
హథ్రాస్(యూపీ): ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన దళిత యువతి కుటుంబానికి పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆమె ఇంటి వద్ద 60 మంది పోలీసులను మోహరించామని, 8 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని శుక్రవారం వెల్లడించారు.
అవసరమైతే గ్రామంలో కంట్రోల్ రూమ్ నెలకొల్పుతామని డీఐజీ శలభ్ మాథూర్ చెప్పారు. బాధిత కుటుంబం భద్రతకు సంబంధించి ఆయన నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు. సీసీ టీవీ కెమెరాలతో అక్కడి పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని పేర్కొన్నారు. పరామర్శించేందుకు వస్తున్న వారి వివరాలను నమోదు చేస్తున్నట్లు స్థానిక ఎస్పీ వినీత్ జైస్వాల్ చెప్పారు. (ఆమె మృత్యు ఘోషకు భయపడే..)
Comments
Please login to add a commentAdd a comment