పిల్లికోటాల్‌లో మొక్క నాటి నీరు పోస్తున్న కలెక్టర్ ధర్మారెడ్డి
మెదక్‌రూరల్ : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. శనివారం మెదక్ మండలం పిల్లికోటల్‌లో మరుగుదొడ్ల వినియోగం, తడిపొడి చెత్త, ప్లాస్టిక్‌ను నిషేధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ పేరిట ప్రభుత్వం ప్రతి గ్రామంలో రూ.12 వేలను ఖర్చుపెట్టి ఇంటింటికీ మరుగుదొడ్లను నిర్మిస్తుందన్నారు. కానీ చాలా మంది మరుగుదొడ్లను వినియోగించడం లేదన్నారు. ఇప్పటి నుండి ఎవరైనా బహిరంగ మలవిసర్జన కోసం చేతిలో డబ్బా పట్టుకొని వెళ్తే సర్పంచ్ ఫొటోలు తీసి పంచాయతీలో పెట్టాలన్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను వాడటం చాలా వ్యాధుల వచ్చే ప్రమాదం ఉందన్నారు. గ్రామాలలో విచ్చలవిడిగా ప్లాస్టిక్ కవర్లను పడేయడం వల్ల అవి గాలికి మురికి కాలువలలో చేరుతాయని తెలిపారు. దీంతో దోమలు అధికమై మలేరియా, చికెన్‌గున్యా, డెంగీ వంటి రోగాలు వస్తున్నాయని తెలిపారు. ప్లాస్టిక్‌తో క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు సోకుతున్నాయని తెలిపారు.
20 రోజుల్లో ‘భగీరథ’ నీళ్లు..
మొక్కలను పెంచడం వల్ల భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా జీవిస్తారన్నారు. ఇష్టానుసారంగా చెట్లను నరికివేస్తుండటంతో అడవులు అంతరించి గాలి కాలుష్యం అధికమైందన్నారు. హరితహారంలో భాగంగా ప్రతి ఏడాది 40 కోట్ల మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. మొక్కలను నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. గ్రామంలో రూ. 10 లక్షలతో శ్మశానవాటికను ఏర్పాటు చేయడంతో పాటు డ్రెయినేజీ వ్యవస్థను బాగు చేయాలని, అంగన్‌వాడీ భవనానికి మరమ్మతులు చేయించాలని సర్పంచ్ యాదాగౌడ్‌ను ఆదేశించారు. అలాగే 20 రోజుల్లో మిషన్ భగీరథ నీళ్లు అందించి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీసీఓ వెంకట్‌రెడ్డి, ఎంపీడీఓ రాంబాబు, ఈఓపీఆర్డీ శ్రీనివాస్, ఏపీఎం ఇందిర, సర్పంచ్ యాదాగౌడ్ చంద్రశేఖర్ ఉన్నారు.
నిత్యావసర సరుకుల పంపిణీకి చర్యలు
సాక్షి, మెదక్ : రేషన్ డీలర్లు సమ్మె విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నందున పేదలకు సరుకులు సకాలంలో అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ధర్మారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో 499 మహిళా సంఘాలు, పట్టణాల్లో 20 మెప్మా«ల ఆధ్వర్యం లోని మహిళా సంఘాల ద్వారా సరుకులు పంపి ణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నటుŠల్ పేర్కొన్నా రు. 46 ఐకేపీ భవనాలు, 417 పంచాయతీ భవనాలు, 10 కమ్యూనిటీ భవనాలు, 45 ఇతర భవనాల్లో సరుకులను నిల్వ చేసి అక్కడే పంపిణీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రేషన్‌కార్డు లబ్ధిదా రులు ఆందోళన చెందవద్దని అందరికీ సకాలంలో సరుకులు అందజేస్తామని వివరించారు. సరుకుల పంపిణీలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే రేషన్‌కార్డు లబ్ధిదారులు 998539089 నంబర్‌కు లేదా 1967 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment