Krishnam Raju Wife Shyamala Devi Interesting Comments On Prabhas Wedding, Deets Inside - Sakshi
Sakshi News home page

Prabhas Marriage: ప్రభాస్-అనుష్క పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు సతీమణి!

Published Tue, Mar 8 2022 11:32 PM | Last Updated on Wed, Mar 9 2022 8:22 AM

Prabhas Wedding Will Be Soon Says Krishnam Raju Wife Shyamala Devi - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఆయన పెళ్లిపై ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ వాటీలో క్లారిటీ అనేది ఉండదు. కాగా ప్రభాస్ పెళ్లిపై అభిమానులతో పాటు టాలీవుడ్‌ జనాలు సైతం ఎదురు చూస్తున్నారు.

కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అంటేనే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడనే చెప్పాలి. అయితే తాజాగా 'రాధే శ్యామ్‌' చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు ఇదే ప్రశ్న ఎదురవ్వగా..లవ్ ఫెయిల్యూర్ అంటూ మాట దాటేశాడు.

ఇక ఎప్పటి నుంచో మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ప్రభాస్‌, అనుష్క పెళ్లి. అయితే తాజాగా ఈ వార్తలను ప్రభాస్ పెద్దమ్మ, రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి స్పందించారు. ఇంతకీ వీరి పెళ్లిపై ఆమె ఏమన్నారంటే.. ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్లు మంచి ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు.. అంటూ ఈ వార్తలను ఖండించారు. 

ప్రభాస్‌కి మన సంస్కృతి సంప్రదాయాలన్నా, మహిళలన్నా అమితమైన గౌరవం ఉంది. అలాగే తన కుటుంబానికి, ఇంటి పెద్దలకు గౌరవం ఇస్తాడు. అయితే ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడంటూ శ్యామల దేవి తెలిపారు. ఇక అలాగే ప్రభాస్‌ చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన వారా అనే ప్రశ్నకు సమాదానంగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. త్వరలోనే మీకు తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయ్యాల్సిందే అంటున్నారు శ్యామల దేవి. 

ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్‌ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్‌' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement