
రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్న ఏపీఎస్‌పీఎఫ్ కమాండెంట్ డీఎన్‌ఏ బాషా
ఆల్కాట్‌తోట(రాజమహేంద్రవరం రూరల్): సేవ్‌ఫ్యూయల్ అండ్ బర్న్‌పాట్, పర్యావరణ పరిరక్షణ, ఫిజికల్‌ఫిట్‌నెస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణదళం జోన్ కమాండెంట్ డీఎన్‌ఏ బాషా పేర్కొన్నారు. శనివారం ఏపీఎస్‌పీఎఫ్ డైరెక్టర్ మాదిరెడ్డి ప్రతాప్ పిలుపు మేరకు ప్రజలలో సేవ్‌ఫ్యూయల్ అండ్ బర్న్‌ఫాట్, పర్యావరణ పరిరక్షణ, ఫిజికల్ ఫిట్‌నెస్ అనే నినాదంతో రాజమహేంద్రవరం శ్రీనివాస గార్డెన్స్‌లోని జోనల్ కార్యాలయం నుంచి ఆయన, వందమంది సిబ్బంది రాజమహేంద్రవరం నుంచి నిడదవోలు వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సైకిల్ ర్యాలీని ప్రకాషనగర్ ఇన్‌స్పెక్టర్ భాస్కరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ రోడ్డు కంరైలు బ్రిడ్జి మీద నుంచి కొవ్వూరు, చంద్రగిరి, మద్దూరు మీదుగా నిడదవోలు చేరుకున్నారు. నిడదవోలు సబ్‌ఇన్‌స్పెక్టర్ కమాండెంట్ బాషా బృందానికి స్వాగతం పలికారు. అనంతరం ఈ సైకిల్ ర్యాలీ నిడదవోలు నుంచి రాజమహేంద్రవరానికి చేరుకుంది.
ఈ సందర్భంగా కమాండెంట్ డీఎన్‌ఏ బాషా మాట్లాడుతూ గత ఏడాది డిసెంబర్‌లో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ర్యాలీ నిర్వహించామన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైకిల్ ర్యాలీలు ఇటువంటివి మరిన్ని చేస్తామన్నారు. ఈ ర్యాలీలో అసిస్టెంట్ కమాండెంట్ కె.సుధాకరరావు, ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరావు, సబ్ ఇన్‌స్పెక్టర్లు రామకృష్ణారావు, రామకృష్ణ, ధనుంజయరావు పాల్గొన్నారు.