సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణలో హత్యా రాజకీయాలు చెల్లవని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా తెలంగాణలో హత్య రాజకీయాలు మొదలయ్యాయని మండిపడ్డారు. పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగితే ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణలో హింసా రాజకీయాల సంస్కృతిని ప్రోత్సహిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
కొల్లాపూర్‌లో కాంగ్రెస్ నాయకుల చేతిలో హత్యకు గురైన బీఆర్‌ఎస్ కార్యకర్త రిటైర్డ్ ఆర్మీ జవాన్ మల్లేష్ కుటుంబాన్ని ఆదివారం కేటీఆర్ పరామర్శించారు. మల్లేష్ కుటుంబానికి పార్టీ తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో కేటీఆర్ వెంట పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అంతకుముందు కేటీఆర్ ఇటీవలే సోదరుడిని కోల్పోయిన దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు. వెంకటేశ్వర్‌రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment