
ప్రకృతి వైపరిత్యాలు, సముద్ర నీటిమట్టం పెరుగుదల, జీవవైవిధ్యం క్షీణత, ఆహార – నీటి అభద్రత వంటి వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం ఎదురవుతున్న, భవిష్యత్తులో ఎదురయ్యే దుష్ప్రభావాలను తట్టుకునే శక్తిని పెంపొందించే రక్షక చర్యలనే అడాప్టేషన్ అంటారు.
వాతావరణ మార్పుల నష్టాన్ని సాధ్యమైనంత వరకు స్థానిక స్థాయిలో అమలు చేయాలినవి అడాప్టేషన్ చర్యలు. అంటే, అడాప్టేషన్ చర్యలను అమలుపరచటంలో గ్రామీణ ప్రజలు, నగరాలు, పట్టణాల్లో నివసించే ప్రజలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రకృతి / సేంద్రియ వ్యవసాయ పద్ధతుల వంటి పునరుజ్జీవన వ్యవసాయ పద్ధతులను అనుసరించటం.. కరువును తట్టుకునే వంగడాలను సాగు చేయటం.. నీటి నిల్వ – వినియోగ పద్ధతులను మెరుగుపరచటం.. అడవులు తగులబడకుండా అడ్డుకునే రీతిలో భూముల నిర్వహణ చర్యలు చేపట్టడం.. వరదలు, వడగాడ్పులు వంటి తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు బలమైన రక్షణ వ్యవస్థలను నిర్మించటం.. ఇవన్నీ అడాప్టేషన్ చర్యలే.
అయితే, స్థానికంగా చర్యలు తీసుకుంటే అడాప్టేషన్ పూర్తి కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాతావరణ మార్పుల దుష్ప్రభావాన్ని తగ్గించుకునేందుకు దారితీసే విధానాల రూపకల్పనతో పాటు ప్రభుత్వాలు అనేక భారీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. సముద్ర నీటి మట్టాలు పెరగటం వల్ల దెబ్బతిన్న కోస్తా ప్రాంతాల్లోని మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటం లేదా వేరే సురక్షిత ప్రాంతానికి తరలించటం.. మరింత తీవ్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నా తట్టుకునే విధంగా మౌలిక సదుపాయాలను పటిష్టం చేయటం.. ప్రకృతి వైపరిత్యాల గురించి ముందస్తు హెచ్చరికలు చేసే వ్యవస్థలను విస్తరింపజేసి వైపరిత్యాల సమాచారాన్ని అందుబాటులోకి తేవటం.. ప్రత్యేకించి వాతావరణ మార్పులకు సంబంధించిన నష్టాలను పూచ్చేందుకు బీమా సదుపాయాలను అభివృద్ధి చేయటం.. ప్రకృతిసిద్ధమైన పర్యావరణ వ్యవస్థలకు, వన్యప్రాణులకు సరికొత్త రక్షణ చర్యలు చేపట్టం.. ఇవన్నీ క్లైమెట్ ఛేంజ్ అడాప్టేషన్ చర్యలే!
ఇదీ చదవండి : తాతగారి సెన్సేషనల్ విడాకులు : భరణం ఎంతో తెలిస్తే అవాక్కే!