రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి.. | Amjad Basha Inaugurates Special Protection To Farmers By Police In YSR | Sakshi
Sakshi News home page

రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి..

Published Sun, Dec 1 2019 5:46 PM | Last Updated on Sun, Dec 1 2019 5:53 PM

Amjad Basha Inaugurates Special Protection To Farmers By Police In YSR - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : ఏపీ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా రైతన్నకు పోలీసు రక్షణ కల్పించేలా ఏర్పాటు చేసింది. ఈ మేరకు కడప జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో జిల్లా డీఎస్పీ కార్యాలయంలో రైతన్నకు రక్షణ కల్పించేందుకు ఫిర్యాదు విభాగం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిలు కలిసి ప్రారంభించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటారు. వీటితో పాటు మహిళలకు సంబంధించి ప్రత్యేక కౌన్సిలింగ్‌ విభాగాన్ని పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అన్బురాజన్‌, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement