
( ఫైల్ ఫోటో )
వైఎస్సార్ కడప: వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేశారు. తక్షణమే శాశ్వత పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. తన ఇంటి పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని.. ఎస్పీకి వైఎస్ సునీతారెడ్డి లేఖ రాశారు. లేఖలో ఫిర్యాదు అంశాలపై డీఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించారు.