ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించిన తానా పూర్వ అధ్యక్షుడు | Telugu Language Development Meeting Tana Ex President Thotakura Prasad Nellore | Sakshi
Sakshi News home page

ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించిన తానా పూర్వ అధ్యక్షుడు

Published Wed, May 4 2022 10:27 PM | Last Updated on Wed, May 4 2022 10:27 PM

Telugu Language Development Meeting Tana Ex President Thotakura Prasad Nellore - Sakshi

సాక్షి, నెల్లూరు: ‘ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం’ తెలుగు భాషా అభివృద్ధికి గొప్ప కృషి చేస్తుండడం ప్రసంశనీయమని తానా పూర్వ అధ్యక్షులైన డా.తోటకూర ప్రసాద్  అన్నారు. బుధవారం నాడు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ప్రాజెక్టుల వివరాల్ని ఆయన పరిశీలించారు. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య డి. మునిరత్నం నాయుడు కేంద్రంలో పూర్వం జరిగిన, ప్రస్తుతం జరుగుతున్న, భవిష్యత్తులో జరగబోయే ప్రాజెక్టుల వివరాల్ని వాటి ఉద్దేశ్యాల్ని వారి దృష్టికి తీసుకెళ్లారు.

తర్వాత డా. తోటకూర ప్రసాద్ అక్కడి సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ...తానా అనే సంస్థ తెలుగు భాషకు ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్న కృషిని కూలంకషంగా వివరించారు. అలాగే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు భాషను చదువుతున్న విద్యార్థులకు, పరిశోధకులకు సాంకేతిక శిక్షణ ఇవ్వడానికి ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంతో కలిసి పనిచేస్తానని హామి ఇచ్చారు. అంతేకాకుండా మాతృభాషా ఔన్నత్యాన్ని దశదిశల వ్యాపింపజేయడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషిని చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం ప్రాజెక్టు డైరెక్టర్, విద్యాత్మక సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement