రేవంత్‌రెడ్డి, నోటుకు ఓటు వ్యవహారాన్ని చూసి తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నారని, ఈ విషయంలో చంద్రబాబు తన నిర్దోషిత్వం
పదవికి రాజీనామా చేసి
పేరుతెచ్చుకోండి
సింగపూర్ మంత్రిని
ఆదర్శంగా తీసుకోండి
రేవంత్ ఎపిసోడ్‌లో దర్యాప్తునకు సహకరించండి
చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ నేత ధర్మాన హితవు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : రేవంత్‌రెడ్డి, నోటుకు ఓటు వ్యవహారాన్ని చూసి తెలుగు ప్రజలు సిగ్గుపడుతున్నారని, ఈ విషయంలో చంద్రబాబు తన నిర్దోషిత్వం నిరూపించుకోవాలంటే దర్యాప్తునకు సహకరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు సూచించారు. ఏపీ సీఎం తనపై వచ్చిన ఆరోపణలపై తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలోని వైఎస్సార్ కూడలి వద్ద మంగళవారం వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీ, మానవహారం, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ఏసీబీ కేసులో రేవంత్‌రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినప్పుడు తన బాస్ ఆదేశాలమేరకే నామినే టెడ్ ఎమ్మెల్యేకు డబ్బులిచ్చానని స్పష్టం చేశారని, సాక్ష్యాధారాలూ లభ్యమవ్వడంతో తెలుగు ప్రజలు తలదించుకోవాల్సివచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
తొలుత ఆ వాయిస్ బాబుది కాదని, తరువాత తన ఫోన్‌ను ట్యాపింగ్ చేశారని, అది వేరే చ ట్టం కిందకు వస్తుందని, మరో రోజు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని, ఇరు రాష్ట్రాల మధ్య తగాదాలెందుకని.. ఇలా రోజుకోమాట చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం సబబు కాదని ధర్మాన చెప్పారు. తాజాగా.. ఇది గవర్నర్ తేల్చాల్సిన వ్యవహారం అంటున్నారని, లా అండ్ ఆర్డర్ అంటూ నీతి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్యెల్యేకు డబ్బులు లంచంగా ఇస్తే అది లా అండ్ ఆర్డర్ అవుతుందా? అది రికార్డు చేయడం ట్యాపింగ్‌లోకి వస్తుందా అని ప్రశ్నించారు.
రాజకీయ పదవుల్లో ఉన్నవారిపై ఆరోపణలొస్తే ఆ పదవి నుంచి తక్షణమే తొలగిపోవడం దేశంలో ఆనవాయితీగా వస్తోందని, తనపైనా ఆరోపణలొచ్చినపుడు రాజీనామా చేసిన విషయాన్ని ధర్మాన గుర్తు చేశారు. చంద్రబాబు ప్రతిసారీ సింగపూర్‌ను, ఆ దేశ మంత్రుల్నీ ఆదర్శంగా తీసుకుంటున్నారని, ముడుపుల వ్యవహారంలో కూడా అలాగే వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అక్కడి మంత్రి షణ్ముగంపై ఆరోపణలొస్తే వెంటనే తన పదవికి రాజీనామా చేసేశారని, నిర్దోషి అని తేలిన తరువాతే సింగ పూర్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారని గుర్తుచేశారు. సీఎం రాజీనామా చేసేంతవరకు వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యనిర్వహక మండలి సభ్యుడు అంధవరపు సూరిబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుదు కల్యాణి, నేతలు అంధవరపు వరహానరసింహం(వరం), ఎంవి. పద్మావతి తదితరులు పాల్గొన్నారు.