dalit lands
-
శివ.. శివా.. ఆ ఎమ్మెల్యే నల్లతాచు
‘నల్లబాలు.. నల్లతాచు లెక్క’ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ బాపట్ల జిల్లాకు చెందిన ‘దేశం’ ఎమ్మెల్యే నిజంగా ‘నల్ల’తాచు లెక్క.. ఆయన దురాగతాలకు అంతేలేదు. నాసిరకం బయో మందులు విక్రయిస్తూ రైతులను వంచిస్తారు. ఎన్ఆర్ఐలు, గ్రానైట్ పరిశ్రమల నుంచి వసూలు చేసిన ‘నల్లధనం’తో ఎన్నికల బరిలోకి దిగుతారు. ఓట్లు కొంటారు, దొంగ ఓట్లు వేయిస్తారు. ఎలాగైనా గెలిచి మళ్లీ ప్రజలను పీడించుకుతినడమే ఆయన నైజం. పేరుకే ఆయన ‘శివుడు’.కానీ పనులన్నీ భస్మాసురుడిని తలపిస్తాయి. ఆ ఎమ్మెల్యే నల్లతాచు సాక్షి టాస్క్‌ఫోర్స్: బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే అక్రమంగా వసూలు చేసిన నల్లధనంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడటంతో అక్రమాల తుట్టె కదులుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన నియోజకవర్గంలో నీరు – చెట్టు పనుల్లో రూ. కోట్లు కొల్లగొట్టి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. పర్చూరు మండలం దేవరపల్లిలో దళితులకు ఇచ్చిన భూముల్లో నీరు – చెట్టు ద్వారా చెరువులు తవ్వాలని అప్పట్లో ఆయన పట్టుబట్టడంతో దళితులు వ్యతిరేకించారు. దళితులకు వైఎస్సార్సీపీ అండగా నిలబడడంతో చివరకు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నాసిరకం బయో మందులపై సర్కారు చర్యలు తీసుకుంది. అయినా నకిలీ మందులు విక్రయించడం మాత్రం ఆపలేదు. అగ్రిటెక్ మాటున నకిలీ మందులు గుంటూరులోని ఎమ్మెల్యేకి చెందిన తన అగ్రిటెక్ కంపెనీ కార్యాలయంలో ఇటీవల రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (ఏపీఎస్డీఆర్ఐ) జరిపిన తనిఖీల్లో ఆయన ఎన్నికల అక్రమాలు వెలుగుచూశాయి. ఎన్ఆర్ఐల నుంచి నిధులు పోగేసి తొలుత ఆ నిధులను తన కంపెనీకి తరలించి అక్కడి నుంచి ఎన్నికలకు వెచ్చించినట్లు వెలుగులోకి వచ్చింది. తనిఖీల్లో దొరికిన డైరీలో ‘నల్లధనం’ లెక్కలు వెలుగుచూశాయి. ఆ నిధులతోనే గడచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కొనుగోలు,దొంగ ఓట్లు చేర్చడం, ఎన్నికల్లో ఇతరత్రా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. తొలుత ఆయన టీడీపీ మాజీ ఎంపీ దగ్గర పనిచేశారు. ప్రస్తుతం ఆ మాజీ ఎంపీ తెలంగాణలో బీఆర్ఎస్లో ఉన్నారు. ఆయనకు ఏపీలోనూ వ్యాపారాలు ఉన్నాయి. ఆయన వద్ద ఉన్నప్పుడే అగ్రిటెక్ కంపెనీ పురుడు పోసుకుంది. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి రాగానే ఆ కంపెనీ తయారు చేసిన నకిలీ బయో ఎరువులు, పురుగు మందులను రాష్ట్ర వ్యాప్తంగా విక్రయించారు. మాజీ ఎంపీకి బినామీగా ఉన్న సమయంలో ఆయన అండతోనే ఎదిగారన్న ప్రచారమూ ఉంది. మైనింగ్,విజిలెన్స్ అధికారులపైనా దాడులు ఆ నియోజకవర్గంలో తన సామాజికవర్గం బలంగా ఉంది. ఆ వర్గంలో ఎన్ఆర్ఐలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా గత రెండు ఎన్నికల్లో కోట్లాది రూపాయలు సమకూర్చారు. అదంతా నల్లధనమేనన్న ఆరోపణలు ఉన్నాయి. మార్టూరు మండలంలో 250కిపైగా గ్రానైట్ పరిశ్రమలు సామాజికవర్గం చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడి నుంచి 80 శాతం గ్రానైట్ రాయల్టీ లేకుండానే తరలిపోతోంది. దీనికి సహకరిస్తున్న నేతలకు పరిశ్రమల యజమానులు నిధులు కుమ్మరిస్తారు. వీరి నుంచి అధికమొత్తంలో నిధులు వెళ్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో 15 వేలకు పైగా దొంగ ఓట్లు చేరి్పంచడంతో ఇటీవల అధికారులు విచారణ జరిపి సుమారు 12 వేల ఓట్లను తొలగించారు. దీనిలో ఎమ్మెల్యే పాత్ర ఉన్నట్టు స్పష్టమవుతోంది. తన అగ్రిటెక్ కార్యాలయంలో లభించిన డైరీలో ఎమ్మెల్యే అక్రమాలు బయటపడటంతో ఎమ్మెల్యేతోపాటు కంపెనీ ఉద్యోగులపైనా కేసులు నమోదు చేశారు. ఇందులో ఎమ్మెల్యేను ఏ–1గా చూపారు. మార్టూరు గ్రానైట్ పరిశ్రమల నుంచి అక్రమంగా సరుకు తరలిపోతుందన్న ఫిర్యాదుతో జనవరి 30న తనిఖీలకు వచ్చిన మైనింగ్, విజిలెన్స్ అధికారులను తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే అడ్డుకొని దాడులకు తెగబడ్డారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యేతోపాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో పరారైన ఎమ్మెల్యేకు తర్వాత 41 నోటీసు ఇచ్చి విచారణ చేపట్టారు. కేసులు ‘అనంత’ం ► మార్టూరులోని గ్రానైట్ ఫ్యాక్టరీలో తనిఖీల నిమిత్తం వచ్చిన విజిలెన్స్ అండ్ మైనింగ్ అధికారులను అడ్డగించిన సందర్భాన్ని పురస్కరించుకొని విజిలెన్స్ ఏడీ బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుపై 31/2024, 31/01/2024న ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ► 2019 ఎన్నికలలో పర్చూరు నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, దొంగ ఓట్లు వేయించడం వంటివి ఆధారాలతో బట్టబయలు కావడంతో ఎమ్మెల్యేపై ఏ1గా కేసు నమోదు చేశారు. ► బాపట్ల జిల్లా ఇంకొల్లు పోలీసులు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని 123(1), ఐపీసీ సెక్షన్ 171(ఇ), రెడ్ విత్ 120(బి), సీఆరీ్పసీ 155(2)ల ప్రకారం కేసు నమోదు చేసారు. ► 220/2023, 19/09/2023వ తేదీన ఎమ్మెల్యేపై మార్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
దళితుల భూములపై బీజేపీ నేత కన్ను..
సాగులో ఉన్న దళితులకు భూ హక్కు పత్రాల మంజూరులో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇదే అదనుగా తీసుకుని బీజేపీ నేత ఆ భూములపై కన్నేశాడు. దళితులకు ఆ భూములు దక్కకుండా పన్నాగం చేస్తున్నాడు. భూములు ఆక్రమణకు గురయ్యాయంటూ పూజారి చేత పిటిషన్ వేయించి భూమి హక్కు పత్రాలు రాకుండా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నాడు. సాక్షి,కదిరి: తలుపుల మండలం వేపమానిపేట పంచాయతీ పరిధిలోని కొత్తపూలవాండ్లపల్లి, గంజివారిపల్లి గ్రామాలకు చెందిన 45 మంది దళితులు కొన్నేళ్లుగా అక్కడి ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు సాగు చేసుకుంటున్నారు. సాగు చేసుకుంటున్న దళితులకే భూములు దక్కాలని గతంలో కదిరి ప్రాంతానికి చెందిన కొందరు వామపక్ష పార్టీల నాయకులు అప్పట్లో డిమాండ్ చేశారు. ఈ మేరకు సాగుదారులు కూడా అధికారులకు అర్జీల రూపంలో విన్నవించుకున్నారు. దేవదాయ భూమి కావడంతో అప్పట్లో ఉన్న జిల్లా ఉన్నతాధికారులు ఓ నిర్ణయానికి వచ్చి ఎకరం రూ.15 వేలు చొప్పున సాగుదారులకు విక్రయించాలని నిర్ణయించారు. గతంలోనే 80 శాతం సొమ్ము చెల్లింపు.. ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు సర్వే నంబర్ 901లోని మొత్తం 88.45 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అందులోని 22.45 ఎకరాల భూమిని ఆ ఆలయ పూజారులకు ధూప, దీప నైవేద్యాల కోసం ప్రభుత్వం అప్పగించింది. మిగిలిన 66 ఎకరాల భూమిలో ఒక్క సెంటు భూమి కూడా లేని ఐదుగురు దళిత మహిళలకు 1.85 ఎకరాల చొప్పున, ఎకరం లోపు భూమి ఉన్న 20 మంది దళిత రైతులకు 1.80 ఎకరాలు చొప్పున, ఎకరం పైన–రెండెకరాల లోపు ఉన్న మరో 20 మంది దళితులకు ఎకరం చొప్పున లాటరీ పద్ధతిలో మొత్తం కేటాయించారు. ఇందుకు గాను 1999 ఏప్రిల్ 19న దళితుల తరఫున ఎస్సీ కార్పొరేషన్ 80 శాతం అంటే రూ7.92 లక్షలను దేవదాయ శాఖకు డీడీ రూపంలో చెల్లించింది. మిగిలిన 20 శాతం అంటే రూ1.98 లక్షలు ఆ దళితుల పేరు మీద హక్కు పత్రాలు ఇచ్చిన వెంటనే చెల్లిస్తామని అప్పట్లో ఎస్సీ కార్పొరేషన్ స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ భూములను దళితులే సాగు చేసుకుంటున్నారు. కానీ వాటిని దళితుల పేరు మీద మార్చడంలో అధికారులు విఫలమయ్యారు. కోర్టును సైతం తప్పుదోవ పట్టించే యత్నం.. బీజేపీకి చెందిన ఓ నాయకుడు ఓబులేశ్వరస్వామి ఆలయ పూజారి ద్వారా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించారు. దేవాలయ భూములను కొందరు దళితులు కబ్జా చేశారని, వాటిని కాపాడాలని కోర్టును సైతం తప్పుదోవ పట్టించే విధంగా పిటిషన్లో పేర్కొన్నట్లు సాగుదారులు ఆరోపిస్తున్నారు. అందుకే తాము కూడా హైకోర్టును ఆశ్రయించి కోర్టుకు వాస్తవం తెలియజేసే విధంగా మరో పిటీషన్ దాఖలు చేశామని తెలిపారు. కొందరు అధికారులు సైతం తమను మోసం చేసేందుకు పూజారులతోనూ, బీజేపీ నాయకుడితోనూ కుమ్మక్కయారని ఆరోపించారు. దళితులకు న్యాయం చేస్తాం ఓబులేశ్వర స్వామి మాన్యం భూములు దళితులు సాగు చేసుకుంటున్న మాట వాస్తవం. వారికి భూ హక్కు పత్రాలు అందేలా చూ స్తాను. గత ప్రభుత్వం వారికి అన్యాయం చేసింది. వారికి న్యాయబద్ధంగా రావాల్సిన పంట నష్టపరిహారం కూడా అందేలా చూస్తాను. – కదిరి ఎమ్మెల్యే డా.పీవీ సిద్దారెడ్డి చదవండి: Tokyo Paralympics:టేబుల్ టెన్నిస్ ఫైనల్స్‌కు భవీనాబెన్ -
పేదల భూమిపై పెద్దల కన్ను
ప్రభుత్వం 17 ఏళ్ల క్రితం సుమారు 83 దళిత కుటుంబాలకు పట్టాలిచ్చిన డీకేటీ భూములపై స్థానిక పెద్దల కన్ను పడింది. మూడు రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సుమారు 20 ఎకరాలను ఆక్రమించేశారు. అదును చూసి జేసీబీలతో చదును చేశారు. రాత్రికి రాత్రే బోరు డ్రిల్ చేశారు. విషయం తెలుసుకున్న బాధిత దళితులు పట్టాదారు పాసుపుస్తకాలతో శుక్రవారం ఆందోళనకు దిగారు. ఈ ఘటన కేవీబీపురం మండలం పెరిందేశంలో కలకలం రేపింది. కేవీబీపురం: మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన సర్వే నం.254 (బ్లాకు)లో అదే గ్రామానికి చెందిన 83 దళిత కుటుంబాలకు 2003లో అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఎకరా చొప్పున పట్టాలిచ్చింది. అధికారులు సర్వేచేసి భూములను లబ్ధిదారులకు చూపించలేదు. అదే భూమిపై స్థానిక పెద్దల కన్ను పడింది. శ్రీకాళహస్త్రికి చెందిన ఓ వ్యాపారికి సదరు భూమి తమ స్వాధీనంలో ఉన్నట్టు నమ్మబలికారు. అందులో 20ఎకరాలు విక్రయించేందుకు సిద్ధపడ్డారు. సదరు వ్యాపారి, స్థానిక పెద్దలు కొందరు మూడు రోజులుగా రాత్రి పూట జేసీబీలతో చదును చేయడం ప్రారంభించారు. ఎవరికీ తెలియకుండా బోరు కూడా డ్రిల్ చేయడంతో బాధిత దళితులు ఉలిక్కిపడ్డారు. సంబంధిత భూమిలో పట్టాలు చేతబట్టి ఆందోళనకు దిగారు. ఆ భూమి దళితులదే ఆక్రమణను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. సదరు భూమి దళితులదేనని తేల్చారు. త్వరలో అధికారిక సర్వేలు జరిపి ఎవరి భూములను వారికి చూపిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. దళిత, ప్రభుత్వ భూములపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇదిలావుండగా అదే గ్రామానికి చెందిన తాజా మాజీ టీడీపీ సర్పంచ్ భర్త గతంలో ఆ భూములకు పాసు పుస్తకాలు చేయిస్తానని నమ్మబలికినట్టు తెలుస్తోంది. ప్రతి పట్టాదారు నుంచి రూ.500 వసూలు చేసి మొండిచేయి చూపించినట్టు బాధితులు తహసీల్దార్‌కు ఫిర్యాదుచేశారు. ఇదే భూమిలో ఆయనకున్న ఎకరా భూమిని అడ్డుపెట్టుకుని సుమారు 8 ఎకరాల్లో సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయం చేస్తాం పెరిందేశం గ్రామ పరిధిలోని బ్లాకు నం.254లో ప్రభు త్వం ఇచ్చిన పట్టాల ప్రకారం అర్హులకు కచ్చితంగా న్యాయం చేస్తాం. దళితులు, ప్రభుత్వ భూములు ఎవరి చెరలో ఉన్నా స్వాధీనం చేసుకుంటాం. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –జీ.మోహన్, తహసీల్దార్ కేవీబీపురం -
దళితుల భూముల్లో సర్కారు దౌర్జన్యం
-
దళితుల భూముల్లో సర్కారు దౌర్జన్యం
♦ 70 ఏళ్లుగా పేదలు సాగు చేస్తున్న భూములు లాక్కుని చెరువు తవ్వకం ∙ ♦ ప్రకాశం జిల్లా దేవరపల్లిలో పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు బరితెగింపు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: తమకు ఓట్లేయలేదనే అక్కసుతో అధికార పార్టీ చేస్తున్న ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పోలీసుల అండతో దౌర్జన్యాలకు పాల్పడుతోంది. ఈసారి ప్రకాశం జిల్లాలో 70 ఏళ్లుగా దళితులు సాగు చేసుకుంటున్న భూములపై టీడీపీ నేతల కన్నుపడింది. ఇప్పటికే గ్రామంలో రెండు చెరువులు అందుబాటులో ఉన్నా అవి చాలవంటూ దళితులు పండిస్తున్న పొల్లాల్లో యంత్రాలు మోహరించి మరో చెరువు తవ్వేందుకు సిద్ధపడ్డారు. నిండా 600 కుటుంబాలు కూడా లేని ఓ గ్రామంలో.. అదీ పేదలు దశాబ్దాలుగా నమ్ముకున్న భూముల్లో చెరువుల తవ్వకం పేరుతో వికృత రాజకీయాలకు పాల్పడటంపై ప్రజలు నివ్వెరపోతున్నారు! దళితవాడపై విరుచుకుపడ్డ ఖాకీలు ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో సర్వే నం.159/1లోని 22 ఎకరాల భూములు గ్రామానికి చెందిన 40 దళిత కుటుంబాల స్వాధీనంలో ఉన్నాయి. 70 ఏళ్లుగా వారు వాటిని సాగు చేసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తూనే పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో స్థానిక అధికార పార్టీ నేతలు ఆ భూములను లాక్కునేందుకు పలుమార్లు ప్రయ త్నించారు. గురువారం తెల్లవారుజామున దళితుల భూముల్లో జేసీబీలు, ఇటాచీలు మోహరించి పోలీస్ బలగాల పహరాలో కుంట తవ్వకం ప్రారంభించారు. మరోవైపు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దేవరపల్లి దళితవాడపై పోలీస్ బలగాలు విరుచుకుపడ్డాయి. పడుకున్న వారిని పడుకున్నట్లే అరెస్ట్ చేసి లాక్కెళ్లి పోలీస్స్టేషన్లలో పడేశారు. ఆ తర్వాత పదుల సంఖ్యలో యంత్రాలను తరలించి దౌర్జన్యంగా ‘నీరు–చెట్టు’ పథకం కింద కుంట తవ్వకం ప్రారంభించారు. సాయంత్రం వరకు భారీ పోలీస్ బందోబస్తు మధ్య తవ్వకాలు సాగుతూనే ఉన్నాయి. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు దళితులకు మద్దతుగా దేవరపల్లికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని ఎక్కడిక్కడ అరెస్ట్ చేసి స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించారు. మీడియాను సైతం చెరువు తవ్వకం వద్దకు అనుమతించలేదు. పర్చూరు నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 100 మందికిపైగా నేతలను వివిధ పోలీస్స్టేషన్లలో నిర్భంధించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పర్చూరు చేరుకున్న సీపీఎం నేత మధును సైతం అదుపులోకి తీసుకున్నారు. చెరువుల అభివృద్ధికి దళితుల భూములు పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గత ఎన్నికల్లో దళితులు తమకు ఓట్లేయలేదన్న అక్కసుతో 70 ఏళ్లుగా వారు సాగు చేసుకుంటున్న భూములు లాక్కునేందుకు సిద్ధమయ్యారు. గ్రామంలో ఇప్పటికే రెండు చెరువులున్నాయి. 600 కుటుంబాల్లోపు ఉన్న దేవరపల్లి వాసుల అవసరాలకు ఈ రెండు చెరువుల్లో నీరు నింపితే సరిపోతుంది. దళితుల భూములు లాక్కోవాల్సిన అవసరమే లేదు. గ్రామంలో 12 ఎకరాల పరిధిలో ఓ చెరువు ఉంది. 5 ఎకరాల 37 సెంట్ల విస్తీర్ణంలో ఉన్న చెరువు నీటిని గ్రామంలోని అన్ని వర్గాల వారు గృహాలు, ఇతర అవసరాల కోసం వాడుకుంటున్నారు. టీడీపీ నేతల కబ్జా జోలికెళ్లని అధికారులు దేవరపల్లి పరిధిలోనే అధికార పార్టీకి చెందిన నేతలు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నా వాటి జోలికి వెళ్లని అధికారులు... 70 ఏళ్లుగా దళితులు నమ్ముకున్న పొలాన్ని లాక్కున్ని కుంట తవ్వాలనుకోవడం కక్షపూరిత రాజకీయా లకు నిదర్శనం. అక్కసుతోనే ఈ చర్యలకు దిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. దళితులకు అండగా నిలబడదాం పార్టీ శ్రేణులకు జగన్ పిలుపు సాక్షి ప్రతినిధి, ఒంగోలు:ప్రకాశం జిల్లా లో అధికార పార్టీ నేతలు దళితుల భూములను ఆక్రమించి దౌర్జన్యంగా కుంట తవ్వకాలకు దిగటాన్ని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించా రు. దేవరపల్లి దళితులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు. దేవరపల్లిలో అధికార పార్టీ నేతలు దళితుల భూములను ఆక్రమించిన విషయం తెలుసుకున్న జగన్ దళితులకు పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. శుక్రవారం బాలినేనితో పాటు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జునలతో పాటు ఇతర నేతలు దేవరపల్లిని సందర్శించా లని ఆదేశించారు. అవసరమైతే తానూ దేవరపల్లి సందర్శిస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై హోం శాఖకు, ఎస్సీ కమిషన్ చైర్మన్‌కు ఎంపీ వైవీ ఫిర్యాదు సాక్షి, న్యూఢిల్లీ: ప్రకాశం జిల్లా దేవరపల్లిలో దళితుల భూములను ప్రభుత్వం లాక్కోవడంపై వైఎస్సార్ కాంగ్రెస్ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ రామ్‌శంకర్ కటేరియాను కలిసి విడిగా వినతిపత్రాలు సమర్పించారు. -
‘చంద్రబాబు దళిత వ్యతిరేకి’
ఒంగోలు: సీఎం చంద్రబాబు దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళిత భూములను ప్రభుత్వం లాక్కోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘంలో ఫిర్యాదు చేస్తామన్నారు. తక్షణమే దళితుల భూముల్లో చెరువు తవ్వకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నీరు-చెట్టు పేరుతో దళితుల భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకోవడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేవరపల్లి దళిత భూముల్లో చెరువు తవ్వడం సరికాదని వైఎస్సార్ సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. దళితులు ఆందోళన చేస్తుంటే పోలీసు పహారాలో చెరువు తవ్వడం దారుణమని వ్యాఖ్యానించారు. దళితులపై ప్రభుత్వం సామాజిక, ఆర్థిక దాడులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. -
దళితుల భూములు స్వాహా
♦ కోటిన్నర భూమిపై టీడీపీ నేత కన్ను ♦ చర్చి ఆస్తులకు చెందిన భూమికి పాస్‌బుక్ ♦ బినామీ పేర్లతో రిజిస్ట్రేషన్.. దళితుల ఆందోళన మార్కాపురం: Üుమారు కోటిన్నర రూపాయల విలువ చేసే చర్చి భూములపై పశ్చిమ ప్రకాశానికి చెందిన టీడీపీ ముఖ్య నేత కన్నుపడింది. పకడ్బందీగా ప్రణాళిక వేసి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి తన అనుచరులకు పాస్ పుస్తకాలు ఇప్పించుకుని అప్పనంగా 11.30 ఎకరాలు సొంతం చేసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. నేరుగా తన పేరు ఉంటే విమర్శలు వస్తాయని ముగ్గురు, నలుగురు వ్యక్తులు చేతులు మారిన తరువాత తన పేరున రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చూస్తున్నారని ఈ విషయం తెలిసిన దళితులు ఆందోళన చేసేందుకు సిద్ధమయ్యారు. పాస్ పుస్తకాలు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై దళితులు ముఖ్యమంత్రికి, రెవెన్యూ మంత్రికి, ఏసీబీ డైరెక్టర్ జనరల్‌కు, కలెక్టర్‌కు, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. వివరాలు... మార్కాపురం మండలంలోని నికరంపల్లె ఎస్సీలకు సుమారు వంద ఏళ్ల కిందట బ్రిటిష్ ప్రభుత్వం సర్వే నంబర్ 242–7లో 11.30 ఎకరాలను (ప్రస్తుత మార్కెట్ విలువ కోటిన్నర) బాప్టిస్ట్ మిషన్‌కు గానూ మూర్సి దొర వారి పేరుతో కేటాయించారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో నమోదు చేశారు. ఈ పొలాన్ని అమ్మేందుకు వీలు లేకుండా కేవలం నికరంపల్లె గ్రామ దళితులు సాగు చేసుకుని దానిపై వచ్చే ఆదాయంలో సగం చర్చి అభివృద్ధికి కేటాయించుకోవాలని అప్పట్లో తమ పెద్దలు తమకు చెప్పినట్లు గ్రామ దళితులు తెలిపారు. అయితే, ఈ ఏడాది మార్చిలో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి పాస్ పుస్తకం నంబర్ 19346, పట్టా నంబర్ 146తో మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన కొండేటి దివాకర్ పేరుతో జారీ అయింది. ఈ పొలాన్ని దివాకర్ మార్చి 27న 11.30 ఎకరాలను రూ.16.95 లక్షలకు మండల కేంద్రమైన పెద్దారవీడుకు చెందిన అల్లు వెంకటేశ్వరరెడ్డికి రిజిస్టర్ చేయటం గమనార్హం. కొండేటి దివాకర్, అల్లు వెంకటేశ్వరరెడ్డి ఇద్దరూ నియోజకవర్గ టీడీపీ ముఖ్యనేతకు అనుచరులు కావడం గమనార్హం. కొండేటి దివాకర్ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సమయంలో వ్యవహారశైలి సరిగా లేకపోవటంతో అధికారులు తొలగించారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో మూర్సి దొర పేరుతో ఉన్న పట్టా ఆకస్మికంగా కొండేటి దివాకర్ పేరుతో ఎలా వచ్చిందో రెవెన్యూ అధికారులకే తెలియాలి. అనువంశికంగా, పూర్వీకుల నుంచి వచ్చినట్లుగా పట్టాదారు అడంగల్‌లో నమోదు చేయటం రెవెన్యూ అధికారులకే చెల్లింది. తెర వెనుక నియోజకవర్గానికి చెందిన టీడీపీ ముఖ్య నేత రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి భారీ స్థాయిలో ముడుపులు అందించి కథ నడిపినట్లుగా దళితులు ఆరోపిస్తున్నారు. నికరంపల్లె గ్రామానికి సంబం«ధం లేని కొండేటి దివాకర్‌కు పాస్ పుస్తకం రావటం ఒక వింత అయితే, ఎటువంటి రికార్డులు పరిశీలించకుండా రెవెన్యూ అధికారులు యాజమాన్యపు హక్కుల రికార్డులో నమోదు చేయటం విశేషం. ఇందులో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు పనిచేస్తున్న రెవెన్యూ అధికారుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పష్టంగా నకిలీ పాస్ పుస్తకంగా గ్రామ దళితులు పేర్కొంటున్నారు. ఆన్లైన్లో నమోదు చేసేటప్పుడు రెవెన్యూ అధికారులు అన్ని రికార్డులను పరిశీలించాల్సి ఉండగా, ఈ సంఘటనలో అవేమీ లేకుండానే అధికార పార్టీ నేత చెప్పినట్లు కథ నడిపించారు. మిషనరీ ఆస్తులు అమ్మటం, కొనటం నేరమని రెవెన్యూ అధికారులకు తెలుసు. వారే చట్ట ఉల్లంఘన చేశారు. అన్యాక్రాంతమైన చర్చి భూములు 11 ఎకరాల్లో ఎకరా రూ.15 లక్షల ప్రకారం వేసుకున్నా, ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు కోటిన్నర ఉంటుంది. అసెంబ్లీలో ప్రస్తావిస్తా నికరంపల్లి చర్చి పొలాలను మార్కాపురం రెవెన్యూ అధికారులు తమ ఇష్టమొచ్చినట్లుగా మార్పు చేసి సంబంధం లేని వ్యక్తికి పాస్ పుస్తకంలో నమోదు చేసి ఇవ్వటం దారుణం. రికార్డులను పరిశీలించాలన్న ఆలోచన కూడా వారికి లేదు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశంలో స్పీకర్, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తా. ఆర్డీఓకు ఫిర్యాదు చేశాను. కలెక్టర్, జేసీ, రెవెన్యూ శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తున్నాం. ఇచ్చిన పాస్ పుస్తకాలు రద్దు చేసి చర్చి ఆస్తిగానే ఉంచాలి. – జంకె వెంకటరెడ్డి, ఎమ్మెల్యే -
రాజధానిలో 'బినామీ' దెయ్యం
-
రాజధానిలో 'బినామీ' దెయ్యం
దళితుల భూముల్లో కాసుల వేట.. 15 గ్రామాల్లో 990 ఎకరాలు హాంఫట్ - దొడ్డిదారిన అసైన్డ్,లంక భూముల రిజిస్ట్రేషన్ - బినామీల ముసుగులో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల దందా - రిజిస్ట్రేషన్లకు ముందే అడంగల్, 1 బీలోకి అసైన్డ్ భూములు - రెగ్యులరైజ్ చేసి పూలింగ్ యత్నం - విలువైన ప్లాట్లు కొట్టేసే పన్నాగం - ఆక్రమించుకున్న భూముల విలువ రూ.1,980 కోట్లు - కృష్ణా తీర భూముల్లో రిసార్టులు, మల్టీప్లెక్స్‌లు కట్టాలని ప్లాన్ సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో భారీ భూ బాగోతం బయటపడింది. అమరావతి పరిధిలో పేదల జీవనాధారం కోసం ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, లంక భూములను మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు బినామీ పేర్లతో దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. పేదలను భయపెట్టి, ఒత్తిడి తెచ్చి, ఎంతోకొంత చేతిలో పెట్టి నోరు మూయించారు. రాజధాని పరిధిలోని 15 గ్రామాల్లో రూ.1,980 కోట్ల విలువైన 990 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాహా చేశారు. అయితే, ఇందులో 507 రిజిస్ట్రేషన్లకు సంబంధించి 660 ఎకరాలను అధికారులు పెండింగ్‌లో పెట్టారు. వీటికోసం ప్రత్యేక జీవో తెచ్చి, రెగ్యులరైజ్ చేసుకుని, ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ)కు ఇచ్చి, ప్రభుత్వం నుంచి విలువైన ప్లాట్లు కొట్టేయటానికి అక్రమార్కులు పన్నాగాలు పన్నుతున్నారు. 330 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగి, డాక్యుమెంట్ నంబర్లు కూడా వచ్చినట్లు సమాచారం. సర్కారు భూములే టార్గెట్ అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు.. పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపై కన్నేశారు. తుళ్లూరు, మంగళగిరి,తాడేపల్లి పరిధిలో 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్ జమీందార్ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్ జమీందార్ భూములు ఉన్నాయి. వీటిని 1954, 1971, 1976, 2005లో భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం పంచిపెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను టార్గెట్ చేశారు. 990 ఎకరాల అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు. ఒత్తిళ్లు.. బెదిరింపులు.. పైరవీలు అసైన్డ్ భూముల సాగుదారులను దళారుల సహకారంతో బెదిరించారు. కొందరికి డబ్బు ఆశ చూపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు డబ్బుకు లొంగి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేశారు. మరికొందరిని బెదిరించి సంతకాలు చేయించుకున్నారు. ఇంకొందరిని బం«ధువుల ద్వారా పైరవీలు చేయించి లొంగదీసుకున్నారు. వేటికీ లొంగని వారిని పోలీసుల చేత భయపెట్టారు. అక్రమ కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. అలా ఒప్పించి ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున అనుభవదారులకు ముట్టజెప్పారు. రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు. తెరముందు బినామీలే.. వెంకటపాలెం గ్రామానికి చెందిన కొలికిపూడి ఏసుదాసుకి సర్వే నంబర్ 298/2లో 1.17 ఎకరాల భూమి ఉంది. ఆయన మరణించాక భార్య కొలికిపూడి ఎస్తేరురాణి పేరిట పాసుపుస్తకం, టైటిల్ డీడ్ ఇచ్చారు. అయితే, ఈ భూమిని 2015 అక్టోబర్ 19న అరుణ్‌కుమార్ కంటి మహంతి పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందుకుగాను ఎస్తేరురాణికి రూ.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. సర్వే నంబర్ 293/3లో నీలం నాగమణి అలియాస్ నాగమ్మ పేరిట 99 సెంట్లు, 302/9లో పులి అబ్రహం పేరిట 1.98 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని విశాఖపట్నానికి చెందిన అరుణ్‌కుమార్ కంటి మహంతి, సెరీన్ వివేక కంటి మహింతి, కోనేరు కుటుంబరావు, కోనేరు హిమబిందుకు విక్రయించినట్లు 2015 అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి బినామీలని సమాచారం. వెంకటపాలెం గ్రామంలో 330 ఎకరాల లంక, అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఉద్ధండ్రాయునిపాలెం, రాయపూడి, నవులూరు, కురగల్లు పరిధిలో అత్యధికంగా ప్రభుత్వ, లంక భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆన్లైన్లో రికార్డులు మాయం అసైన్డ్, లంక భూములను కొట్టేసే కుట్రలో భాగంగా టీడీపీ పెద్దలు ముందుగా రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపారు. ప్రభుత్వ భూములను రెవెన్యూ రికార్డులైన అడంగల్, 1బీలో నమోదు చేయించారు. వాటి ఆధారంగా రిజిస్ట్రార్లపై ఒత్తిడి చేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ తతంగమంతా పూర్తయ్యాక ఆన్లైన్లో అడంగల్, 1బీలను మాయం చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. అనంతరం వాటిని ల్యాండ్‌పూలింగ్‌కి ఇచ్చి, పరిహారం కింద ప్రభుత్వం నుంచి అత్యంత విలువైన ప్లాట్లు తీసుకోవాలని భావిస్తున్నారు. కృష్ణా నదీ తీరాన ఉన్న భూములను మాత్రం పూలింగ్‌కు ఇవ్వకుండా అందులో రిసార్టులు, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆక్రమించుకున్న అసైన్డ్, లంక భూముల విలువ దాదాపు రూ.1,980 కోట్లు ఉంటుందని అంచనా. -
దళితుల భూములపై సర్కారు డేగ
పరిశ్రమల కోసమంటూ అసైన్డ్ భూములు లాక్కుంటున్న ప్రభుత్వం సాక్షి, అమరావతి: తరతరాలుగా స్వేదం చిందించి సాగులోకి తెచ్చుకున్న దళితుల భూములను ప్రభుత్వం లాగేసుకుంటోంది. అడ్డొస్తే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఉన్న దళితులకు పట్టాలిస్తామని, అసైన్డ్ భూములకు నీళ్లిస్తామని ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడా భూములను బడాబాబులకు కట్టబెడతానంటోంది. ఈ పరిణామాలకు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతం మినహాయింపు కాదు. యావత్ రాష్ట్రంలోని దళిత వర్గాలు సర్కారు భూదాహానికి దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ప్రాణాలకు తెగించి పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. సర్కారు ఏర్పడి మూడేళ్లయినా ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ రాలేదు. పట్టుమని వంద మందికి ఉపాధి లభించిందీ లేదు. ప్రభుత్వం మాత్రం కుప్పలు తెప్పలుగా పరిశ్రమలు వస్తాయని, అందుకోసం 15 లక్షల ఎకరాలతో భూ బ్యాంక్ సిద్ధం చేయాలని ఏపీఐఐసీని ఆదేశించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ పేద వర్గాల అసైన్డ్ భూములపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ‘సీమ’లో బడుగు రైతులపై ఉక్కుపాదం చిత్తూరు జిల్లాలోని 22 మండలాల పరిధిలో 1,60,938 ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను తయారు చేసేందుకు ఏపీఐఐసీ సిద్ధమైంది. ఇందులో దళిత వర్గాల అధీనంలో ఉన్న అసైన్డ్ భూములే ఎక్కువగా ఉన్నాయి. తూర్పు నియోజకవర్గాలైన సత్యవేడు, శ్రీకాళహస్తిపై ప్రధానంగా కన్నేశారు. కర్నూలు జిల్లాలో 45,166 ఎకరాల భూమిని భూ బ్యాంక్‌గా గుర్తించారు. కర్నూలు, నంద్యాల, పాణ్యం, కల్లూరు, ఆదోని, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, ఓర్వకల్లు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల పరిధిలోని దళిత కుటుంబాల చేతుల్లో ఎన్నో ఏళ్లుగా దాదాపు 25 వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు మొదలైంది. అనంతపురం జిల్లా ధర్మవరం, అనంతపురం, పెనుకొండ, కళ్యాణదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్ల పరిధిలో 20 వేల ఎకరాల దళితుల భూములపై కార్పొరేట్ సంస్థలు కన్నేశాయి. వైఎస్ఆర్ జిల్లాలో 1.05 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామిక పెద్దలకు అప్పగించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఇప్పటికే 78 వేల ఎకరాలు సేకరించినట్టు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన భూమిని సేకరించేందుకు సర్వేలు పూర్తయ్యాయి. కన్ను పడితే చాలు ఖాళీ చేయాల్సిందే.. విజయనగరం జిల్లా గజపతినగరం పరిధిలోని కొణిశ రెవెన్యూ పరిధిలో 15 ఎకరాల భూమి 30 ఏళ్లుగా దళితుల అధీనంలో ఉంది. కొండలు తవ్వి, డొంకలు, తుప్పలు తొలగించి మరీ ఈ భూమిని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల కన్నుపడటంతో దళితులను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ ఇటీవలే బోర్డులు కూడా పెట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా మంటలు రేపుతోంది. భోగాపురం మండలం పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 1205 కుటుంబాలను రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మొత్తం 5,311 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2 వేల ఎకరాల్లో పేద దళిత వర్గాలున్నారు. ఇప్పటికే 2,628 మంది రైతులు తమ అభ్యంతరాలను రాత పూర్వకంగా తెలిపారు. అయినా ప్రభుత్వం కనికరం లేకుండా ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయించే ప్రయత్నాల్లోనే ఉంది. ► శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ పొగలు దళితుల జీవితాల్లో కార్చిచ్చు పెడుతున్నాయి. ఇప్పటికి 4,601 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 3 వేల ఎకరాలు దళిత వర్గాలకు చెందినదే. జిల్లాలో పొలాకీ థర్మల్ ప్లాంట్ కోసం 8 గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాలను ప్రభుత్వం లాక్కునేందుకు కసరత్తు చేస్తోంది. ► కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు పేరుతో పేద దళిత వర్గాలపై సర్కారీ పెద్దలు స్వారీ చేస్తున్నారు. 22 గ్రామాల్లో 14,472 ఎకరాల పట్టా భూములకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది కాకుండా 14,800 ఎకరాల దళితుల అసైన్డ్ భూమిపై కన్నేసింది. ఇప్పటికే 30 మంది తహసీల్దార్లు, 40 మంది సర్వేయర్లతో సర్వే చేయిం చింది. 26 వేల ఎకరాల అటవీ భూమిని డీనో టిఫై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన, హరిజనులే జీవనం సాగిస్తున్నారు. ► తూర్పుగోదావరి జిల్లాలో 49,427 ఎకరాలను పరిశ్రమల కోసం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 25 వేల ఎకరాలను గుర్తించారు. ఇందులో 18,413 ఎకరాలు దళిత వర్గాలకు చెందిన అసైన్డ్ భూములే. పశ్చిమగోదావరి జిల్లాలో 16 వేల అటవీ భూములను తీసుకునే ప్రయత్నం ఊపందుకుంది. ► నెల్లూరు జిల్లాలో సెజ్‌లు, పోర్ట్‌లు దళితుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ జిల్లాలో 75 వేల ఎకరాల భూ బ్యాంక్ టార్గెట్. ప్రకాశం జిల్లాలో 1,97,067 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇందులో 41,304 ఎకరాల భూమి దళిత వర్గాల చేతుల్లో ఉంది. ఏ ఎదను కదిపినా అదే బాధే.. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి, పెదరావుపల్లి, కాటకాపల్లి, గొల్లపేట, ఎల్ కోట మండలం భీమాళిలో దళిత కుటుంబాలే ఎక్కువ. అక్కడ వందలాది మంది దళితులు 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో తరతరాలుగా మామిడి, జీడిమామిడి తోటలను సాగు చేస్తున్నారు. తాతల కాలంలోనే కొండలు.. గుట్టలు బాగు చేసుకుని బతుకు బాటలు వేసుకున్నారు. ఇప్పుడీ భూమిలో 173 ఎకరాలు పతంజలి ఫుడ్ పార్క్‌కు ప్రభుత్వం రాసిచ్చేసింది. దళితులను ఖాళీ చేయమంటూ అధికారులు వేధిస్తున్నారు. డాక్యుమెంట్లు లేవంటూ అరకొర పరిహారం ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో ఏ దళిత కుటుంబాన్ని కదిలించినా ఆందోళనే కన్పిస్తోంది. వేపాడు మండలం మారిక గ్రామ భూములపై అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడటంతో గిరిజనులను బెదిరిస్తున్నారు. -
పరిపాలనకు బాబు యోగ్యుడేనా?
మూడేళ్లలో ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదు: వైఎస్ జగన్ ♦ ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను అత్తగారి సొత్తులా లాక్కుంటున్నారు ♦ కరువు మండలాలను పేరుకు ప్రకటిస్తున్నా మేలు సున్నా ♦ ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఏదీ? ♦ మూడేళ్లలో ఒక్క ఇల్లూ కట్టించలేదు ♦ ఆరోగ్యశ్రీ, ఫీజుల పథకాలు నిర్వీర్యం ♦ వైఎస్ స్వప్నం బజారున పడే పరిస్థితి దాపురించింది ♦ కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ తొలి విడత ముగింపు రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రతినిధి, కర్నూలు:‘‘రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన లెక్కలేనన్ని హామీల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కరికి కూడా ఇల్లు కట్టించి ఇవ్వ లేదు. పేదలకు ఒక్క ఎకరా భూమినైనా పంచలేదు. పైగా ఎస్సీ, ఎస్టీల భూములు ఆయన అత్తగారి సొత్తు అయినట్టు లాగేసుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి పరిపాలనకు యోగ్యుడేనా?’’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిప్పులు చెరిగారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను కలసి, ధైర్యం చెప్పేందుకు జగన్ చేపట్టిన ‘రైతు భరోసా యాత్ర’ కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో మంగళ వారం ఆరో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన వెంగళరెడ్డి పేట నుంచి బయలుదేరి బుక్కాపురం, అల్లినగరం, శ్రీనగరం మీదుగా మహానందికి చేరుకున్నారు. మహానందిలో శివుడిని దర్శించుకున్నారు. అనంతరం గాజులపల్లెకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో భారీ జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. కర్నూలు జిల్లాలో మొదటి విడత ‘రైతు భరోసా యాత్ర’ మంగళవారం ముగిసింది. చివరి రోజు యాత్ర ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3 గంటల వరకూ సాగింది. గాజులపల్లె బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే... చంద్రబాబుతో పాటు వచ్చింది కరువే ‘‘ఈ మూడేళ్ల చంద్రబాబు పాలనను చూసిన తర్వాత... అయ్యో ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మాకు దూరమయ్యిందే, ఆ పాలన మాకు కరువయ్యిందే అని జనం అనుకుం టున్నారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి జాడేలేదు. ఈ మూడేళ్లు చంద్రబాబుతో పాటు రాష్ట్రానికి వచ్చింది కరువు మాత్రమే. శ్రీశైలం డ్యామ్ నుంచి పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వాలంటే 844 అడుగులకు పైన నీళ్లు ఉండాలి. 844 అడుగులపైన ఆగస్టు 16వ తేదీ నుంచి ఉన్నాయి. అయినా ఇప్పటిదాకా సాగునీరు ఇవ్వలేకపోయారు. మనకు తెలుగుగంగకు రబీ పంటకు నీరు ఇవ్వబోమని చెబుతున్నారు. ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రతీ సంవత్సరమూ రబీకి నీళ్లు అందాయి. ఇప్పుడు వరుసగా మూడేళ్లపాటు రబీకి నీళ్లు ఇవ్వబోమని పాలకులు సిగ్గు లేకుండా చెప్పే పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. కేబినెట్ భేటీల్లో దుర్మార్గపు ఆలోచనలు మంత్రివర్గ సమావేశాల్లో రైతుల కష్టాలపై చర్చించరు. పేదవాడికి జరగాల్సిన మేలు గురించి మాట్లాడరు. రైతుల భూములను ఎలా లాక్కోవాలి? లాక్కున్న భూములను పారిశ్రామికవేత్తలకు, బడాబాబులకు, సింగపూర్ కంపెనీలకు ఇచ్చి కమీషన్లు ఎలా కొల్లగొట్టాలనే దుర్మార్గపు ఆలోచనలను కేబినెట్ భేటీల్లో చేస్తుంటారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన పాలనలో 23 లక్షల మంది పేదలకు అక్షరాలా 31.25 లక్షల ఎకరాలను పంచిపెట్టారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎస్సీ, ఎస్టీల భూములను తన అత్తగారి సొత్తులా భావిస్తున్నారు. పేదల భూములు, అసైన్డ్ భూములు కనిపిస్తే చాలు వాటిని ఎలా లాక్కోవాలనే దిక్కుమాలిన ఆలోచన చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి 31.25 లక్షల ఎకరాలను పేదలకు పంచగా, చంద్రబాబు ఈ మూడేళ్ల పాలనలో ఒక్క ఎకరా కూడా ఇచ్చిన పాపానపోలేదు. దేశవ్యాప్తంగా మొత్తం 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే, వైఎస్సార్ హయాంలో కేవలం ఒక్క మన రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టించి దేశంతో పోటీపడ్డారు. చంద్రబాబు మాత్రం మూడేళ్లలో ఒక్క ఇల్లు కూడా కట్టించలేదు. కుయ్.. కుయ్.. కుయ్.. ఇప్పుడేది? చంద్రబాబు పాలనలో ఆరోగ్యశ్రీ పథకం పరిస్థితిని గమనిస్తే మరింత బాధేస్తోంది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో ‘108’ నంబర్‌కు ఫోన్ కొడితే చాలు కుయ్... కుయ్... కుయ్.. అంటూ 20 నిమిషాల్లోనే అంబులెన్స్ ఇంటికొచ్చేది. ఇప్పుడు అంబులెన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. వైఎస్సార్ హయాంలో మూగ, చెవుడుతో బాధపడుతున్న చిన్నారులకు 12 ఏళ్లు వచ్చేదాకా రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు ఖర్చయ్యే కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ఉచితంగా చేసేవారు. ఇవాళ మూగ, చెవుడు పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్తే ఆరోగ్యశ్రీ కింద మేము వైద్యం చేయం అంటూ వెనక్కి పంపిస్తున్నారు. మూత్రపిండాలు ఫెయిలైన రోగులదీ, కేన్సర్ రోగులదీ అదే పరిస్థితి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వప్నం బజారున పడే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు పాలనలో మంచి జరిగిందని ఎవరైనా చెప్పగలరా? బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అప్పట్లో అన్నాడా? లేదా? రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని అన్నాడా? లేదా? డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నాడా? లేదా? (అన్నాడని ప్రజలంతా బిగ్గరగా బదులిచ్చారు) హామీల అమలు కోసం ప్రజలంతా చంద్రబాబును గట్టిగా నిలదీయాలి. అప్పటికైనా ఆయనకు జ్ఞానోదయం అవుతుందేమోనని ఆశిద్దాం. బాబు పచ్చి అబద్ధాలకోరు చంద్రబాబు మూడేళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదు. కానీ, తానే చేశానని అంటున్నారు. కర్నూలు జిల్లాలోనే ముచ్చుమర్రి ప్రాజెక్టును చూశాం. వైఎస్ హయాంలోనే 90 శాతం పూర్తయ్యింది. మూడేళ్ల నుంచి మిగిలిన 10 శాతం పనులను పూర్తిచేయకుండానే ప్రాజెక్టును ప్రారంభించారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు తన కలలోకి వచ్చిందని, దాని కోసం చాలా కష్టపడ్డానని చంద్రబాబు చెబుతున్నారు. ఇలాంటి వ్యక్తి పాలనకు యోగ్యుడేనా అని అడుగుతున్నా. చంద్రబాబు రేపు పులివెందులకు వెళుతున్నారు. రూ.700 కోట్ల పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేయనున్నారు. చంద్రబాబు తన మనఃసాక్షిని ప్రశ్నించుకోవాలి. అసలు ఈ ప్రాజెక్టు ఎవరి హయాంలో వచ్చింది? ఈ ప్రాజెక్టును ప్రారంభించింది, పనులు చేసింది దివంగత నేత వైఎస్సార్ హయాంలోనే. ఇప్పుడు అక్కడికి వెళ్లి పైడిపాలెం కూడా తన కలలోకి వచ్చిందని చంద్రబాబు చెబుతారేమో! ఇలాంటి వ్యక్తిని బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గర్లోనే ఉంది. అందరూ అడుగులో అడుగు వేసి, చేతిలో చేయి వేసి నాతోపాటు కలిసి నడవాలని కోరుతున్నా’’ అని వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా, కర్నూలు జిల్లాలో రెండోవిడత రైతు భరోసా యాత్ర ఈ నెల 19 నుంచి ప్రారంభమవనుంది. కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో వెలసిన శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి సన్నిధిలో వైఎస్ జగన్ మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి అభిషేకం, కుంకుమార్చన పూజలను నిర్వహించారు. అలాగే శ్రీ కోదండరాముల వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వైఎస్ జగన్‌ను ఆశీర్వదించారు. – మహానంది -
ఆరో రోజూ..రైతు భరోసా యాత్ర
-
లాక్కోడానికి అవేమైనా అత్తగారి సొమ్ములా?
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆయన అత్తగారి సొమ్ములా దళితుల భూములు లాక్కుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రైతు భరోసాయాత్రలో భాగంగా మహానంది మండలం గాజులపల్లిలో ఆయన మాట్లాడారు. అధికారిక లెక్కల ప్రకారమే కర్నూలు జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ఎక్స్‌గ్రేషియా మాత్రం కేవలం నలుగురికే ఇచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని, మూడేళ్ల నుంచి ఇక్కడ కరువే కరువని జగన్ అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైఎస్ హయాంలోప్రతి రబీ పంటకు శ్రీశైలం నుంచి నీళ్లు అందాయని, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 844 అడుగుల నీటిమట్టం ఉన్నా కూడా రాయలసీమ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా దక్కడం లేదన్నారు. కేబినెట్ సమావేశాల్లో కూడా రైతుల సమస్యలపై మాట్లాడకుండా.. భూములు ఎలా లాక్కోవాలనే విషయంపైనే మాట్లాడుతున్నారని అన్నారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే, చంద్రబాబు ఇప్పుడు దాన్ని కూడా నీరుగార్చారని జగన్ విమర్శించారు. 108, ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదని, కాక్లియర్ ఇంప్లాట్ల కోసం మూడేసి సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. పేదలు చదువుకోవాలనే సదుద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పెడితే, చంద్రబాబు దాన్ని కూడా పక్కన పెట్టేశారన్నారు. అబద్ధపు హామీలతో రైతులు, మహిళలు, విద్యార్థులతో సహా ఎవరినీ వదిలిపెట్టకుండా చంద్రబాబు అందరినీ మోసం చేశారన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులన్నీ 90 శాతం పూర్తయ్యాయని, ఇప్పుడు చంద్రబాబు 5 శాతం మాత్రమే పనులు చేసి ఆ ప్రాజెక్టులన్నింటినీ తానే కట్టించినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తిని మనందరం ఒక్కటై బంగాళాఖాతంలో కలిపేద్దామని కర్నూలు వాసులకు ఆయన పిలుపునిచ్చారు. -
లాక్కోడానికి అవేమైనా అత్తగారి సొమ్ములా?
-
ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత
- ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డికి వ్యతిరేకంగా సదస్సు - దళితుల భూములు ఆక్రమించుకున్నారని ఆరోపణ - అఖిలపక్ష నేతలను అరెస్టు చేసిన పోలీసులు - అన్ని దారులనూ మూసేసి ముమ్మర తనిఖీలు - పోలీసుల వలయాన్ని ఛేదించుకుని వచ్చిన వివిధ పార్టీల నేతలు ఎల్లారెడ్డి: దళితుల భూములనూ, ప్రభుత్వ భూములనూ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఆక్రమించుకున్నారని ఆరోపి స్తూ అఖిలపక్షాలు గురువారం ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేయ తలపెట్టిన సదస్సు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిం ది. నాయకుల అరెస్టుతో అర్ధంతరంగా రద్దయ్యింది. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి వచ్చే దారులన్నిటిని పోలీసులు దిగ్బంధించినా మారుమూల గ్రామాల గుండా ఎల్లారెడ్డి పట్టణానికి చేరుకున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేసి, అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేసి తరలించే క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పోలీసులు ఎల్లారెడ్డిని అష్ట దిగ్బంధనం చేశారు. అసలేం జరిగింది ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి స్వగ్రామం ఎర్రాపహాడ్‌లో దళితుల భూములను ఆక్రమించారంటూ ఎంఆర్పీఎస్, వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం ఎల్లారెడ్డిలోని బాలా గౌడ్ ఫంక్షన్హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో పోలీసులు ఈ సమావేశానికి అనుమతి నిరాకరించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతి నిరాకరించడం, దివంగత రాష్ర్తపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు జరుగుతున్న దృ ష్ట్యా అఖిలపక్ష సమావేశాన్ని రద్దు చేసి ముఖ్యనాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయూలని నేతలు భావించారు. ఈ సమావేశానికి వస్తున్న నేతలను కూడా పోలీసులు నిరోధించారు. కామారెడ్డి వైపు నుంచి వస్తున్న నేతలను అరెస్ట్ చేసి భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎల్లారెడ్డి వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు లు, వాహనాలను తనిఖీ చేసి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గట్టి నిఘా ఉంచడంతో గాంధారి మండలంలోని మారుమూల దారుల గుండా సీపీఐ (ఎం) జిల్లా కార్యదర్శి దండు వెంకట్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, వైఎస్ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి గైనికాడి విజయలక్ష్మి, సామాజిక కార్యకర్త బంగారుసాయిలు, జిల్లా అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు నారాయణ, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి సుభాష్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి నల్లమడుగు సురేందర్ తదితరులు ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌరస్తాకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, పా లాభిషేకం చేస్తున్న నేతలను సీఐ రామకృష్ణ నేతృత్వంలో అరెస్ట్ చేసి ఎల్లారెడ్డి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. భూములు తిరిగి ఇచ్చేదాకా పోరాటం పోలీసుస్టేషన్లోనే అఖిలపక్ష నేతలు విలేకరులతో మాట్లాడారు. రవీందర్‌రెడ్డి దౌర్జన్యపాలన జరుపుతున్నారని, అధికారం ఉంది కదా అని తన ఫాంహౌజ్ నిర్మాణం కోసం దళితుల భూములను, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు. అఖిలపక్ష సమావేశానికి పోలీసుల ద్వారా అనుమతి రాకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. దళితుల భూములు తిరిగి వారికి అప్పగించేవరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే భూములను ఆక్రమించకుంటే, అందుకు తగిన సాక్ష్యాధారాలు అందజేయాలని కోరారు. నియోజకవర్గంలో ఏ సమ స్యను గురించి అడిగినా, వారిని అక్రమంగా అరెస్ట్ చేయిస్తున్నారని, ఎమెర్జెన్సీ కాలం కంటే ఘోరంగాపరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. తెలంగాణ పేరు మీద మూ డు మార్లు గెలిచిన రవీందర్‌రెడ్డి అభివృద్ధి మరిచి సొంత ఆస్తులు కూడ బెట్టుకోవడానికి అధికారాన్ని వాడు కుంటున్నారని అన్నారు. ఆయన ఎమ్మెల్యే కాకముందు ఎన్ని ఆస్తులు ఉండేవో, ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎక్కడివో సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకుడు సిద్ధిరాములు, స్టూడెం ట్స్ జేఏసీ రాష్ర్త అధ్యక్షుడు సర్దార్‌సింగ్, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజు, మాలమహానాడు బాన్స్వాడ ఇన్చార్జి సంగయ్య, సీపీఎంఎల్ కామారెడ్డి నియో జకవర్గ ఇన్చార్జి కట్ల భూమన్న, సీఐటీయూ నాయకురాలు నూర్జహాన్, అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బిట్ల సురేందర్, మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు పద్మారావు, మండల టీడీపీ అధ్యక్షుడు నాగం పరంధాములు తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి పూచీకత్తుపై విడుదల చేశారు.