ఎస్పీని రక్షణ కోరిన గంగాధర్
సుభాష్‌నగర్ :మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఎన్‌కౌంటర్ అయిన నయీమ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ డిచ్‌పల్లి జడ్పీటీసీ అరుణ భర్త అమృతాపూర్ గంగాధర్ మంగళవారం ఎస్పీ విశ్వప్రసాద్‌ను ఆశ్రయించారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు గత నెలలో గంగాధర్‌కు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంగాధర్ తనకు వచ్చిన ఫోన్ నంబర్‌ను పోలీసులకు తెలియజేశారు. ఆ నంబర్ ఆధారంగా నయీమ్ షాద్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సోమవారం ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నయీమ్ అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పించాలని అమృతాపూర్ గంగాధర్ ఎస్పీని కలిసి కోరారు. అనంతరం గంగాధర్ మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించి ఎవరికీ కన్పించకుండా వెళ్లిపోయాడు.