సాక్షి, హైదరాబాద్: దేశంలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నా ముప్పు ఇప్పటికీ పూర్తిగా తొలగిపోలేదు. ముఖ్యంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది భవిష్యత్తులో పీపీఈ కిట్లు, శానిటైజర్లు తొడుక్కునే విధులు నిర్వహిస్తున్నారు. అయితే పీపీఈ కిట్లను సురక్షితంగా వదిలి, వైరస్‌ను ఇంటికి తీసుకెళ్లకుండా ఉండేందుకు వీలుగా త్వస్త మ్యాన్యు ఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, సెయింట్ గోబెన్ కంపె నీలు కొత్త ఆవిష్కరణ చేశాయి. త్రీడీ ప్రింటింగ్ సాంకేతికత ద్వారా డాఫింగ్ యూనిట్లను రూపొందించారు.
ఏమిటీ డాఫింగ్ యూనిట్లు..?
ఆరోగ్య సిబ్బంది తమ పీపీఈ కిట్లు, గ్లోవ్స్‌ను సురక్షితంగా వదిలిపెట్టేందుకు ఉపయోగపడే నిర్మాణమే డాఫింగ్ యూనిట్. ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థులు స్థాపించిన త్వస్త మ్యాన్యుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్, సెయింట్ గోబెన్ సంయుక్తంగా 2 యూనిట్లు తయారు చేశారు. ఒకదాన్ని కాంచీపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేశాయి. రెండో యూనిట్‌ను చెన్నైలోని ఒమండురార్ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నిర్మాణంలో ఉన్న మూడో యూనిట్‌ను తిరువళ్లువార్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఏర్పాటు చేయనున్నారు. అతినీల లోహిత కిరణాలు, సీ స్టెరిలైజేషన్ బాక్స్, ఆటోమెటిక్ శానిటైజర్, సోప్ డిస్పెన్సర్ వంటి సౌకర్యాలు ఇందులో ఉంటాయి.
ఇవీ ప్రయోజనాలు..
డాఫింగ్ యూనిట్‌లో పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను సురక్షితంగా విడిచిపెట్టొచ్చు. వైద్యులు, సిబ్బంది షిఫ్ట్‌లు ముగించుకుని వెళ్లేటప్పుడు లేదా విధుల్లోకి చేరేటప్పుడు తమను తాము శానిటైజ్ చేసుకునేందుకూ ఇవి ఉపయోగపడతాయి. త్వస్త మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూష న్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీకి కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అందించామని సెయింట్ గోబెన్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment