జాతిరత్నాల్లో రాణిగా ముత్యాన్ని చెబుతారు. పగడాన్ని అందమైన రత్నంగా వ్యవహరిస్తారు. ఇది కూడా ముత్యంలాగానే సముద్రంలోనే ఆవిర్భవిస్తుంది. అయితే ముత్యాన్ని సముద్రంలో తయారయ్యే పద్ధతిలోనే బయట కూడా కల్చర్ చేయవచ్చు. పగడానికి అలాంటి అవకాశం లేదు. అందుబాటులో ఉన్న పగడాల్లో కొన్ని అసలైనవి, కొన్ని నకిలీవి. ఇందులో కల్చర్డ్ కోరల్ అనేది ఇంత వరకు లేదు. సముద్రపు మొక్క నుంచి పగడం తయారవుతుంది.
పగడంలో ఎరుపు, గులాబీరంగు, ఆరెంజ్, బ్రౌన్‌తో పాటు వైట్, ఎల్లో, గ్రీన్, పర్పుల్, బ్లాక్ కోరల్స్ కూడా ఉంటాయి.
పగడం అసలుదా నకిలీదా అని తెలుసుకోవడానికి టర్మరిక్ టెస్ట్ సులువైన పద్ధతి. పగడం మీద పసుపు కొమ్ముతో రుద్దాలి. అప్పుడు పగడం మీదున్న ఎరుపు రంగు పగడాన్ని వదిలి పసుపు కొమ్ముకి రంగు అంటితే అది నకిలీ పగడం. అసలు పగడం మీద పసుపు కొమ్ముతో ఎంత రుద్దినా పగడం రంగు వదలదు, పసుపు కొమ్ముకి రంగు అంటదు.
స్వచ్ఛమైన పగడాన్ని ధరిస్తే అది మానసిక ఆందోళన తగ్గి ప్రశాంతతనిస్తుంది. ఆధ్యాత్మిక చింతనకు దోహదం చేస్తుంది. డిప్రెషన్, స్ట్రెస్, నిద్రలేమి వంటి సమస్యలను దూరం చేస్తుందని అధ్యయనాల్లో తేలింది.
పగడం చెట్టు నుంచి ఆవిర్భవించినది కాబట్టి ప్రాణం ఉన్న వస్తువులాగానే దీనికి గాలి అందుతుండాలి. ముత్యాలు, పగడాలను సుదీర్ఘకాలం గాలి అందని అలమారల్లో పెట్టరాదు.
ముత్యాలు, పగడాల ఆభరణాలను ధరించడం వాటి మన్నిక కోసమే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యం కోసం కూడా.
సాధారణ పగడాల వరుస అయితే భద్రపరచడంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం లేదు. బంగారంలో పొదిగిన ఆభరణాల విషయంలో ఆభరణం నుంచి రాలిపోకుండా ఉండడానికి మెత్తటి కుషన్ ఉన్న బాక్సుల్లో పెట్టాలి. నగధగలుపగడాలేం చెబుతున్నాయి
– జియా నస్రీన్, జెమాలజిస్ట్
Comments
Please login to add a commentAdd a comment