వాషింగ్టన్: భూగోళంపై ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భూమిపై జీవులు భద్రంగా మనుగడ సాగించే పరిస్థితులు కనుమరుగవుతున్నాయి. దీని పరిష్కారానికి నడుం బిగించారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి సౌర కవచం(సోలార్ షీల్డ్)తో పుడమికి రక్షణ కలి్పంచవచ్చంటున్నారు. దీనికి స్పేస్ బేస్డ్ సోలార్ రేడియేషన్ మేనేజ్‌మెంట్ షీల్డ్ (ఎస్‌ఆర్‌ఎం) అని పేరుపెట్టారు.
అమెరికాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ హవాయ్’ ఈ ప్రయోగాన్ని తెరపైకి తెచి్చంది. భూమికి, సూర్యుడికి మధ్య భారీ పరిమాణంలోని గ్రహ శకలాలను గొడుగులా వాడి సూర్యకాంతి నేరుగా భూమిని తాకకుండా నిరోధించవచ్చని తేల్చారు. అయితే, సౌర కవచం కోసం గ్రహ శకలాలను (ఆస్టరాయిడ్లు) ఒకచోటుకి చేర్చడం పెద్ద సవాలేనని సైంటిస్టులు అంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (పీఎన్‌ఏఎస్)’లో ఇటీవలే ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment