
కావలి : నెల్లూరు జిల్లా కావలిలోని విశ్వోదయ ఇంజనీరింగ్ కళాశాల లేడీస్ హాస్టల్లో విద్యార్థినీలు బుధవారం ఆందోళనకు దిగారు. వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళన నిర్వహించారు. వారం రోజులుగా మేనేజ్‌మెంట్‌కు తెలుపుతున్నా పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి మీడియా కళాశాల దగ్గరకు వివరణ కోరేందుకు వెళ్లగా యాజమాన్యం అడ్డుకుంది. కళాశాలలోకి రాకుండా గేట్లు వేసింది.
Comments
Please login to add a commentAdd a comment