న్యూఢిల్లీ: జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్‌ను ఢిల్లీకి తరలించి వైద్యం అందించాల్సిందిగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేశించింది. గతేడాది జరిగిన హథ్రాస్ రేప్ బాధితురాలి వద్దకు వెళుతున్నాడన్న ఆరోపణలతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కప్పన్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయనను మంచానికి కట్టేసి వైద్యం అందిస్తున్నారని సిద్ధిఖీ భార్య, కేరళ జర్నలిస్ట్ అసోషియేషన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. మనిషికి ఉన్న స్వేచ్ఛా హక్కు కారణంగా వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ఆరోగ్యం మెరుగయ్యాక తిరిగి మథురలోని జైలుకు తరలించాలని చెప్పింది.
వారి హక్కులకు భంగం కలిగించవద్దు
సాక్షి, న్యూఢిల్లీ: చట్ట ప్రకారం బెయిలు పొందిన వారు విడుదల కావడానికి ఉండే హక్కులకు భంగం కలిగించవద్దని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు బీసీఐ సంయుక్త కార్యదర్శి అశోక్ పాండే లేఖలు రాశారు. బెయిల్ పొందిన వారికి సంబంధించి బెయిలు బాండ్లు, పూచీకత్తులు సమర్పించడానికి న్యాయవాదులకు అవకాశం ఇవ్వాలని సూచించారు. అలా చేయకపోతే బెయిల్ పొందిన వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని ఆ లేఖలో పాండే స్పష్టం చేశారు.
చదవండి: కోవిడ్ రిలీఫ్: ప్రాణాల్ని కాపాడుతున్న భిల్వారా మోడల్
Comments
Please login to add a commentAdd a comment