ముఖ్యమంత్రికి ధైర్యముంటే, శాసనసభలో విభజన బిల్లుపై ఓటింగ్ జరుపుతామని ప్రకటించాలని వైఎస్‌ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రికి ధైర్యముంటే, శాసనసభలో విభజన బిల్లుపై ఓటింగ్ జరుపుతామని ప్రకటించాలని వైఎస్‌ఆర్ సీఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో శాసనసభ నడుస్తోందని, కాంగ్రెస్ అధిష్టానం డైరెక్షన్ మేరకే శాసనసభలో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు.
టీడీపీ రాత్రికి రాత్రే తమ విధానాన్ని ఎందుకు మార్చుకుందని, విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను చంద్రబాబు ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటారా అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. అసలు విభజన బిల్లుపై సభలో చర్చించిన తర్వాత ఓటింగ్ అంటే ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు.