బీజేపీ రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం కడపలోని అమీన్‌పీర్(పెద్ద పెద్దా)ను దర్శించుకున్నారు.
కడప కల్చరల్/ఒంటిమిట్ట, న్యూస్‌లైన్: బీజేపీ రాష్ట్ర నాయకుడు, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు గురువారం కడపలోని అమీన్‌పీర్(పెద్ద పెద్దా)ను దర్శించుకున్నారు. భార్య శ్యామలాదేవితో కలసి ఆయన దర్గాలోని ప్రధాన మజార్ వద్ద ప్రార్థనలు చేశారు. దర్గా ప్రాంగణంలోని ఇతర గురువుల మజార్లను దర్శించుకుని ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధి నయీమ్ వారికి దర్గా గురువుల చరిత్ర, విశిష్ఠతలను వివరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పెద్దదర్గా దర్శనంతో ఎంతో గొప్ప అనుభూతి కలిగిందన్నారు. అంతకు ముందు ఆయన ఒంటిమిట్ట కోదండరామాలయాన్నీ సతీసమేతంగా సందర్శించారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం లభించింది. స్వామిని దర్శించుకున్నాక ప్రతే ్యక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేయించారు. అనంతరం పూలమాల, దుశ్శాలువాలతో కృష్ణంరాజు దంపతులను ఘనంగా సత్కరించారు.