రాహుల్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా: సింధియా
న్యూఢిల్లీ: నేరచరిత ప్రజాప్రతినిధులకు సంబంధించి కేంద్రం ఆమోదించిన వివాదస్పద ఆర్డినెన్స్‌పై రాహుల్ గాంధీ వ్యక్తం చేసిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.
'రాహుల్ అభిప్రాయంతో వందశాతం ఏకీభవిస్తున్నా. రాజకీయాలను ప్రక్షాళించాల్సిన అవసరముంది' అని సింధియా అన్నారు. ఈ ఆర్డినెన్స్పై అడిగిన మిగతా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదు. రాహుల్ దెబ్బతో ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.
కోర్టుల్లో దోషులుగా తేలే చట్టసభల సభ్యులను తక్షణ అనర్హత వేటు నుంచి కాపాడేందుకు తెచ్చిన ఆర్డినెన్‌స మతిలేని చర్య అని, దాన్ని చింపి పారేయాలని రాహుల్ సంచలన విమర్శలు చేయడం, ఇది విదేశాల్లో ఉన్న ప్రధానిని అవమానించడమేనని, మన్మో„హన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తుండడం తెలిసిందే.