నేరచరితులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్సును కేంద్రకేబినెట్ వెనక్కి తీసుకోవడం దాదాపు ఖరారైపోయింది.
నేరచరితులైన ప్రజాప్రతినిధులను అనర్హులు చేయడాన్ని నిరోధిస్తూ తేవాలని తలపెట్టిన ఆర్డినెన్సును కేంద్రకేబినెట్ వెనక్కి తీసుకోవడం దాదాపు ఖరారైపోయింది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇటు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని, అటు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి సుదీర్ఘంగా వారితో చర్చించారు. ఆర్డినెన్సును నాన్సెన్సుగా వ్యవహరించిన రాహుల్తో కూడా ప్రధాని తెల్లవారుజామునే చర్చించడం విమర్శలకు దారితీసింది.
కొన్ని గంటల తర్వాత పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని సహా ఇతర సీనియర్ నాయకులతో కూడిన కోర్ కమిటీ సమావేశమైంది. ఆర్డినెన్సు ఉపసంహరణపైనే ప్రధానంగా చర్చ జరిగింది. కొద్దిసేపటి తర్వాత ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆయనకు కోర్ కమిటీ చర్చలపై వివరించారు. సాయంత్రం జరిగే కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారు.
సెప్టెంబర్ 24వ తేదీనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించినా, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దే పెండింగులో ఉంది. ఆయన బుధవారం బయల్దేరి వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆర్డినెన్సును ఉపసంహరించుకుంటే రాజకీయ లబ్ధి కలుగుతుందన్నది కాంగ్రెస్ ఆలోచన.