‘చంద్రబాబు దళిత వ్యతిరేకి’
ఒంగోలు: సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళిత భూములను ప్రభుత్వం లాక్కోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామన్నారు. తక్షణమే దళితుల భూముల్లో చెరువు తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నీరు-చెట్టు పేరుతో దళితుల భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దేవరపల్లి దళిత భూముల్లో చెరువు తవ్వడం సరికాదని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దళితులు ఆందోళన చేస్తుంటే పోలీసు పహారాలో చెరువు తవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. దళితులపై ప్రభుత్వం సామాజిక, ఆర్థిక దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.