
సాక్షి, కడప: జిల్లాలోని కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని హౌసింగ్ శాఖ ఇన్‌స్పెక్టర్లు ఆందోళనకు దిగారు. కలెక్టర్ కార్యాలయం ఎక్కి నిరసన తెలిపారు. నిరసన కారులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ కొంతమంది హౌసింగ్ శాఖ ఇన్‌స్పెక్టర్లు కలెక్టర్ కార్యాలయం ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హౌసింగ్ శాఖ ఇన్‌స్పెక్టర్లు మీడియాతో మాట్లాడుతూ..వేతనాలు సమయానికి ఇవ్వడంలేదని వాపోయారు. వేతనాలు అడిగితే కేసులు పెడుతున్నారంటూ ఆవేదన వక్యం చేశారు.