శోభా నాగిరెడ్డికి జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
తమ పార్టీ నాయకురాలు శోభా నాగిరెడ్డికి జరిగిన రోడ్డు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని భగవంతుడిని వేడుకుంటున్నామని అన్నారు.
శోభా నాగిరెడ్డిని, ఆమె భర్త భూమా నాగిరెడ్డిని పరామర్శించేందుకు మరికాసేపట్లో ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి హైదరాబాద్కు బయల్దేరనున్నారు.