చంద్రబాబును నిలదీయండి: శోభా నాగిరెడ్డి | Question Chandrababu Naidu on telangana note says Shobha Nagireddy | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 2 2013 1:31 PM | Last Updated on Wed, Mar 20 2024 1:45 PM

తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినట్లు అంగీకరించిన తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ లేఖను వెనక్కి తీసుకున్న తర్వాత మాత్రమే సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణకు అనుకూలం అని చెప్పి, సమైక్యాంధ్ర కోసం జోరుగా ఉద్యమిస్తున్న సీమాంధ్ర ప్రాంతంలో ఆయనెలా పర్యటిస్తారని ఆమె నిలదీశారు. చంద్రబాబు చేస్తున్న యాత్ర విజయవంతం అయితే సమైక్యాంధ్ర ఉద్యమం లేదన్న సంకేతాలు ఢిల్లీకి వెళ్తాయని, అందువల్ల సీమాంధ్ర జేఏసీ నాయకులు ముందుకొచ్చి, ఆయనను నిలదీయాలని శోభా నాగిరెడ్డి పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యమకారులంతా కూడా చంద్రబాబును సమైక్యాంధ్ర విషయంలో నిలదీయాలని ఆమె కోరారు. లేని పక్షంలో ఢిల్లీ వర్గాలు ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని అనుమానించే అవకాశం ఉందని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement