పరిశ్రమల్లో ప్రమాదాలపై పటిష్ట చర్యలు | factory,accidents, protection | Sakshi
Sakshi News home page

పరిశ్రమల్లో ప్రమాదాలపై పటిష్టమైన చర్యలు అవసరం

Published Tue, Jul 26 2016 11:59 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

factory,accidents, protection

పరవాడ : పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు యాజమాన్యాలు పటిష్టమైన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ చంద్రశేఖర్‌వర్మ అన్నారు. రాంకీ కమర్షియల్‌ హబ్‌లో భద్రత ప్రమాణాలపై బయోకాన్‌ పరిశ్రమ యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఫార్మాసిటీ పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలపై యాజమాన్యాలు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల్లో ముఖ్యమైన విభాగాల వద్ద పనిచేసే కార్మికులకు అవసరమైన భద్రత పరమైన రక్షణ కల్పించాలన్నారు. అగ్నిప్రమాదాలు నివారించడానికి అవసరమైన యంత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. రియాక్టర్లు, రసాయనాల వద్ద పనిచేసే కార్మికులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. తరచూ జరుగుతున్న ప్రమాదాలపై నిపుణులతో కార్మికులకు అవగాహన కల్పించడానికి యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై చర్యలకు వెనుకాడబోమన్నారు. పరిశ్రమల్లో భద్రత పరమైన లోపాలుంటే సరిచేసుకోవాలని పరిశ్రమ యాజమాన్యాలకు సూచించారు. సదస్సులో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌ చిన్నారావు, బయోకాన్‌ పరిశ్రమ మేనేజర్‌ శ్రీనివాసుల రెడ్డి, 150 మంది పరిశ్రమల యాజమాన్య ప్రతినిధులు పాల్గోన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement