
కంప్యూటర్ ముందు పని చేసే ఉద్యోగాలు ఎక్కువయ్యాయి. ఎక్కువ సమయం తదేకంగా స్క్రీన్‌ను చూడడం ఆరోగ్యానికి హానికరం. కన్ను, మెడ సమస్యలు ఎదురవుతాయి. అందుకే త్రీ ట్వంటీస్ (20–20–20) రూల్ ఒక మంచి ఆలోచన. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి పనిలో బ్రేక్ తీసుకుని కంప్యూటర్ స్క్రీన్ మీద నుంచి దృష్టి మరల్చి 20 అడుగుల దూరంలో ఉన్న ఏదైనా వస్తువుని 20 సెకన్ల పాటు చూడాలి. ఇదే 20–20–20 రూల్. పక్కన ఉన్న ఫొటోను గమనించండి.
∙కంప్యూటర్ బాధితులకు మరో సూచన... కంప్యూటర్ స్క్రీన్ నుండి వచ్చే లైట్ వలన కంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే యాంటీ గ్లేర్ గ్లాసెస్ ధరించాలి. అలాగే మరో సంగతి... కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి కంప్యూటర్ నుంచి వెలువడే కాంతి కంటే ఎక్కువ కాంతిలో ఉండాలి. అప్పుడు కంప్యూటర్ నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావం తీవ్రత తగ్గుతుంది. ఈ స్క్రీన్ కష్టాల్లో కొన్ని ఉద్యోగ, వృత్తుల రీత్యా తప్పని సరి అవుతుంటే మరికొన్ని మనకు మనంగా తెచ్చుకుంటున్న కష్టాలూ ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి స్మార్ట్ ఫోన్‌తో కొనితెచ్చుకునే ఇక్కట్లు.
∙నిద్రపోయే ముందు గదిలో లైట్లు ఆపేసిన తర్వాత కూడా స్మార్ట్ ఫోన్ చూస్తుంటారు. నిద్ర వచ్చే వరకు మాత్రమే అనుకుంటూ చాటింగ్, గేమ్స్, వీడియోలు చూడడం మొదలుపెడతారు. అది అరగంటకు పైగా సాగుతూనే ఉంటుంది. గేమ్ ఆడుతున్నంత సేపూ మెదడు చురుగ్గా ఉంటుంది. ఇక నిద్ర ఎలా వస్తుంది?
Comments
Please login to add a commentAdd a comment