న్యూఢిల్లీ: కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన ప్రాథమిక హక్కులతో పాటు వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఎయిర్‌సెల్–మాక్సిస్, ఐఎన్‌ఎక్స్ మీడియా కేసుల్లో తన కుమారుడు కార్తీకి కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)లు సమన్లు జారీచేయడంతో పాటు ఇళ్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో చిదంబరం కోర్టును ఆశ్రయించారు. తనతో పాటు కార్తీ పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకపోయినప్పటికీ ఈడీ, సీబీఐలు వేధిస్తున్నాయనీ, ఈ చట్టవిరుద్ధమైన విచారణను వెంటనే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment