సాక్షి,జనగామ(వరంగల్): రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో భారానికి తోడు ట్రాఫిక్ ఇబ్బందులను అదిగమించేందుకు యువత సైకిళ్లపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్‌లో వివిధ మోడళ్లు అందుబాటులో ఉండగా.. బ్యాటరీతో నడిచే చార్జింగ్ సైకిళ్లు ఆకట్టుకుంటున్నాయి. వీటితో పొల్యూషన్ బాధ లేకపోవగా.. నిత్యం వ్యాయామం చేసినట్లవుతుంది. పట్టణానికి చెందిన సుధీర్ కార్తీక్ చార్జింగ్ సైకిల్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి చక్కర్లు కొడుతున్నాడు.
ఒక్కసారి చార్జింగ్ చేస్తే 25 కిలోమీటర్ల వేగంతో 50 కిలోమీటర్లు వెళ్లవచ్చని చెప్పారు. రూ.81,800 ధరకు కొనుగోలు చేసిన ఈ సైకిల్‌కు మూడేళ్ల వరకు ఎలాంటి మెయింటనెన్స్ ఉండదని వివరించాడు. దీనిని ఫోల్డ్ కూడా చేయవచ్చని పేర్కొన్నాడు.
చదవండి: 6 నెలల క్రితమే వివాహం.. భార్య పుట్టింటికి వెళ్లిందని..
Comments
Please login to add a commentAdd a comment