
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (పాత ఫొటో)
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగే ఆందోళనలు చేసేందుకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రం కోసం ఎవరు ఆందోళనలు చేపట్టినా సహకరిస్తామని సాధికార మిత్ర సదస్సులో తెలిపారు. కేంద్రప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే చర్చించడానికి ఎందుకు అంత ఇబ్బందిపడుతున్నారని ప్రశ్నించారు.
అవిశ్వాసానికి సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయించడం ఎంతవరకూ సమంజసమని అన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా రాష్ట్రం కోసం చేసే ప్రతి ఆందోళనకూ ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment