'మా' ఎన్నికలు: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు | MAA Elections 2021: Manchu Vishnu Meets Rebel Star Krishnam Raju | Sakshi
Sakshi News home page

MAA Elections 2021: కృష్ణం రాజును కలిసిన మంచు విష్ణు

Published Mon, Oct 4 2021 1:39 PM | Last Updated on Mon, Oct 4 2021 4:49 PM

MAA Elections 2021: Manchu Vishnu Meets Rebel Star Krishnam Raju - Sakshi

MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తాజాగా రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుతో మంచు విష్ణు భేటీ అయ్యారు. మా ఎన్నికల్లో తనకు మద్ధతు ఇవ్వాలని ఈ సందర్భంగా విష్ణు కోరారు. స్వయంగా కృష్ణం రాజు ఇంటికి వెళ్లి ఆయన ఆశీ‍స్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను షేర్‌ చేస్తూ.. రియల్‌  రెబల్‌ స్టార్‌  కృష్ణంరాజు నుంచి  ఆశీస్సులు అందాయంటూ మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. చదవండి: 'మా' ఎన్నికల్లో మద్దతుపై ప్రకాశ్‌ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు

మా ఎన్నికల్లో తన బలం పుంజుకుంటుందంటూ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా అక్టోబర్‌ 10న మా ఎ‍న్నికలు జరగనున్నాయి. ‘మా’ అధ్యక్ష పదవి కోసం  ప్రకాశ్‌ రాజ్‌, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది. చదవండి: MAA Elections 2021: మంచు విష్ణుకు బాలయ్య మద్ధతు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement