నగధగలు : ఇంట్లోనే ఇలా మెరిపిద్దాం!
ఆభరణాలను ధరించే కొద్దీ మెరుపు తగ్గిపోతాయని అ΄ోహ పడుతుంటాం. కానీ వాటి మెరుపు ఎక్కడికీ పోదు. రోజూ ధరించే బంగారు ఆభరణాలు గాలి, దుమ్ము, ధూళి, వాయు కాలుష్యం కారణంగా మసకబారుతుంటాయి. వాటికి మెరుగు పెట్టించాలనుకుని దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. నెలకోసారి ఇంట్లోనే శుభ్రం చేసుకోవచ్చు.
ఒక పాత్ర (మెటల్ పాత్ర వాడరాదు, ప్లాస్టిక్ పాత్ర వాడాలి)లో డిష్ వాష్ లిక్విడ్ నాలుగు చుక్కలు వేసి గోరువెచ్చని నీటిని ΄ోసి కల΄ాలి. ఆ తరవాత ఆభరణాలను నీటిలో మునిగేలా ఉంచి 15 నిమిషాల తర్వాత చేత్తో రుద్ది కడగాలి. ఆ తర్వాత మంచినీటి పాత్రలో పెట్టి వేళ్లతో మృదువుగా రుద్దుతూ సబ్బు వదిలేటట్లు శుభ్రం చేయాలి.
నీటితో శుభ్రం చేసిన తర్వాత పేపర్‌తో తుడిచే ప్రయత్నం చేయరాదు. మెత్తటి కాటన్ వస్త్రాన్ని ఒత్తుగా నాలుగు మడత లు వేసి ఆభరణాన్ని ఉంచాలి. శుభ్రం చేసిన ఆభరణాన్ని బీరువాలో పెట్టాలంటే ఆభరణంలో ఏ మాత్రం తేమ లేకుండా ఆరిన తర్వాత మాత్రమే భద్రపరచాలి.
ఆభరణాలను శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమం ఏమిటంటే...ఒక్కొక్క ఆభరణాన్ని విడిగా శుభ్రం చేయాలి. చెవికమ్మలు, రింగుల వంటి వాటిని కలిపి నానబెట్టి శుభ్రం చేసే అలవాటు చాలామందికి ఉంటుంది. కలిపి ఒకే పాత్రలో నానబెట్టాల్సి వస్తే అడుగు వెడల్పుగా ఉండి ఒక కమ్మ మరొక కమ్మకు తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కడిగేటప్పుడు కూడా ఒకదానికి మరొకటి తగులుతూ ఉంటే గీతలు పడతాయి.
రాళ్లు పొదిగిన బంగారు ఆభరణాన్ని శుభ్రం చేయాలంటే నీటిలో నానబెట్టరాదు. మొదట సబ్బు నీటితో ముంచిన మెత్తని వస్త్రంతో ఆభరణాన్ని తుడవాలి. ఆ తర్వాత మంచినీటిలో ముంచిన క్లాత్‌తో తుడవాలి. తుడిచిన తర్వాత మెత్తటి టవల్ మీద ఆభరణాన్ని తలకిందులుగా (ఈ స్థితిలో ఆభరణంలో పొదిగిన రాయి కిందగా టవల్‌ను తాకుతూ ఉంటుంది. బంగారు పైకి కనిపిస్తుంటుంది) ఆరబెట్టాలి. ఇలా ఆరబెట్టడం వల్ల రాయికి బంగారానికి మధ్య తేమ చేరకుండా ఉంటుంది.
చదవండి: కళ్లు చెదిరే ఇన్‌స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
బామ్మకు స్వీట్ సర్‌ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్
Comments
Please login to add a commentAdd a comment