
సాక్షి,హైదరాబాద్ : ‘సర్వే రిపోర్ట్‌ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు..మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కులగణనపై తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న ప్రత్యేక చర్చలో కేటీఆర్ మాట్లాడారు.
‘42 శాతం రిజర్వేషన్లు అమలు కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడుతున్నారు అనుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదు. సమగ్ర కుటుంబ సర్వేపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని అధికారులకు గుర్తు చేశాం. సమగ్ర కుటుంబ సర్వేను అధికారులే చేశారు. ఆ డాక్యుమెంట్ అందుకే వెబ్‌సైట్స్‌లో పెట్టాం. సమగ్ర కుటుంబ సర్వే 3కోట్ల 64లక్షలు పాల్గొన్నారు. 51శాతం. ముస్లింలు 10 శాతం వాళ్లను కలిపితే మొత్తం 61 శాతం. కాంగ్రెస్ సర్వే రిపోర్ట్‌ను తగలపెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీలే అన్నారు. ఇవ్వాళ సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు.. మొన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కొత్త లెక్కలు ఏం ఉన్నాయి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment