
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల పోలింగ్‌ను బ్యాలెట్ పద్దతిలోనే నిర్వహిస్తామని తాజాగా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ స్పష్టం చేశారు. ‘మా’ ఎన్నికల పోలింగ్‌పై ఆయన వివరణ ఇచ్చారు. ‘పేపర్ బ్యాలెట్ విధానం ద్వారానే ఎన్నికలు జరపాలని మంచు విష్ణు లేఖ రాశారు. ఈవీఎంల ద్వారా పోలింగ్ జరపాలని ప్రకాశ్ రాజ్ కోరారు. వీరిద్దరి ప్రతి పాదనలను క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కృష్ణం రాజు దృష్టికి తీసుకెళ్లాం.
చదవండి: ‘మా’ ఎన్నికల అధికారికి మంచు విష్ణు లేఖ
క్రమ శిక్షణ కమిటీ ఛైర్మన్ కూడా బ్యాలెట్ పోలింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ‘మా’ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలోనే పోలింగ్ నిర్వహిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్థానిక ఎన్నికలు కూడా బ్యాలెట్ పద్దతిలోనే జరిగాయి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలు కూడా బ్యాలెట్ విధానంలోనే నిర్వహించారు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment