సాక్షి,నెట్‌వర్క్: తెలంగాణ రాష్ట్ర అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో బుధవారం నగరం అట్టుడికింది. పలుచోట్ల సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. తెలంగాణ విద్యుత్‌పై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల కు నిరసనగా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ, సమైక్యాంధ్రను కోరుతూ సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చేపట్టిన ధర్నాలతో విద్యుత్‌సౌధ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీమాంధ్ర ఉద్యోగులపై తెలంగాణ ఉద్యోగులు దాడి చేయవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. మెయిన్‌గేట్ నుంచి కార్యాలయానికి వెళ్లేవారి ని తనిఖీలు చేశారు.
మింట్ కాంపౌండ్‌లోని ఏపీసీపీడీసీఎల్ కార్యాలయంలోనికి వెళ్లేందుకు సీమాంధ్ర ఉద్యోగులు ప్రయత్నించగా, తెలంగాణ విద్యుత్ జేఏసీ నాయకులు వారిని అడ్డుకున్నారు. ఉద్యోగులుగా మీ బాధ్యతలు నెరవేర్చుకోండి.. కానీ సమైక్యవాదం పేరుతో రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ రఘు సూచిం చారు. ఇలా రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సీపీడీసీఎల్ జేఏసీ చైర్మన్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో సైఫాబాద్ పోలీసులు జోక్యంచేసుకుని వారిని శాంతింపజేశారు. కార్యక్రమంలో టీ-విద్యుత్ జేఏసీ నాయకులు రవీందర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వాణి, రాజేష్‌లతో పాటు వేయి మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోల సమ్మె బుధవారం కూడా కొనసాగింది. అబిడ్స్ తిలక్ రోడ్డులోని బీమా భవన్, బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో, కోఠి డీఎంహెచ్‌ఎస్‌లో సీమాంధ్ర ఉద్యోగులు సమ్మె కొనసాగించారు. కోఠి డీఎంహెచ్‌ఎస్‌లో ఏపీఎన్జీవోలను సుల్తాన్‌బజార్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశా రు. శాంతియుత పంథాలో సమ్మె నిర్వహిస్తున్న తమను పోలీ సులు అక్రమంగా అరెస్టు చేశార ని ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం సొంత పూచీకత్తుపై వారిని పోలీసులు విడుదల చేశారు.
పోటాపోటీగా ఆందోళనలు
Published Thu, Aug 22 2013 2:02 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM
Advertisement
Advertisement