shamala devi
-
ప్రభాస్-అనుష్క పెళ్లి..? క్లారిటీ ఇచ్చిన కృష్ణంరాజు సతీమణి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లిపై ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవల కాలంలో ఆయన పెళ్లిపై ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ వాటీలో క్లారిటీ అనేది ఉండదు. కాగా ప్రభాస్ పెళ్లిపై అభిమానులతో పాటు టాలీవుడ్ జనాలు సైతం ఎదురు చూస్తున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అంటేనే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడనే చెప్పాలి. అయితే తాజాగా 'రాధే శ్యామ్' చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్న ప్రభాస్‌కు ఇదే ప్రశ్న ఎదురవ్వగా..లవ్ ఫెయిల్యూర్ అంటూ మాట దాటేశాడు. ఇక ఎప్పటి నుంచో మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్త ప్రభాస్, అనుష్క పెళ్లి. అయితే తాజాగా ఈ వార్తలను ప్రభాస్ పెద్దమ్మ, రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామల దేవి స్పందించారు. ఇంతకీ వీరి పెళ్లిపై ఆమె ఏమన్నారంటే.. ప్రభాస్ అనుష్కల పెళ్లి జరగదు. ఎందుకంటే వాళ్లు మంచి ఫ్రెండ్స్, వాళ్ళ మధ్య అలాంటి ఫీలింగ్స్ లేవు.. అంటూ ఈ వార్తలను ఖండించారు. ప్రభాస్‌కి మన సంస్కృతి సంప్రదాయాలన్నా, మహిళలన్నా అమితమైన గౌరవం ఉంది. అలాగే తన కుటుంబానికి, ఇంటి పెద్దలకు గౌరవం ఇస్తాడు. అయితే ప్రభాస్ ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఆయన బిజీగా ఉన్నాడంటూ శ్యామల దేవి తెలిపారు. ఇక అలాగే ప్రభాస్ చేసుకోబోయే అమ్మాయి ఇండస్ట్రీకి సంబంధించిన వారా అనే ప్రశ్నకు సమాదానంగా ఆ విషయం ఇప్పుడే చెప్పలేను. త్వరలోనే మీకు తెలుస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయ్యాల్సిందే అంటున్నారు శ్యామల దేవి. ఇక ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్' మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న విషయం తెలిసిందే. -
పెద్ద దర్గాలో కృష్ణంరాజు
-
పెద్ద దర్గాలో కృష్ణంరాజు
కడప కల్చరల్/ఒంటిమిట్ట, న్యూస్‌లైన్: బీజేపీ రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం కడపలోని అమీన్‌పీర్(పెద్ద పెద్దా)ను దర్శించుకున్నారు. భార్య శ్యామలాదేవితో కలసి ఆయన దర్గాలోని ప్రధాన మజార్ వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధి నయీమ్ వారికి దర్గా గురువుల చరిత్ర, విశిష్ఠతలను వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పెద్దదర్గా దర్శనంతో ఎంతో గొప్ప అనుభూతి కలిగిందన్నారు. అంతకు ముందు ఆయన ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. స్వామిని దర్శించుకున్నాక ప్రతే ్యక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను ఘనంగా సత్కరించారు.