విజయవాడలో జరిగిన ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు జలీల్‌ఖాన్, కొలుసు పార్థసారథి, వంగవీటి రాధా, గౌతంరెడ్డి తదితరులు
- రాష్ట్రవ్యాప్తంగా వెల్లువెత్తిన ఆందోళనలు
సాక్షి, విజయవాడ బ్యూరో: ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు తక్షణం సీఎం పదవికి రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గళమెత్తారు. మంగళవారం రాష్ర్టవ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించారు. ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించినా మహిళలు, రైతులు, రైతు కూలీలు నిరసనల్లో పాల్గొన్నారు. పలు పార్టీల సానుభూతిపరులు కూడాబాబుకు వ్యతిరేకంగా నినదించారు.
పట్టణాలతో పాటు గ్రామాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరిగాయి. పోలీసులు పలుచోట్ల ముందస్తు అరెస్టులు చేసి కేసులు పెట్టారు. అయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాలు జరిగాయి. మానవహారాలు నిర్మించి అవినీతి చంద్రబాబు ఇంకొద్దు అంటూ నినదించారు. కొద్ది రోజుల క్రితం టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేస్తుంటే ఏమాత్రం అడ్డుకోని పోలీసులు, మంగళవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు చంద్రబాబు దిష్టిబొమ్మలను దహనం చేయడానికి ప్రయత్నించగా అడ్డుకోవడమే కాకుండా ఆందోళన చేస్తున్న వారిని స్టేషన్‌కు తరలించారు.