మాట్లాడుతున్న తెలకపల్లి రవి
భావి తరాల కోసమైన మన మాత భాష తెలుగును పరిరక్షించుకుందామని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు.
– ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి
నంద్యాలరూరల్: భావి తరాల కోసమైన మన మాత భాష తెలుగును పరిరక్షించుకుందామని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. శనివారం నంద్యాల రామకష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో ‘70 ఏళ్ల స్వతంత్ర భారతంలో తెలుగు భాష పరిస్థితి’ అన్న అంశంపై సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న తెలకపల్లి రవి మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే మాత భాష అయిన తెలుగు అభివద్ధి చెందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు ప్రాచీన హోదాపై వివాదాలు వస్తున్నా ప్రభుత్వాలు కళ్లు తెరవకపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. కేంద్ర, ప్రభుత్వం తెలుగుభాషకు ఎక్కువ నిధులు కేటాయించి ప్రోత్సహించాలని సూచించారు. అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను తెలుగు నేర్పాలని కోరారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంద్యాల రఘుబాబు మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే తెలుగును అభివద్ధి చేయాలని కోరారు. కార్యక్రమంలో రామకష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకష్ణారెడ్డి, సాహితీ స్రవంతి నంద్యాల అధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, ప్రధాన కార్యదర్శి మాదాల శ్రీనివాసులు, నాయకులు అన్నెం శ్రీనివాసరెడ్డి, శోభన్‌కుమార్, శేషఫణి, డాక్టర్ రవీంద్రనాథ్, కరీముద్దీన్, శ్రీనిధి రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.