న్యూఢిల్లీ: తెలంగాణకు చేయూత నివ్వాలని గతంలో చాలాసార్లు కేంద్రాన్ని కోరామని తెలంగాణ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని, 9 ఏళ్లలో కేంద్రం పైసా సాయం కూడా చేయలేదని విమర్శించారు. ఈ మేరకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కేటీఆర్ శుక్రవారం కలిశారు. ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రులను కోరినట్లు తెలిపారు. పటాన్‌చెరు నుంచి హయత్‌నగర్ వరకు మెట్రో విస్తరణకు సహకరించాలని కోరామని పేర్కొన్నారు. కేంద్రం సహకరిస్తే సంతోషం.. లేదంటే ప్రజాక్షేత్రంలో ఎండగడతామని స్పష్టం చేశారు.
హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందని కేటీఆర్ తెలిపారు. వ్యాక్సిన్ ఉత్పత్తికి హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు. 2020లో హైదరాబాద్‌లో భారీగా వదరలు వచ్చినా కేంద్రం సాయం చేయలేదని మండిపడ్డారు. హైదరాబాద్‌లోస్కై వాక్స్ నిర్మిస్తున్నామని, ఉప్పల్‌లో స్కై వాక్‌ను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ప్యాట్నీ నుంచి 18.8 కి.మీ స్కైవే నిర్మించాలని నిర్ణయించామని, స్కై కారిడార్‌తోపాటు ఇతర నిర్మాణాలకు సహకరించాలని కోరినట్లు చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్‌ను నాలుగు విషయాలు అడిగానని, అయిదుగురు కేంద్ర మంత్రులను 15 సార్లకు పైగా కలిశానని పేర్కొన్నారు.
‘తెలంగాణకు చేయూతనివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నాం. రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని కోరుతున్నాం. రాజీవ్ రహదారిలో స్కైవే నిర్మాణానికి 96 ఎకరాల కంటోన్మెంట్‌ల్యాండ్ అడిగాం. ల్యాండ్ ఫర్‌ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పాం. లీజ్‌ల్యాండ్స్‌ను జీహెచ్‌ఎంసీకి బదలాయించాలని కోరాం. ఎన్నిసార్లు అడిగినా కేంద్రం స్పందించడం లేదు. . రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం లోపం లేకుండా పోరాడుతున్నాం. స్పందించి ఇస్తే మంచింది.. లేకుంటే వాళ్ల ఖర్మ.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
చదవండి: ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి రండి.. బీజేపీలో కీలక పరిణామం!
Comments
Please login to add a commentAdd a comment