అన్నానగర్: తమకు రక్షణ కావాలంటూ నెల్లై జిల్లా ఎస్పీని ఓ ప్రేమజంట ఆశ్రయించింది. నెల్లై సమీపం శంకర్‌నగర్ శారదాంబాల్ నగర్‌కు చెందిన మారియప్పన్ కుమార్తె సుక్ష్మిత (22). పట్టభద్రురాలైన ఈమె తెన్‌కాశిలో ఉన్న ఓ సంస్థలో పనిచేస్తోంది. కొన్ని రోజుల ముందు సుక్ష్మిత అదృశ్యమైంది. దీంతో మారియప్పన్ తాలైయుత్తు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సుక్ష్మిత ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఈ స్థితిలో సుక్ష్మిత తన ప్రియుడు భర్త సివందిపట్టి గాంధీవీధికి చెందిన కోట్టైయప్పన్ (23)తో మంగళవారం నెల్లై జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయానికి వచ్చారు. వీరి తరఫున న్యాయవాది కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు వచ్చారు.
తరువాత కోట్టైయప్పన్ పోలీసు అధికారి వద్ద ఓ వినతి పత్రం ఇచ్చాడు. అందులో నేను పాళయంకోటలో ఉన్న ఓ కళాశాలలో బీఎస్సీ చదువు పూర్తి చేసి కేరళ రాష్ట్రం పత్తనందిట్టలో బేకరీ నడుపుతూ వస్తున్నాడు. కళాశాలలో చదివినపుడే మహిళా కళాశాలలో చదువుతున్న సుక్ష్మితతో ప్రేమ ఏర్పడింది. ఈ విషయం తెలిసి సుక్ష్మిత కన్నవారు, ఆమెకి ఇష్టంలేని వివాహానికి ఏర్పాట్లు చేస్తూ వచ్చారు. అనంతరం గత 14వ తేదీ మేము ఇంటి నుంచి పారిపోయి వివాహం చేసుకున్నాం. మేమిద్దరం వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో హత్యాబెదిరింపులు వస్తున్నాయి. తమకు భద్రత కల్పించాలని ఆ వినతి పత్రంలో ఉంది. అనంతరం ప్రేమజంటని తాలైయుత్తు పోలీసుస్టేషన్‌కి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment