లక్నో : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. కార్మికుల పనిగంటలు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై అలహాబాద్ హైకోర్టు నోటీసులు జారీ చేయడంతో సర్కార్ వెనక్కి తగ్గింది. సాధారణంగా కార్మికులు 8 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దీనిని సవరిస్తూ యోగి సర్కార్..రోజుకు 12 గంటలు పనిచేయాల్సిందిగా వివాదాస్పద ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. (లాక్‌డౌన్: సీఎం యోగి కీలక నిర్ణయం )
కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ కుదేలైన నేపథ్యంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నాలుగు కార్మిక చట్టాలను మినహాయించి అన్నింటినీ సవరించాలని ఇటీవలె యూపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. వ్యాపార రంగాలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని కార్మిక చట్టాల పరిధి నుంచి వ్యాపారాలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనిలో భాగంగానే కార్మికుల పని గంటలు పెంచింది. కాగా, తాజా హైకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా పనిగంటలు పెంచుతూ తీసుకున్న నిర్ణయీన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. (గృహ రుణాలపై వడ్డీ తీసుకోకూడదు: ప్రియాంక )
Comments
Please login to add a commentAdd a comment