'ఇక చాలు దిగిపో ' | ysrcp demands chandrababu naidu resignation as involved in vote for note case | Sakshi
Sakshi News home page

'ఇక చాలు దిగిపో '

Published Tue, Jun 9 2015 11:09 AM | Last Updated on Tue, May 29 2018 3:40 PM

'ఇక చాలు దిగిపో ' - Sakshi

'ఇక చాలు దిగిపో '

నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ముడుపులు ఇవ్వజూపిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో సూత్రధారి అయిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ' ఇప్పటివరకూ  చేసిన నీ పాలన చాలు.. ఇక దిగిపో'  అంటూ మంగళవారం వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో పలు ప్రధాన ప్రాంతాల్లో ధర్నాలు చేపట్టింది.

 వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. బద్వేలులో ఎమ్మెల్యే జైరాములు, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. రాజం పేటలో వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. కడపలో ఎమ్మెల్యే అంజాద్ భాషా, మేయర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించి రాస్తారోకో చేశారు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.


చిత్తూరు: పుంగనూరు వైఎస్ఆర్సీపీ నియోజక కన్వీనర్ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మదనపల్లెలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.


నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.


తిరుపతి: వైఎస్ఆర్సీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, లక్ష్మీపార్వతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.


పశ్చిమగోదావరి: పాలకొల్లులో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, రాస్తారోకో చేశారు.


కర్నూలు: వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు.

విశాఖపట్టణం:  మంగళవారం విశాఖ జిల్లాలోని విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు.
ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడిని వెంటనే అరెస్ట్ చేయాలని, ఏ1 ముద్దాయిగా చేర్చాలని
డిమాండ్ చేశారు.

విజయనగరం : విజయనగరం జిల్లా పార్వతీపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో  వైఎస్ఆర్ సీపీ రాస్తారోకో నిర్వహించింది.రాస్తారోకో నిర్వహిస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement