తుఫాను తీవ్రస్థాయిలో ఉండటం వల్ల సమ్మెలో ఉన్న ఉద్యోగులంతా మానవతా దృష్టితో వెంటనే విధులకు హాజరు కావాలని జాతీయ విపత్తు నివారణ సంస్థ (ఎన్డీఎంఏ) ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు పిలుపునిచ్చారు. రాబోయే రెండు రోజుల పాటు తుఫాను ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉంటుందని, దీంతోపాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాపై కూడా ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు.
సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్ర ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్రస్థాయిలో సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండటం వల్ల నాలుగు రోజులుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో విద్యత్ సరఫరా లేదు. అయితే, ఇప్పుడు తుఫాను ముప్పు పొంచి ఉన్నందువల్ల విద్యుత్ శాఖ ఉద్యోగులతో పాటు రెవెన్యూ తదితర శాఖల వారు కూడా వెంటనే విధుల్లోకి వచ్చి, బాధితులను ఆదుకోవాలని మర్రి శశిధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
తుఫాను వచ్చింది.. విధుల్లోకి రండి: మర్రి శశిధర్ రెడ్డి
Published Wed, Oct 9 2013 10:46 PM | Last Updated on Wed, Aug 29 2018 8:20 PM
Advertisement