భద్రాచలంటౌన్: ఏజెన్సీలో గిరిజ నులకు రక్షణ లేకుండా పోతుందని పెట్రోల్ బంక్ నిర్వాహకురాలు బాణోత్ వాణికుమారి ఆరోపించా రు. శనివారం పట్టణంలోని టీఎస్ టూరిజం హోటల్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. పట్టణంలో పలువురు వ్యక్తులు భూకబ్జాలకు పాల్ప డుతూ అమాయకుల భూములను లాక్కోంటున్నారని ఆరోపించారు. ఆంధ్రాలోని యటపాక మండలంలోని చింతలగూడెం గ్రామంలో సర్వే నెంబర్ 38/2, 38/3, 38/4 నెంబర్లలో ఉన్న 10 ఎకరాల భూమిని తాను కొనుక్కుంటే పట్టణ ప్రముఖుడిగా చలామణి అవుతున్న ప్రసాద్ అనే వ్యక్తి ఆ భూమిని తాను కొన్నానంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించారు. తాను కొన్న భూమికి సంబంధించిన పత్రాలు చూపించమంటే ఉన్నాయంటూ చెబు తూ, చివరకు తనపై బెదిరింపులకు దిగడం జరిగిందన్నారు. ప్రసాద్‌తో పాటు మరో నలుగురుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశానని, కేసు కూడా నమోదు అయిందని క్రైమ్ నెంబర్లు చూపించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట తమ్మళ్ల రాజేష్, వసంతాల రాజేశ్వరీ, ముద్దా పిచ్చయ్య, నీరజ, కుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment