ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లుగా అధికారికంగా ఆధారమేమీ లేదని హైకోర్టు తెలిపింది. రాష్ట్రాన్ని విభజిస్తున్న విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తదితరులు బహిరంగంగా చెప్పారని ఏపీఎన్జీవోలు కోర్టుకు తెలిపారు. వాస్తవానికి రాష్ట్రాన్ని విభజించేటట్లయితే అలాంటి ప్రకటనను ప్రధాన మంత్రే చేయాల్సి ఉంటుందని.. ఈ సందర్భంగా కోర్టు ఏపీ ఎన్జీవోలకు తెలిపింది.
అయితే... విభజన ప్రకటనను కేంద్రం వెనక్కి తీసుకునే వరకు సమ్మెను మాత్రం తాము కొనసాగించి తీరుతామని ఏపీఎన్జీవోలు తెలిపారు. కానీ, ఏపీ ఎన్జీవోలు.. ఇతరులు చేస్తున్న సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల సమ్మె విరమించాలని కోర్టు వారికి సూచించింది.