సెన్స్గా అభివర్ణించడమే కాకుండా, చింపి చెత్తబుట్టలో పడేయాలన్నారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ చర్చించిన మీదటే ఆర్డినెన్స్‌పై నిర్ణయం తీసుకున్నామని అక్టోబర్ 1న మన్మోహన్ వెల్లడించారు. ఆర్డినెన్స్‌పై మరోసారి కేబినెట్లో చర్చిస్తామని, ఆ నిర్ణయం ప్రకారమే ముందుకు వెళ్తామని ప్రకటించారు. కోర్‌కమిటీ సమావేశానికి ముందు రాహుల్‌ను ఆయన నివాసంలో ప్రధాని కలుసుకున్నారు. అనంతరం కోర్ కమిటీ కూడా ఆర్డినెన్స్ ఉపసంహరణకు మద్దతిచ్చింది. తర్వాత రాష్ట్రపతిని ప్రధాని కలిశారు. చివరిగా కేబినెట్ భేటీలో ఇందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు. 72 మంది ఎంపీలపై ‘అనర్హత’ కత్తి! న్యూఢిల్లీ: వివిధ క్రిమినల్ అభియోగాలను ఎదుర్కొంటున్న 72 మంది ఎంపీలు దోషులుగా తేలి, వారికి రెండేళ్లకు మించి శిక్షలు పడినట్లయితే, వారిపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన తాజా అధ్యయనంలో వెల్లడించింది. వీరిలో బీజేపీ ఎంపీలు 18 మంది, కాంగ్రెస్ ఎంపీలు 14 మంది, సమాజ్‌వాదీ పార్టీ (8), బీఎస్పీ (6), ఏఐఏడీఎంకే (4), జేడీయూ (3), సీపీఎం (2) ఉన్నారు. మిగిలిన 17 మంది ఇతర పార్టీలకు చెందిన వారు. ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణంలో కాంగ్రెస్ ఎంపీ రషీద్ మసూద్‌ను ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చగా, దాణా కుంభకోణం కేసులో రాంచీలోని సీబీఐ కోర్టు ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ సహా పలువురిని దోషులుగా తేల్చిన దరిమిలా ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. 2009 లోక్‌సభ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో 2008లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 4,807 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 1,460 మంది (30 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించారు. రాహుల్ ముద్ర పడాల్సిందేనా? తాజా పరిణామాల తర్వాత ఢిల్లీ రాజకీయ వర్గాల్లో పలు ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.. ప్రధాని స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నారు. కానీ, ఇక రాహుల్ సమ్మతి లేకుండా ఏదైనా నిర్ణయం తీసుకోగలరా? లేదా చట్టాన్ని తీసుకురాగలరా? భవిష్యత్తులోనూ రాహుల్ ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోరని ప్రధాని భావిస్తున్నారా? విదేశీ ప్రతినిధులతో చర్చల సందర్భంగా, ఒప్పందాల సమయంలో ‘ఇందుకు రాహుల్ సర్ అనుమతి ఉందా’ అన్న ప్రశ్న ఎదురైతే ప్రధాని వారిని ఒప్పించగలరా? {పభుత్వ నిర్ణయాన్ని.. ప్రజాస్వామ్యంపై కుట్రగా సమాజ్‌వాదీ పార్టీ అభివర్ణించింది. తాజా పరిణామం ప్రభుత్వం కంటే వ్యక్తులే బలవంతులన్న సంకేతాన్ని ఇస్తోందని పేర్కొంది. యూపీఏ పాలనలో ఒకవైపు ప్రభుత్వ సంస్థలు, శాఖల విధ్వంసం, మరోవైపు వరుస స్కాములు, ఇప్పుడు ప్రధాన మంత్రి కార్యాలయం ప్రతిష్టకు పణంగా పెట్టడం గమనార్హం. -
'ఆర్డినెన్స్ ఉపసంహరణ కేబినెట్ ఏకగ్రీవ నిర్ణయం'
న్యూఢిల్లీ: దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాలని కేంద్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుందని సమాచార శాఖ మంత్రి మనీష్ తివారి తెలిపారు. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్‌లోనూ బిల్లు ఉపసంహరణకు తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు ఆయన చెప్పారు. ప్రజాప్వామ్యంలో ఏకపక్ష నిర్ణయం మంచిది కాదని ప్రధాని చెప్పారని ఆయన వెల్లడించారు. వివాదస్పద ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాలని కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతించాయి. అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ వ్యతిరేకిస్తే వెనక్కుతగ్గుతారా అంటూ సమాజ్‌వాదీ పార్టీ ప్రశ్నించింది. -
'నాన్సెన్స్' ఆర్డినెన్స్ ఉపసంహరణ
న్యూఢిల్లీ: దోషులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ వెనక్కి తీసుకుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును కూడా ఉపసంహరించుకుంది. ఆర్డినెన్స్ ఉపసంహరణ తీర్మానాన్ని రాష్ట్రపతికి పంపించనుంది. రేపు రాజ్యసభ చైర్మన్‌కు బిల్లు ఉపసంహరణ లేఖ ఇవ్వనుంది. ఆర్డినెన్స్‌ను రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించడంతో కాంగ్రెస్ వెనక్కు తగ్గింది. అంతకుముందు ఢిల్లీలో పరిణామాలన్నీ వేగంగా మారాయి. వివాదస్పద ఆర్డినెన్స్‌పై ప్రధాని మన్మోహన్ సింగ్ యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలతో చర్చించారు. న్యాయపరమైన అంశాల గురించి అటార్నీ జనరల్ వాహనవతితో సమాలోచనలు జరిపారు. అమెరికా నుంచి వచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్‌తో రాహుల్ ఈ ఉదయం భేటీ అయ్యారు. ఆర్డినెన్స్‌పై తన అభ్యంతరాలను ప్రధాని వివరించారు. తర్వాత జరిగిన కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలోనూ దీనిపై చర్చ జరిగింది. అనంతరం ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కోర్ కమిటీ చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ సాయంత్రం జరిగిన కేబినెట్ సమావేశంలో ఆర్డినెన్స్, బిల్లు ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఆర్డినెన్స్‌ను నాన్సెన్స్గా రాహుల్ వర్ణించడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కేబినెట్ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవడంతో రాహుల్ తన మాట నెగ్గించుకున్నట్టయింది. -
రాహుల్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: సింధియా
న్యూఢిల్లీ: నేరచరిత ప్రజాప్రతినిధులకు సంబంధించి కేంద్రం ఆమోదించిన వివాదస్పద ఆర్డినెన్స్‌పై రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. 'రాహుల్ అభిప్రాయంతో వందశాతం ఏకీభవిస్తున్నా. రాజకీయాలను ప్రక్షాళించాల్సిన అవసరముంది' అని సింధియా అన్నారు. ఈ ఆర్డినెన్స్‌పై అడిగిన మిగతా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. రాహుల్ దెబ్బతో ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోర్టుల్లో దోషులుగా తేలే చట్టసభల సభ్యులను తక్షణ అనర్హత వేటు నుంచి కాపాడేందుకు తెచ్చిన ఆర్డినెన్స మతిలేని చర్య అని, దాన్ని చింపి పారేయాలని రాహుల్ సంచలన విమర్శలు చేయడం, ఇది విదేశాల్లో ఉన్న ప్రధానిని అవమానించడమేనని, మన్మో„హన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండడం తెలిసిందే. -
రాహుల్, ప్రణబ్‌లను కలిసిన ప్రధాని.. ఆర్డినెన్సుకు చెల్లుచీటీ?
నేరచరితులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్సును కేంద్రకేబినెట్ వెనక్కి తీసుకోవడం దాదాపు ఖరారైపోయింది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, అటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి సుదీర్ఘంగా వారితో చర్చించారు. ఆర్డినెన్సును నాన్సెన్సుగా వ్యవహరించిన రాహుల్‌తో కూడా ప్రధాని తెల్లవారుజామునే చర్చించడం విమర్శలకు దారితీసింది. కొన్ని గంటల తర్వాత పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని సహా ఇతర సీనియర్ నాయకులతో కూడిన కోర్ కమిటీ సమావేశమైంది. ఆర్డినెన్సు ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కొద్దిసేపటి తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయనకు కోర్ కమిటీ చర్చలపై వివరించారు. సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు. సెప్టెంబర్ 24వ తేదీనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించినా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దే పెండింగులో ఉంది. ఆయన బుధవారం బయల్దేరి వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆర్డినెన్సును ఉపసంహరించుకుంటే రాజకీయ లబ్ధి కలుగుతుందన్నది కాంగ్రెస్ ఆలోచన. -
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్‌కు వరమా, భారమా?
పార్టీ - ప్రభుత్వం... అధికారంలో ఉన్నవాళ్లకు ఈ రెండూ రెండు కళ్లలా పనిచేయాలి. ఒకే బండికి కట్టిన రెండు గుర్రాల్లా సమానమైన వేగంతో పరుగులు తీయాలి. ఒకదాన్ని దాటి మరొకటి వెళ్లిపోతానంటే.. బండి పరుగు కాస్తా అస్తవ్యస్తం అయిపోతుంది. కేంద్రంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలో యువరాజు రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకించడం, దాదాపుగా ఆ నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి రావడం లాంటి పరిణామాలు ప్రభుత్వానికి మింగుడు పడట్లేదు. రాహుల్ గాంధీని ఒకానొక సమయంలో భావిప్రధానిగా అభివర్ణించిన మన్మోహన్ సింగ్ కూడా.. ఇప్పుడు ఆయనెందుకు ఇలా చేస్తున్నారో తెలియక సతమతం అవుతున్నారు. వివాదాస్పద ఆర్డినెన్స్ తేవడానికి ముందు అదే అంశంపై జరిగిన రెండు కోర్ కమిటీ సమావేశాల్లో కూడా రాహుల్ గాంధీ ఉన్నారు. ఆ సమావేశాలు జరిగినప్పుడే ఆయన దాని గురించి అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటే.. అప్పుడే దాని గురించి ఓ నిర్ణయం తీసుకునేవారు. కానీ ఆయనలా చేయలేదు. ముందునుంచి ఏమీ మాట్లాడకుండా, దాదాపు అంతా అయిపోయిందునుకుంటున్న సమయంలో.. అదికూడా ప్రధానమంత్రి విదేశాల్లో ఉన్నప్పుడు ఆర్డినెన్స్ చెత్తదంటూ వ్యాఖ్యానించడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పడేయడంలో ఒకరకంగా రాహుల్ సక్సెస్ అయితే అయి ఉండొచ్చు గాక. అలాగే, ఆర్డినెన్సును వెనక్కి తీసుకునేలా చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించి ఉండొచ్చు గాక. కానీ, దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి- ప్రభుత్వానికి మధ్య అగాధం మరింత పెరిగిపోతోంది తప్ప ఏమాత్రం తగ్గట్లేదని భావిప్రధానిగా కాంగ్రెస్ శ్రేణులు మొత్తం భుజాన మోసుకెళ్తున్న యువరాజు ఎందుకు గమనించుకోవట్లేదో ఎవరికీ తెలియని విషయం. "ఈ ఆర్డినెన్స్ ఒక నాన్సెన్స్.. దాన్ని చించిపారెయ్యాలి. దాన్ని ఆమోదించడం ద్వారా ప్రభుత్వం తప్పు చేసింది'' అని రాహుల్ గాంధీ ఏకంగా విలేకరుల సమావేశంలోనే వ్యాఖ్యానించారు. వాస్తవానికి కేంద్రం నేరచరితుల ఆర్డినెన్స్‌ను ఎందుకు జారీ చేసిందో అందరికీ తెలుసు. యూపీఏకు మద్దతిస్తున్న అనేక పార్టీలలోని పెద్దమనుషులు చాలామంది మీద లెక్కలేనన్ని కేసులున్నాయి. వరుసగా చూసుకుంటే ములాయం సింగ్ యాదవ్, మాయావతి, లాలూ ప్రసాద్.. ఇలా అందరూ 'పెద్ద మనుషులే'!! ఆర్డినెన్స్‌ను రాష్టపతి ఆమోదించి ఉంటే లాలూ ప్రసాద్ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడేవి కావు. కింద కోర్టుల్లో శిక్ష పడ్డా పై కోర్టుల్లో ఆ శిక్షను ధ్రువపరిచేవరకూ పదవిలో కొనసాగేందుకు వీలు కల్పించిన ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8 (4) చెల్లదంటూ సుప్రీంకోర్టు గత జులైలో ప్రకటించడంతో కలవరపడ్డ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కానీ రాహుల్ వ్యాఖ్యల పుణ్యమా అని ఈ ఆర్డినెన్స్‌ను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో పార్లమెంటు ముందుకు బిల్లు వచ్చినప్పుడు గానీ, జైల్లో ఉన్న నేతలు అక్కడినుంచే పోటీ చేసేందుకు అనుమతించే బిల్లును పార్లమెంటు ఆమోదించినప్పుడు గానీ రాహుల్ గాంధీ చర్చల్లో పాల్గొనలేదు. ఆర్డినెన్సు జారీ అయినప్పుడు రాహుల్ ఏ కలుగులో దాగున్నారో తెలియదు గానీ, తర్వాత నాలుగు రోజులకు మాత్రం హడావుడిగా ప్రెస్ క్లబ్బులో ప్రత్యక్షమయ్యారు. విదేశాల్లో ఉన్న ప్రధాన మంత్రి పరువును నిండా గంగలో ముంచేసే విధంగా వ్యాఖ్యానాలు చేశారు. ఇంత గొప్ప నాయకుడు ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీ సంతోషించాలో, ఏడవాలో వాళ్లకే తెలియాలి మరి!! -
ప్రధానితో భేటీ అయిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ఉదయం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. నేరచరిత ప్రజాప్రతినిధులకు సంబంధించి కేంద్రం ఆమోదించిన ఆర్డినెన్స్‌పై తీవ్ర రగడ చెలరేగుతున్న వేళ ప్రధానితో రాహుల్ సమావేశం అయ్యారు. సెవెన్ రేస్ కోర్స్ రోడ్డులోని ప్రధాని నివాసానికి వెళ్లిన రాహుల్... ఆర్డినెన్స్‌ను చించి పారేయాలంటూ తాను చేసిన వ్యాఖ్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తన వ్యాఖ్యలపై మన్మోహన్ నొచ్చుకున్నారనే వార్తల నేపథ్యంలో రాహుల్... ప్రధానికి వివరణ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అటు... కాంగ్రెస్ కోర్ కమిటీ కూడా ఇవాళ సమావేశం కానుంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో కోర్ కమిటీ సమావేశమై ఆర్డినెన్స్ సహా తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనుంది. మరోవైపు... ఈ సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఆర్డినెన్స్ అంశంపైనే ఈ భేటీలో చర్చ జరగనుందని సమాచారం. తెలంగాణ నోట్‌పై సమావేశంలో కూడా చర్చ జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. నేర చరితులైన చట్టసభ సభ్యులను రక్షించేందుకు ఉద్దేశించిన ఆర్డినెన్స్‌పై రాహుల్‌గాంధీ నిప్పులు చెరిగిన నేపథ్యంలో తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో మంగళవారం విమానంలోనే విలేఖరులతో మాట్లాడిన ఆయన ‘నేనంత తేలికగా మనస్థాపానికి గురికాను. రాజీనామా చేయను’ అని వ్యాఖ్యానించారు. బుధవారం రాహుల్‌గాంధీతో సమావేశమై ఏ కారణాల వల్ల ఆయన ఈ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించారన్న విషయాన్ని నిర్థారించుకుంటానని మన్మోహన్ తెలిపారు. -
వివాదాస్పద ఆర్డినెన్స్‌పై రేపు కేంద్ర కేబినెట్ చర్చ
న్యూఢిల్లీ: దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులను కాపాడేందుకు ఉద్దేశించిన వివాదాస్పద ఆర్డినెన్స్‌పై బుధవారంకేంద్ర కేబినెట్ చ ర్చించనుంది. రెండవ తేదీన జరిగే మంత్రిమండలి సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌పై చర్చించి దానిని ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. దోషులుగా తేలిన ప్రజాప్రతినిధులు తక్షణమే సభ్యత్వం కోల్పోకుండా ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేస్తూ కేంద్రం ఆర్డినెన్స్‌ను ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పరిశీలనలో ఉంది. ఆయన బుధవారం నాడే విదేశీ పర్యటనకు వెళుతున్నారు. దీన్ని ప్రతిపక్షాలతో పాటు, రాహుల్ గాంధీ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్డినెన్స్ అర్థరహితమని, దాన్ని చించి చెత్తబుట్టలో పారవేయాలని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రభుత్వానికి తెలియజేయడమే కాంగ్రెస్ పని అని, రాహుల్ తన అభిప్రాయాలు చెప్పారని కాంగ్రెస్ ప్రతినిధి సందీప్ దీక్షిత్ తెలిపారు. ఆర్డినెన్స్‌పై మొదట కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని, ఆతర్వాతే దానిని ఉపసంహరించుకోవచ్చన్నారు.